OTT Thrillers: ఓటీటీలో టాప్ 5 మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. ట్విస్టులకు బిత్తరపోవాల్సిందే..

OTT Thrillers: థియేటర్లలో ప్రస్తుతం హిందీ దృశ్యం 3 చెలరేగుతున్న వేళ ఓటీటీలో ఉన్న కొన్ని థ్రిల్లర్ సినిమాలు మిస్ కాకుండా చూడాల్సిందే. వీటిలో సౌత్ నుంచి రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో చూడండి.

Published on: Oct 3, 2026, 10:07:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Thrillers: అజయ్ దేవ్‌గణ్, టబు కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం 3’ (Drishyam 3) ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.54 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విజయ్ సల్గాంకర్ ఫ్యామిలీ మిస్టరీకి పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్ పడటంతో థ్రిల్లర్ లవర్స్ నెక్స్ట్ ఏ సినిమా చూడాలా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. మీరు కూడా అలాంటి మైండ్ బెండింగ్ ట్విస్టులు ఉండే కంటెంట్ కోసం వెతుకుతుంటే.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 5 అల్టిమేట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అస్సలు మిస్ కాకూడదు.

OTT Thrillers: ఓటీటీలో గూస్‌బంప్స్ తెప్పించే 5 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. ట్విస్టులకు మైండ్ బ్లాకవ్వాల్సిందే
OTT Thrillers: ఓటీటీలో గూస్‌బంప్స్ తెప్పించే 5 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. ట్విస్టులకు మైండ్ బ్లాకవ్వాల్సిందే

బాక్సాఫీస్ దగ్గర 'దృశ్యం 3' కలెక్షన్ల రికార్డు

అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం 3: ది కన్‌క్లూజన్’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా 11,645 స్క్రీన్స్‌లో గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి రోజే ఇండియాలో రూ.46.35 కోట్ల నెట్, రూ.54.69 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కి గురిచేసింది.

మలయాళ వర్షన్ కథతో సంబంధం లేకుండా హిందీ ఆడియెన్స్ కోసం ఒరిజినల్ స్క్రిప్ట్‌తో కొత్త క్లైమాక్స్ సెట్ చేయడంతో థియేటర్లలో సీట్లు అదురుతున్నాయి. శ్రియ శరణ్, జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచింది.

ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 5 సస్పెన్స్ థ్రిల్లర్స్

1. మహారాజా (Maharaja) - నెట్‌ఫ్లిక్స్

విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చిన 'మహారాజా' ఓటీటీ ప్రియులకు పూనకాలు తెప్పించింది. డస్ట్‌బిన్ 'లక్ష్మి' పోయిందని పోలీస్ స్టేషన్‌కి వచ్చే ఒక సాదాసీదా బార్బర్ కథలా మొదలై, ఆ తర్వాత ఊహించని రివేంజ్ డ్రామాగా మారుతుంది.

డైరెక్టర్ నితిలన్ సామినాథన్ ఓ ఊహకందని స్క్రీన్‌ప్లేతో చెప్పిన తీరు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ నటన ఈ సినిమాకు కొండంత బలాన్నిచ్చింది.

2. జానే జాన్ (Jaane Jaan) - నెట్‌ఫ్లిక్స్

కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇంటెన్స్ థ్రిల్లర్‌కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఒంటరి తల్లి మాయ తన మాజీ భర్త హత్య కేసులో ఇరుక్కుంటే, పక్కింట్లో ఉండే మ్యాథ్స్ టీచర్ నరేన్ ఆమెను రక్షించడానికి వేసే ప్లాన్స్ అద్భుతంగా ఉంటాయి.

ఒరిజినల్ 'దృశ్యం' కథకు ప్రధాన ప్రేరణ అయిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ X' నవల ఆధారంగానే ఈ సినిమా రూపొందింది.

3. అంధాధున్ (Andhadhun) - జియో హాట్‌స్టార్

శ్రీరామ్ రాఘవన్ మార్క్ డార్క్ కామెడీ విత్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాధున్'. గుడ్డివాడిగా నటిస్తూ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసే ఆకాష్ (ఆయుష్మాన్ ఖురానా) కళ్ల ముందే ఒక మర్డర్ జరుగుతుంది.

తాను చూడగలనని చెబితే ప్రాణాలకే ప్రమాదం, గుడ్డివాడిలా నటిస్తే కేసులో ఇరుక్కునే పరిస్థితి. టబు, రాధికా ఆప్టే యాక్టింగ్, ప్రతి 10 నిమిషాలకు వచ్చే ట్విస్టులు ఈ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా మార్చాయి.

4. కహానీ (Kahaani) - ప్రైమ్ వీడియో

కోల్‌‌కతా దుర్గాపూజ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించకుండా పోయిన తన భర్త కోసం వెతికే గర్భిణి విద్యా బాగ్చి (విద్యా బాలన్) కథే ఈ 'కహానీ'.

సుజోయ్ ఘోష్ తెరకెక్కించిన ఈ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరంబ్రత ఛటర్జీ నటన ఆకట్టుకుంటుంది.

5. పోర్ తొళిల్ (Por Thozhil) - సోనీ లివ్

తమిళంలో వచ్చి సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'పోర్ తొళిల్'. భయస్తుడైన యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ (అశోక్ సెల్వన్), అనుభవజ్ఞుడైన సీనియర్ ఆఫీసర్ (శరత్‌కుమార్) కలిసి వరుస హత్యల మిస్టరీని ఎలా ఛేదించారనేది అసలు కథ.

విఘ్నేష్ రాజా మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లే, గ్రావిటీ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఓటీటీలో మస్ట్ వాచ్‌గా నిలబెట్టాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More