ఈ వీకెండ్ ఈ 6 ఓటీటీల్లోని ఈ 8 సినిమాలు, వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. తెలుగులోనూ హారర్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్
ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడటానికి చాలా కంటెంటే సిద్ధంగా ఉంది. వీటిలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వీటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో చూడండి.
ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ వారం వచ్చిన ఎన్నో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లలో నుంచి మీరు మిస్ కాకుండా చూడాల్సిన వాటి జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీల్లో చూడొచ్చు.

ది గర్ల్‌ఫ్రెండ్ - నెట్‌ఫ్లిక్స్
రష్మిక మందన్న లీడ్ రోల్లో నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాని ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయి ఉంటే ఇప్పుడు చూసేయండి. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టీఫెన్ - నెట్‌ఫ్లిక్స్
తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టీఫెన్ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే అడుగుపెట్టింది. అమ్మాయిల సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ మూవీని తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ లలోనూ చూడొచ్చు. ఈవారం ఎంతో ఆసక్తి రేపిన సినిమా ఇది.
డైస్ ఇరే - జియోహాట్‌స్టార్
మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ డైస్ ఇరే కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన సినిమా ఇది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
జటాధర - ప్రైమ్ వీడియో
తెలుగులో సుధీర్ బాబు నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ జటాధర. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించిన తొలి తెలుగు సినిమా ఇది. ఈ మూవీకి నెగటివ్ రివ్యూలే ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడీ సినిమా సడెన్ గా ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది.
మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ - ప్రైమ్ వీడియో
టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ చివరి మూవీ ది ఫైనల్ రెకనింగ్ కూడా ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీల్లోనూ చూడొచ్చు.
కుట్రమ్ పురింధవన్ - సోనీ లివ్
సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ 12 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే కథ ఇది. ఒక రోజు ముందే అంటే గురువారమే స్ట్రీమింగ్ కు వచ్చింది.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో - జీ5 ఓటీటీ
లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా శుక్రవారం (డిసెంబర్ 5) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీని జీ5 ఓటీటీలో చూడొచ్చు. తిరువీర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.
ది హంటర్ ఛాప్టర్ 1 - ఆహా ఓటీటీ
వైభవ్ నటించిన తమిళ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది జూన్ లో తెలుగులో ది హంటర్ పేరుతో వచ్చింది. తాజాగా ఈ సినిమా ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


