ఈ సంక్రాంతి తమిళ సినిమా ఇండస్ట్రీకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర పోటీ అనుకుంటే.. అది కాస్తా బయట ఫ్యాన్స్ వార్ కు దారి తీసింది. దళపతి విజయ్ మూవీ జన నాయగన్ వాయిదా పడటం, రిలీజైన పరాశక్తి మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం, ఇప్పుడు దళపతి విజయ్ అభిమానులనే లక్ష్యంగా చేసుకుంటూ సుధా కొంగర చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
వాళ్ల వల్లే ఇలా..

సంక్రాంతికి తెలుగులో వరుస సినిమాలతో సందడి నెలకొంటే.. తమిళనాట వరుస వివాదాలు అక్కడి అభిమానులకు మింగుడు పడటం లేదు. అక్కడి సినిమాల రిలీజ్ కావడానికే తంటాలు పడుతుంటే.. ఇప్పుడు పరాశక్తి డైరెక్టర్ సుధ కొంగర.. వాటికి మరింత ఆజ్యం పోసే కామెంట్స్ చేసింది. తమ సినిమాపై కావాలని ఓ హీరో అభిమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అనడం గమనార్హం.
ఆమె నేరుగా విజయ్ పేరు ప్రస్తావించకపోయినా.. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండి వాయిదా పడిన హీరో సినిమా అంటూ పరోక్షంగా అతన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు వాళ్ల రౌడీయిజంతో పోరాటం చేస్తున్నామని సుధ చెప్పింది. వాళ్ల చేసిన తప్పు వల్లే సినిమా వాయిదా పడిందని, ఇప్పుడు వాళ్ల నెగటివ్ ప్రచారానికి తమ సినిమా బలవుతోందని ఆమె తెలిపింది.
“ఇది రాజకీయపరమైన కారణం కాదు. సినిమా రిలీజ్ వాయిదా పడిన ఓ నటుడి అభిమాలే ఇలా చేస్తున్నారు. అదీ వాళ్ల తప్పిదం వల్లే వాయిదా పడింది. ఈ రౌడీయిజానికి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాం” అని సుధ ఓ ఇంటర్యూలో కామెంట్ చేసింది.
మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్
అయితే సుధ కొంగర చేసిన కామెంట్స్ పై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమెను టార్గెట్ చేశారు. అభిమానులు, ప్రేక్షకుల రివ్యూలపై కూడా ఆమె రౌడీయిజం అనే ముద్ర వేయడం దారుణమని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. అవును.. మేమే కోలీవుడ్ ను నడిపిస్తున్నాం.. అర్థమైందా అని కేరళ విజయ్ ఫ్యాన్స్ క్లబ్ అనే ఎక్స్ అకౌంట్ ట్వీట్ చేయడం గమనార్హం.
{{/usCountry}}అయితే సుధ కొంగర చేసిన కామెంట్స్ పై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమెను టార్గెట్ చేశారు. అభిమానులు, ప్రేక్షకుల రివ్యూలపై కూడా ఆమె రౌడీయిజం అనే ముద్ర వేయడం దారుణమని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. అవును.. మేమే కోలీవుడ్ ను నడిపిస్తున్నాం.. అర్థమైందా అని కేరళ విజయ్ ఫ్యాన్స్ క్లబ్ అనే ఎక్స్ అకౌంట్ ట్వీట్ చేయడం గమనార్హం.
{{/usCountry}}నిజానికి ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమా తీసిన సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ పరాశక్తి సినిమాకు తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. చాలా దారుణంగా ఉందంటూ రివ్యూలు, రేటింగ్స్ కన్ఫమ్ చేశాయి. దీంతో మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ సుధ కొంగర చేసిన కామెంట్స్ మాత్రం కోలీవుడ్ లో వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.