...
...
Next Story

OTT Independence Day Movies: ఓటీటీలో ఈ ఇండిపెండెన్స్ డేకి మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 రియల్ లైఫ్ హీరోల సినిమాలు ఇవే

OTT Independence Day Movies: ఇండిపెండెన్స్ డే వచ్చేస్తోంది. ఆ రోజు ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన రియల్ లైఫ్ హీరోల మూవీస్ 5 ఉన్నాయి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ఆ సినిమాలను ఈ వీకెండ్ చూసేయండి.

Published on: Aug 11, 2026, 19:24:00 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Independence Day Movies: ఈ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశభక్తిని నరనరాల్లో నింపే 5 యథార్థ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ఓటీటీల్లో అలరిస్తున్నాయి. మన మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోల త్యాగాలను కళ్లముందు ఉంచే ఈ బయోపిక్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కుటుంబంతో కలిసి చూడాల్సిన ఆ టాప్ 5 రియల్ లైఫ్ మూవీస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. 'షేర్షా' (Shershaah) - ప్రైమ్ వీడియో

OTT Independence Day Movies: ఓటీటీలో ఈ ఇండిపెండెన్స్ డేకి మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 రియల్ లైఫ్ హీరోల సినిమాలు ఇవే
OTT Independence Day Movies: ఓటీటీలో ఈ ఇండిపెండెన్స్ డేకి మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 రియల్ లైఫ్ హీరోల సినిమాలు ఇవే

1999 కార్గిల్ యుద్ధంలో శత్రుమూకలను చీల్చిచెండాడి అమరుడైన పరమ్ వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్రా నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'షేర్షా'. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది.

2021లో కరోనా పరిస్థితుల వల్ల నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఐఎమ్‌డీబీ (IMDb) లో 8.3 రేటింగ్‌తో నిలిచిన ఈ సినిమాలోని "దిల్ మాంగే మోర్" డైలాగ్, యుద్ధ సన్నివేశాలు ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని రగిలిస్తాయి.

2. 'ఇక్కీస్' (Ikkis) - ప్రైమ్ వీడియో

1971 ఇండో-పాక్ యుద్ధంలో కేవలం 21 ఏళ్ల చిన్న వయసులోనే అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన పరమ్ వీర్ చక్ర లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా 'ఇక్కీస్' సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అగస్త్య నంద హీరోగా నటించారు.

ఈ సినిమా థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినా, ఒక యువ సైనికుడి త్యాగాన్ని ఆవిష్కరించిన తీరు సినీ ప్రియుల మనసులను గెలుచుకుంది. ఈ చిత్రానికి ఐఎండీబీలో 6.1 రేటింగ్ ఉంది. ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

3. 'సర్దార్ ఉధమ్' (Sardar Udham) - ప్రైమ్ వీడియో

దర్శకుడు షూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఈ క్లాసిక్ బయోపిక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్ సాధించిన ఈ చిత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పేట్రియాటిక్ మూవీగా నిలిచింది.

4. 'రాజీ' (Raazi) - నెట్‌ఫ్లిక్స్

రచయిత హరిందర్ సిక్కా రాసిన 'కాలింగ్ సెహమత్' నవల ఆధారంగా దర్శకురాలు మేఘ్నా గుల్జార్ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం 'రాజీ'. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ, పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్ కుటుంబాన్ని పెళ్లి చేసుకుని వెళ్లిన ఒక కశ్మీరీ నిగూఢ గూఢచారి సెహమత్ నిజమైన కథ ఇది.

అలియా భట్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్‌తో నిలిచిన ఈ సినిమా ప్రతీ భారతీయుడి గుండెను తాకుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

5. 'నీర్జా' (Neerja) - ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్

1986లో పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్ అయినప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన ధైర్యవంతురాలైన ఫ్లైట్ అటెండెంట్ నీర్జా భానోత్ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రామ్ మాధ్వాని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సోనమ్ కపూర్ టైటిల్ పాత్ర పోషించారు.

ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రయాణికులను కాపాడిన నీర్జా త్యాగం అందరినీ కంటితడి పెట్టిస్తుంది. అత్యున్నత పౌర పురస్కారం అశోక చక్ర అందుకున్న పిన్న వయస్కురాలిగా నీర్జా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe