...
...
Next Story

ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్ ఇవే.. ఆ రెండు తెలుగు సినిమాలు కూడా..

ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు, హిందీ, మలయాళం భాషలకు చెందిన ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు. ముఖ్యంగా తెలుగులో రెండు మూవీస్ మిస్ కావద్దు.

Published on: Jan 15, 2026, 14:23:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మరో వీకెండ్ వచ్చేస్తోంది. మరి ఈసారి ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునేవారి కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సిద్ధమయ్యాయి. ఈ వారం (జనవరి 16, 2026) యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, హారర్.. ఇలా అన్ని రకాల జానర్లలో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇంకా వస్తోంది. ఫర్హాన్ అక్తర్ నుంచి మమ్ముట్టి వరకు.. స్టార్ల సినిమాలు మీ స్మాల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో చూసేయండి.

దండోరా - అమెజాన్ ప్రైమ్ వీడియో

ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్ ఇవే.. ఆ రెండు తెలుగు సినిమాలు కూడా..
ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్ ఇవే.. ఆ రెండు తెలుగు సినిమాలు కూడా..

తెలుగు సినిమా దండోరా థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే అంటే బుధవారం (జనవరి 14) నుంచే స్ట్రీమింగ్ కు వచ్చింది. శివాజీ, బిందు మాధవిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అంతంతమాత్రం రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి మంచి ఛాయిస్.

గుర్రం పాపిరెడ్డి - జీ5 ఓటీటీ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ఈ శుక్రవారం (జనవరి 16) నుంచి స్ట్రీమింగ్ కానుంది. శవాలను తారుమారు చేసే ఒక వింతైన స్కీమ్ చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. జీ5 ఓటీటీలో చూడొచ్చు.

120 బహదూర్ - అమెజాన్ ప్రైమ్ వీడియో

1962 నాటి చైనా-భారత్ యుద్ధం ఆధారంగా తెరకెక్కిన నిజ జీవిత గాథ ఈ 120 బహదూర్. మేజర్ షైతాన్ సింగ్ భాటి (ఫర్హాన్ అక్తర్) నాయకత్వంలోని 13 కుమావోన్ రెజిమెంట్.. కేవలం 120 మంది సైనికులతో వేలమంది చైనా సైనికులను ‘రెజాంగ్ లా’ యుద్ధంలో ఎలా నిలువరించారన్నదే ఈ సినిమా కథ. దేశభక్తి ఉప్పొంగే ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో శుక్రవారం (జనవరి 16) నుంచి చూడొచ్చు.

కలంకావల్ - సోనీ లివ్

దిలీప్ హీరోగా నటించిన ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్‌లో.. ఒక సామాన్యుడు కేరళ ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం అనే క్రేజీ పాయింట్‌తో కథ సాగుతుంది. మోహన్‌లాల్ ఇందులో క్రైమ్ బాస్‌గా అతిథి పాత్రలో మెరవడం విశేషం. వినీత్ శ్రీనివాసన్ ఇందులో దర్యాప్తు అధికారిగా కనిపిస్తారు. జీ5 ఓటీటీలో చూడొచ్చు.

సఫియా/సఫ్దర్ - జీ5 ఓటీటీ

నసీరుద్దీన్ షా, అదితి సుబేది నటించిన ఈ హిందీ మూవీ ఒక భావోద్వేగభరితమైన కథ. సమాజం విధించిన కట్టుబాట్లను ఎదిరించి తన ఉనికి కోసం పోరాడే ఒక యువతి ప్రయాణమే ఈ సినిమా. జీ5 ఓటీటీలో చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe