Web Series Remuneration: ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులను తమ సహజమైన నటన, హృదయాన్ని హత్తుకునే గ్రామీణ కథనంతో కట్టిపడేసిన కల్ట్ వెబ్ సిరీస్ 'పంచాయత్' (Panchayat) మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 3 నుంచి 'పంచాయత్ సీజన్ 5' స్ట్రీమింగ్ కానుంది.

ది వైరల్ ఫీవర్ (TVF) రూపొందించిన ఈ సిరీస్ కొత్త సీజన్ విడుదలకు ముందే, ఇందులో నటించిన ప్రధాన నటీనటుల రెమ్యునరేషన్ల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
'సచివ్ జీ' జితేంద్ర కుమార్‌కు రికార్డు స్థాయి రెమ్యునరేషన్
మొదటి సీజన్ నుంచి ఫులేరా గ్రామ పంచాయతీ సెక్రటరీ 'అభిషేక్ త్రిపాఠి' (సచివ్ జీ) పాత్రలో జీవించేస్తున్న జితేంద్ర కుమార్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. తాజా మీడియా రిపోర్టుల ప్రకారం.. సీజన్ 5 మొత్తానికి గాను జితేంద్ర కుమార్ ఏకంగా రూ.1.5 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
గత సీజన్లలో ఆయనకు ఎపిసోడ్‌కు రూ.5.6 లక్షల చొప్పున చెల్లించగా, సిరీస్‌కు పెరిగిన క్రేజ్ దృష్ట్యా ఈసారి ఆయన రెమ్యునరేషన్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
మంజు దేవి, ప్రధాన్ జీ, బన్రాకస్, క్రాంతి దేవి ఎంత తీసుకున్నారంటే?
ఇక కొన్ని రిపోర్టుల ప్రకారం 'పంచాయత్ సీజన్ 5'లో ఇతర ముఖ్య తారాగణం అందుకున్నట్లు చెబుతున్న రెమ్యునరేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
నీనా గుప్తా (మంజు దేవి): ఫులేరా గ్రామ సర్పంచ్ పాత్రలో మెరిసిన సీనియర్ నటి నీనా గుప్తాకు ఈ సీజన్ మొత్తానికి రూ.45 లక్షలు చెల్లించినట్లు సమాచారం (గతంలో ఎపిసోడ్‌కు రూ.4 లక్షలు).
{{/usCountry}}నీనా గుప్తా (మంజు దేవి): ఫులేరా గ్రామ సర్పంచ్ పాత్రలో మెరిసిన సీనియర్ నటి నీనా గుప్తాకు ఈ సీజన్ మొత్తానికి రూ.45 లక్షలు చెల్లించినట్లు సమాచారం (గతంలో ఎపిసోడ్‌కు రూ.4 లక్షలు).
{{/usCountry}}రఘుబీర్ యాదవ్ (బ్రిజ్ భూషణ్ దూబే / ప్రధాన్ జీ): తన నటనతో కడుపుబ్బా నవ్వించే రఘుబీర్ యాదవ్‌కు సీజన్ 5 కోసం రూ.30 లక్షలు దక్కినట్లు తెలుస్తోంది (గతంలో ఎపిసోడ్‌కు రూ.3.2 లక్షలు).
దుర్గేష్ కుమార్ (బన్రాకస్): తన విలక్షణ డైలాగులతో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న దుర్గేష్ కుమార్, ఈసారి ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3.5 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.
సునీతా రాజ్‌వార్ (క్రాంతి దేవి): బన్రాకస్ భార్య క్రాంతి దేవి పాత్రలో అదరగొడుతున్న సునీతా రాజ్‌వార్‌కు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు లభించినట్లు తెలుస్తోంది.
ఫైసల్ మాలిక్ (ప్రహ్లాద్ పాండే): ఎమోషనల్ నటనతో కంటతడి పెట్టించే ఫైసల్ మాలిక్‌కు సీజన్ మొత్తానికి రూ.20 లక్షలు ఇచ్చారట.
చందన్ రాయ్ (వికాస్): సచివ్ జీకి కుడిభుజంగా ఉండే వికాస్ పాత్రధారి చందన్ రాయ్ రూ.15 లక్షలు అందుకున్నట్లు సమాచారం.
ఈసారి ఫులేరా రాజకీయాల్లో పెను మార్పులు..
“క్రాంతి దేవి ఎత్తుగడ, ఫులేరాలో కొత్త పరిస్థితులు.. ఇక అంతా మారిపోతుంది” అంటూ ప్రైమ్ వీడియో విడుదల చేసిన పోస్ట్ సీజన్ 5పై అంచనాలను రెట్టింపు చేసింది. గ్రామ రాజకీయాలతో పాటు, గత నాలుగు సీజన్లుగా నెమ్మదిగా అల్లుకుంటున్న అభిషేక్, రింకీ (సాన్విక) ప్రేమకథ ఈ సీజన్‌లో ఒక కీలక మలుపు తిరగనుంది. వీరితో పాటు అశోక్ పాఠక్ (బినోద్), పంకజ్ ఝా, బుల్లూ కుమార్ తమ పాత్రల్లో తిరిగి అలరించనున్నారు.
సీజన్ 5తో ముగియదు.. అభిమానులకు గుడ్ న్యూస్
చందన్ కుమార్ రచనలో, దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'పంచాయత్' ప్రయాణం సీజన్ 5తో ముగిసిపోదని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.
భవిష్యత్తులో మరిన్ని సీజన్లు రానున్నాయని ప్రకటించడంతో ఫులేరా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి డిసెంబర్ 3న ప్రైమ్ వీడియోలో రాబోతున్న ఈ కొత్త సీజన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Also Read BP hands 3,000 employees to Wipro: What's behind the oil giant's big move?Also Read ‘Tears of Anger’: South Korean TV anchor breaks down as KOSPI crashes on Nov 25Also Read Netflix to not stream Fawad Khan’s Jo Bachay Hain Sang Samait Lo in India?ABOUT THE AUTHOR
హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.