...
...
Next Story

OTT Series Review: ఒకే రోజు మూడు హత్యలు.. సేమ్ ఫింగర్ ప్రింట్స్.. ఓటీటీ సిరీస్ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

OTT Series Review: 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ శ్రీనివాస్ లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘పంచనామా’. ఉదయభాను నిర్మించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ సిరీస్ ఎలా ఉంది అనేది రివ్యూలో చూసేయండి.

Published on: Sep 12, 2026, 21:54:54 IST
Advertisement

OTT Series Review: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే మరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పంచనామా’ సిరీస్ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఒకప్పటి యాంకర్, నటి ఉదయభాను ఈ సిరీస్ తోనే ప్రొడ్యూసర్ గా జర్నీ స్టార్ట్ చేయడం విశేషం. మరి ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ అలరించిందా? లేదా? అన్నది రివ్యూలో చూసేద్దాం.

అసలు కథ ఏమిటి?

ఒకే రోజు మూడు హత్యలు.. సేమ్ ఫింగర్ ప్రింట్స్.. ఓటీటీ సిరీస్ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
ఒకే రోజు మూడు హత్యలు.. సేమ్ ఫింగర్ ప్రింట్స్.. ఓటీటీ సిరీస్ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

జైరామ్ (భరత్ శ్రీనివాస్) ఓ సీఐ. పోలీస్ డిపార్ట్ మెంట్ లో మంచి పేరు తెచ్చుకుంటాడు. అతనికి స్టూడెంట్ ఆది (చరణ్ బాబు) అంటే ఇష్టం. సొంత తమ్ముడు కాకపోయినా ఆదిని జైరామ్ చాలా ఇష్టంగా చూసుకుంటాడు. అయితే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఆది హాస్టల్ లో చనిపోతాడు. అతని చావు చుట్టూ మిస్టరీ అల్లుకుంటుంది.

ఆది కేసును స్వయంగా సీఐ జైరామ్ ఎంక్వైరీ చేస్తుంటాడు. ఈ విచారణలో జైరామ్‌కు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆది వేలిముద్రలు, అదే రోజు మరణించిన మరో ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలతో కచ్చితంగా సరిపోలుతాయి.

వేర్వేరు ప్రదేశాల్లో ఒకే రోజు చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు ఒకే రకమైన ఫింగర్ ప్రింట్స్ ఉండటం ఎలా సాధ్యం? ఈ వరుస మరణాల వెనుక ఉన్న మెడికల్ నెట్‌వర్క్ ఏంటి? సీఐ జైరామ్ ఈ మిస్టరీ చిక్కుముడులను ఎలా ఛేదించాడు? చనిపోయింది ముగ్గురేనా? జైరాం సిస్టర్ దేవకి ఎలా చనిపోయింది? అనేదే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ 'పంచనామా' కథ.

విశ్లేషణ

రొటీన్ మర్డర్ మిస్టరీలకు భిన్నంగా 'ఫింగర్‌ప్రింట్' కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చిన విధానం ఆకట్టుకుంటుంది. సీఐ జైరామ్‌గా భరత్ శ్రీనివాస్ గంభీరమైన పోలీస్ అధికారిగా తన పాత్ర పరిధి మేర బాగానే ఒదిగిపోయారు. ఫస్ట్ రెండు ఎపిసోడ్లలో కథనం నడిచే తీరు, వేగవంతమైన ఎడిటింగ్ తోపాటు కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు థ్రిల్లర్ ప్రియులకు కనెక్ట్ అవుతాయి.

ఆ ఉత్కంఠ ఎక్కడ?

తెలుగు డిజిటల్ స్పేస్‌లో ఇప్పటికే మెడికల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్లు చాలానే ఉన్నాయి. ఈ తరహా కథల్లో పాయింట్ ఎంత కొత్తగా ఉన్నా, విచారణ సాగే కొద్దీ కథనంలో ఉత్కంఠ పెరగాలి. అయితే 'పంచనామా'లో ప్రధాన సమస్య ఏమిటంటే?.. ఆ సస్పెన్స్‌ను చివరివరకు కాపాడలేకపోవడమే. తొలి రెండు ఎపిసోడ్‌లలో ఉన్న డ్రామా.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.

ఇక థ్రిల్లర్లలో విలన్ ఎవరో తెలిసే సీన్ కీలకం. కానీ పంచనామా సిరీస్ లో మెయిన్ విలన్ రివీల్ అయ్యే సీన్ కావాల్సినంత ఇంపాక్ట్ చూపించలేకపోయిందని చెప్పొచ్చు. లాస్ట్ రెండు ఎపిసోడ్లను మరింత గ్రిప్పింగ్ రాసుకుంటే సిరీస్ వేరే లెవల్ లో ఉండేది. విలన్ ఎవరో తేలిపోయిన తర్వాత ఆ థ్రిల్ ను కొనసాగించలేకపోయారు.

ఎవరెలా చేశారంటే?

ప్రేమిస్తే సినిమాలో తన యాక్టింగ్ తో అలరించిన భరత్ కు తెలుగులో ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్. సీఐ జైరామ్ క్యారెక్టర్ ను తన భుజాలపై మోశాడు భరత్. ఇక కానిస్టేబుల్ గా, జైరామ్ ను ప్రేమించే ధరణిగా నటించిన మేధా రెడ్డి కూడా ఆకట్టుకుంది. ఇక మధ్యతరగతి తండ్రిగా శివాజీ రాజా తన ఎమోషనల్ యాక్టింగ్ తో మెప్పించాడు.

ఫైనల్ గా

ఒక హత్యతో మెడికల్ మాఫియా గుట్టును ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా బయటపెట్టాడన్నదే క్లుప్తంగా పంచనామా సిరీస్ స్టోరీ. మధ్యలో వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. అయితే చివరి రెండు ఎపిసోడ్లు అంతగా ఆకట్టుకోవు. సస్పెన్స్ థ్రిల్లర్స్ అభిమానులు ఎక్కువ అంచనాలు లేకుండా ఒకసారి పంచనామా సిరీస్ ను చూడవచ్చు.

హెచ్‌టీ తెలుగు రేటింగ్: 2.5/5

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks