సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధురంధర్' సినిమా గురించే ఒకటే చర్చ నడుస్తోంది కదా. బాక్సాఫీస్ దగ్గర ఈ యాక్షన్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది, అందులో ఉన్నవాళ్లు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఒక పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఆ ఫన్నీ వీడియో వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూద్దాం.
లియారీ వాసుల ఫన్నీ డిమాండ్..

ధురంధర్ సినిమాలో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న 'లియారీ' అనే ఒక ఏరియాను మేకర్స్ చాలా హైలైట్ చేసి చూపించిన విషయం మనందరికీ తెలిసిందే. సినిమా కథలో ఆ లియారీ ఏరియాకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ లియారీ ప్రాంతంలో ఉంటున్న స్థానికులు చేసిన ఒక సరదా కామెంట్ ఆన్‌లైన్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
ధురంధర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1088 కోట్లకుపైగా వసూలు చేసింది కదా.. అందులో సగం అంటే రూ.500 కోట్లు డైరెక్టర్ ఆదిత్య ధర్ మాకు తిరిగి ఇచ్చేయాలి అంటూ వాళ్లు చాలా ఫన్నీగా డిమాండ్ చేస్తున్నారు.
ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..
మా ఏరియా పేరు వాడుకుని మీరు రూ.1000 కోట్లు కలెక్ట్ చేశారు కాబట్టి, మాకు ఆ రూ.500 కోట్లు తిరిగి ఇచ్చేయండి అని వాళ్లు సరదాగా అనడం వెనక ఒక చిన్న లాజిక్ కూడా చెప్పారు. మా లియారీ ప్రాంతంలో రోడ్లు అస్సలు బాలేవు, అంతా గుంతల మయంగా ఉంది. అందుకే డైరెక్టర్ గారు మాకు ఆ రూ.500 కోట్లు ఇస్తే, మేం ఆ డబ్బుతో మా ఏరియాలో మంచిగా రోడ్లు వేయించుకుంటాం అంటూ వాళ్లు ఒక రేంజ్‌లో జోకులు వేశారు. వాళ్ల ఏరియాలో ఉన్న రియల్ లైఫ్ ప్రాబ్లమ్ అయిన చెత్త రోడ్ల సమస్యను, ఒక సినిమా సాధించిన బాక్సాఫీస్ సక్సెస్‌తో ముడిపెట్టి వాళ్లు మాట్లాడిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
పగలబడి నవ్వుతున్న నెటిజన్లు..
ఈ వీడియో ప్రస్తుతం ఇండియాలోనే తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో ముందుగా ఓ వ్యక్తి తమకు ఓ రెండు, మూడు కోట్లు ఇవ్వొచ్చు కదా అని అంటాడు. ఆ మాత్రం చాలా అని అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అడుగుతాడు.
{{/usCountry}}ఈ వీడియో ప్రస్తుతం ఇండియాలోనే తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో ముందుగా ఓ వ్యక్తి తమకు ఓ రెండు, మూడు కోట్లు ఇవ్వొచ్చు కదా అని అంటాడు. ఆ మాత్రం చాలా అని అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అడుగుతాడు.
{{/usCountry}}అప్పుడు మరో వ్యక్తి జోక్యం చేసుకుంటూ.. అలా అయితే ఓ రూ.500 కోట్లు ఇవ్వమనండి అని అనడం విశేషం. మరోవైపు ధురంధర్ 2 మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1088 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం. ధురంధర్ కలెక్ట్ చేసిన రూ.1300 కోట్ల రికార్డును ఈ సీక్వెల్ రెండో వీకెండ్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.