...
...
Next Story

OTT Thriller: ఒకరినొకరు చంపాలనుకునే భార్యాభర్తలు..మధ్యలో షాకింగ్ ట్విస్ట్..ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మైండ్ బ్లాక్ థ్రిల్లర్

OTT Thriller: అదిరిపోయే ట్విస్ట్ లతో, ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో కూడిన ఓ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. భార్యాభర్తలు ఒకరినొకరు చంపాలనుకుంటారు. కానీ మధ్యలో ఓ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఈ మూవీ ఏంటీ? ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: May 26, 2026 12:53 PM IST
Advertisement

OTT Thriller: ప్రతి వారం ఓటీటీలోకి కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో కూడిన చిత్రాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. అయితే ఇందులో థ్రిల్లర్ మూవీస్ కు క్రేజ్ ఎక్కువే. ఇప్పుడు ఇదే జోనర్లో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టేందుకు ‘ఓవర్ యువర్ డెడ్ బాడీ’ అనే థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఓవర్ యువర్ డెడ్ బాడీ ఓటీటీ

ఇవాళ ఓటీటీలోకి వచ్చిన అదిరిపోయే థ్రిల్లర్ (x)
ఇవాళ ఓటీటీలోకి వచ్చిన అదిరిపోయే థ్రిల్లర్ (x)

ఓటీటీ లవర్స్ కు థ్రిల్ పంచేందుకు క్రైమ్ థ్రిల్లర్ ‘ఓవర్ యువర్ డెడ్ బాడీ’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (మే 26) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ చిత్రం రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ మూవీ చూడాలంటే ఎక్స్ ట్రా పే చేయాల్సి ఉంటుంది.

క్రైమ్ థ్రిల్లర్ గా

ఓవర్ యువర్ డెడ్ బాడీ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీనికి జోర్మా టాకోన్ డైరెక్టర్. ఇందులో జేసన్ సెజల్, సమరా వీవింగ్, పాల్ గూల్ ఫోల్, కీత్ జార్డిన్, టిమోతీ, జూలియట్ తదితరులు నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 24, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

ఓవర్ యువర్ డెడ్ బాడీ స్టోరీ

డాన్ బర్టన్ ఒక ఫ్లాప్ డైరెక్టర్. చిన్న చిన్న యాడ్స్ తీసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. అతని భార్య లిసా ఒక యాక్ట్రెస్. వీరిద్దరి మధ్య అస్సలు పడదు. దాంతో ఎలాగైనా తన భార్యను చంపేసి, ఆస్తి దక్కించుకోవాలని డాన్ ఒక ప్లాన్ వేస్తాడు. ఇందుకోసం హెన్రీ అనే ఒక క్రిమినల్ సాయంతో, నగరానికి దూరంగా ఉన్న ఒక లేక్ హౌస్ కు భార్యను తీసుకెళ్తాడు.

సీన్ రివర్స్

అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. జైలు నుండి తప్పించుకున్న పీట్, టాడ్, అల్లెగ్రా అనే ముగ్గురు ప్రమాదకరమైన ఖైదీలు అప్పటికే ఆ ఇంట్లో దాక్కుంటారు. వాళ్లు ఈ భార్యాభర్తలను బంధించి, డబ్బుల కోసం వేధించడం మొదలుపెడతారు. అప్పుడే డాన్ తండ్రి మైఖేల్ అక్కడకు వచ్చి ఆ ఖైదీలపై ఎదురుదాడి చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది ఓవర్ యువర్ డెడ్ బాడీ మూవీలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe