ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్ లను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. కానిస్టేబుల్ కనకం, నయనం లాంటి తెలుగు వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అలాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది ఈ సిరీస్.
విక్రమ్ ఆన్ డ్యూటీ ఓటీటీ

తెలుగు వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ అదరగొడుతోంది. ఓటీటీ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అదిరే ట్విస్ట్ లు, ఉత్కంఠ రేపే మలుపులతో థ్రిల్ అందిస్తోంది. ఈ పాపులర్ వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయిదు భాషల్లో
జియోహాట్‌స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రిలీజ్ అయిన విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ మొత్తం అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విక్రమ్ ఆన్ డ్యూటీ ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. మార్చి 6న ఈ విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది.
ట్రెండింగ్ నం 1
విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఓటీటీలో రిలీజైనప్పటి నుంచి టాప్ ప్లేస్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ట్రెండ్ అవుతోంది. ఇందులో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరో. బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్ కు బ్రహ్మ రుద్ర డైరెక్టర్.
క్రైమ్ థ్రిల్లర్
విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సస్పెన్స్, ట్విస్ట్ లతో ఈ సిరీస్ సాగుతోంది. ప్రస్తుతం 4 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ కానుంది. రియల్ క్రైమ్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
పోలీస్ ఆఫీసర్ గా
{{/usCountry}}విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సస్పెన్స్, ట్విస్ట్ లతో ఈ సిరీస్ సాగుతోంది. ప్రస్తుతం 4 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ కానుంది. రియల్ క్రైమ్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
పోలీస్ ఆఫీసర్ గా
{{/usCountry}}విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ లో నిఖిల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. విక్రమ్ వాసు అనే క్యారెక్టర్ చేశాడు. నిర్భయ కేసు, డ్రమ్ములో మర్డర్ లాంటి రియల్ ఇన్సిడెంట్లను ఆధారంగా చేసుకుని ఎపిసోడ్లు తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక ఎపిసోడ్ లో ఒక క్రైమ్ కేసు సాల్వ్ చేయడం ఉంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి.