Kareena Kapoor: యానిమల్ హిట్ కాగానే అందరిదీ అదే మైండ్ సెట్.. బాలీవుడ్‌పై కరీనా కపూర్ హాట్ కామెంట్స్!
Kareena Kapoor: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' సినిమాపై కరీనా కపూర్ హాట్ కామెంట్స్ చేసింది. తన కొత్త సినిమా 'దాయరా' విడుదల కానున్న నేపథ్యంలో ఇండస్ట్రీలోని హెర్డ్ మెంటాలిటీపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Kareena Kapoor: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ నటిగా కొనసాగుతున్న కరీనా కపూర్ ఖాన్ తాజాగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. బాలీవుడ్ లోని మూస ధోరణిని ఆమె ప్రశ్నించారు. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ అదే ఫార్ములాను గుడ్డిగా అనుకరిస్తారని ఆమె విమర్శించారు.

యానిమల్ పై కరీనా కపూర్ కామెంట్లు
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా హిట్ అవ్వగానే అందరూ వైలెన్స్ ఉన్న కథలే చేయాలని అనుకోవడం సరైన పద్ధతి కాదని కరీనా కపూర్ హాట్ కామెంట్లు చేశారు.
రూ.200 కోట్లతోనే సరిపోదు!
ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని కరీనా అభిప్రాయపడ్డారు. ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలా వద్దా అనే నిర్ణయానికి వచ్చేంత స్పష్టత ఆడియన్స్‌లో ఉందని, కేవలం కామెడీ లేదా వైలెన్స్ పేరుతో థియేటర్లకు రప్పించలేమని ఆమె స్పష్టం చేశారు.
ప్రతి సినిమా రూ.200 కోట్లో లేదా రూ.500 కోట్లో వసూలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆలోచింపజేసే కథలను అందించే కొత్త దర్శకులకు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉందనే విషయాన్ని ఇండస్ట్రీ గ్రహించాలని ఆమె పేర్కొన్నారు.
కరీనా, పృథ్వీరాజ్ ఖాకీ డ్రామా
కరీనా కపూర్ హీరోయిన్ గా, మలయాళ వర్సటైల్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా 'దాయరా' (Daayra). 'రాజీ', 'సమ్‌బహదూర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకురాలు మెఘ్నా గుల్జార్ ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు.
రిలీజ్ డేట్
జువైనల్ క్రైమ్ (మైనర్ నేరాలు) నేపథ్యంతో సాగే ఈ సినిమాలో కరీనా, పృథ్వీరాజ్ ఇద్దరూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్లుగా ఒకరినొకరు ఎదుర్కొనే పాత్రల్లో కనిపించనున్నారు. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ నిర్మించిన ఈ దాయరా చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
హాట్ టాపిక్ గా
సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' తెచ్చిన హైపర్-వైలెంట్ ట్రెండ్ బాలీవుడ్ వ్యాపార సమీకరణాలను మార్చివేసిన మాట వాస్తవం. అయితే 'రాజీ' వంటి ఇన్వెస్టిగేటివ్ హిట్ అందించిన మెఘ్నా గుల్జార్ దర్శకత్వంలో వస్తున్న 'దాయరా' వంటి సినిమాలు యానిమల్ తెచ్చిన వైలెన్స్ ట్రెండ్‌కు భిన్నంగా ఒక పవర్ ఫుల్ రియలిస్టిక్ డ్రామాను అందించబోతున్నాయి.
ఈ నేపథ్యంలో కరీనా కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్, బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


