స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. పెళ్లి ఫిక్స్ కావడానికి ముందే స్మృతిని పలాష్ చీట్ చేశాడని స్మృతి ఫ్రెండ్ విద్యన్ మానే ఆరోపించాడు. ఈ నేపథ్యంలో స్మృతి మంధానతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ పోస్టులన్నింటినీ పలాష్ డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
స్మృతి పోస్టులు

మోసం ఆరోపణలతో పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. స్మృతి మంధాన స్నేహితుడు విద్యన్ మానే అతనిపై కొత్త ఆరోపణలు చేసిన తర్వాత, ముచ్చల్ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్మృతి ఉన్న అనేక పోస్ట్‌లను తొలగించారు. ఈ పోస్ట్‌లన్నీ 24 జనవరి 2026 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కనిపించడం లేదు.
చీటింగ్ ఆరోపణలు
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. 2025 నవంబర్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మెహందీ, సంగీత్ లాంటి ఈవెంట్లు కంప్లీట్ చేసుకున్నారు. కానీ పెళ్లి రోజు మార్నింగ్ స్మృతి తండ్రికి గుండెపోటుతో మ్యారేజీ రద్దయింది. కానీ ఆ తర్వాత స్మృతిని పలాష్ చీట్ చేశాడని, అందుకే పెళ్లి రద్దు చేసుకున్నారనే వార్తలొచ్చాయి. ఓ కొరియోగ్రాఫర్ విషయంలో పలాష్ మోసం బయటపడిందని అన్నారు.
పరువు నష్టం
ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో స్మృతి మంధానతో ఉన్న పోస్టులన్నీ డిలీట్ చేసిన పలాష్ ముచ్చల్.. విద్యన్ మానేపై పరువు నష్టం కేసు వేశాడు. ఓ మూవీ నిర్మాణంలో భాగంగా పలాష్ తనకు రూ.40 లక్షలు ఇవ్వాల్సిందని విద్యన్ ఆరోపించాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వడం లేదన్నాడు. అంతే కాకుండా పెళ్లి ఫిక్స్ కావడానికి ముందే స్మృతిని పలాష్ మోసం చేశాడని కూడా విద్యన్ ఆరోపించాడు.
రూ.10 కోట్లు
విద్యన్ మానే ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పలాష్ ముచ్చల్ రియాక్టయ్యాడు. తన లాయర్ తో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపించానని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు పలాష్. ఆధారం లేని ఆరోపణలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు.
{{/usCountry}}విద్యన్ మానే ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పలాష్ ముచ్చల్ రియాక్టయ్యాడు. తన లాయర్ తో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపించానని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు పలాష్. ఆధారం లేని ఆరోపణలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు.
{{/usCountry}}అయితే స్మృతి, పలాష్ వెడ్డింగ్ క్యాన్సిల్ కావడం గతేడాది చివర్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకంటే ముందు వీళ్లు ప్రేమించుకున్నారు. టీమిండియా మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు స్మృతికి పలాష్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పేందుకు అక్కడే ఉన్నాడు. అప్పుడు ప్రపోజ్ కూడా చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.