Malayalam OTT: ఓటీటీలోకి రాగానే ట్రెండింగ్ నంబర్ వన్..రోమ్‌కామ్ జోరు..జియోహాట్‌స్టార్‌లోని టాప్ 5 మలయాళం సినిమాలు ఇవే!
Malayalam OTT: ఓటీటీలో మలయాళం సినిమాల జోరు మామూలుగా లేదు. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన ఓ మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పుడే ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లోని టాప్ 5 మలయాళం సినిమాలపై ఓ లుక్కేయండి. మీ వీకెండ్ వాచ్ కు ఇవి పర్ఫెక్ట్!
Malayalam OTT: మలయాళం సినిమాలకు ఓటీటీలో ఉండే డిమాండే వేరు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ చిత్రాలకు బాగా కనెక్ట్ అవుతారు. మలయాళం సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాగానే మన తెలుగు ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తారు. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న అలాంటి టాప్ 5 మలయాళం సినిమాలు ఇవే.

బెత్లెహెం కుటుంబ యూనిట్
మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన మూవీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ మూవీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. మలయాళంలో కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసిన బెత్లెహం కుటుంబ యూనిట్ మూవీ.. ఓటీటీలోకి వచ్చిన రోజే నంబర్ వన్ మూవీగా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది.
నంబర్ వన్
నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన బెత్లెహెం కుటుంబ యూనిట్ మూవీకి క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా అక్టోబర్ 2న ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో నంబర్ వన్ మలయాళం సినిమాగా బెత్లెహెం కుటుంబ యూనిట్ ట్రెండ్ అవుతోంది. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండే అబ్బాయి, అమ్మాయి మధ్య లవ్ స్టోరీ చుట్టూ ఈ రొమాంటిక్ కామెడీ మూవీ కథ తిరుగుతుంది.
తుడక్కమ్
మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ తుడక్కమ్ కూడా ఓటీటీలో జోరు కొనసాగిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ మోహన్ లాల్ ఈ మూవీతోనే హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. స్కూల్ పిల్లలకు హెల్ప్ చేసిన అమ్మాయిని సైకో చంపాలనుకుంటాడు. తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్ తో ఆ అమ్మాయి ఎలా తప్పించుకుందన్నదే తుడక్కమ్ మూవీ స్టోరీ.
సర్వం మాయ
హారర్ కామెడీ థ్రిల్లర్ సర్వం మాయ కూడా ఓటీటీలో అదరగొడుతూనే ఉంది. క్యూట్ డెలులూ దెయ్యం చుట్టూ తిరిగే సినిమా ఇది. విదేశాలకు వెళ్లాలనుకునే ఓ కుర్రాడు ఇక్కడే పూజారిగా కొనసాగాల్సి వస్తుంది. అతనికి ఓ అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనేది సర్వం మాయ మూవీలో చూడాల్సిందే.
ఐ, నోబడీ
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ మూవీ ‘ఐ, నోబడీ’. ఇది బ్యాంకు రాబరీ నేపథ్యంలో సాగుతుంది. మధ్యలో వచ్చే ట్విస్ట్ ఓటీటీ ఆడియన్స్ కు థ్రిల్ అందిస్తుంది. ఇదే కాకుండా క్రైమ్ థ్రిల్లర్ ఉయిర్ కు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో క్రేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ అయిదు సినిమాలు కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


