శివకార్తికేయన్, శ్రీలీల జంటగా.. లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా ‘పరాశక్తి’. పొంగల్ రేసులో భాగంగా శనివారం (జనవరి 10) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. విడుదలైన తొలి రోజే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సినిమా కంటెంట్ కంటే, బయటకు లీక్ అయిన సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్ట్‌లో తెలుగువారిని ఉద్దేశించి వాడిన ఒక పదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
అసలేంటి ఆ పదం? ఎందుకింత రచ్చ?

లీక్ అయిన సెన్సార్ కట్స్ జాబితా ప్రకారం.. సినిమాలో ‘గొల్టీ’ (Golty) అనే పదాన్ని సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. సాధారణంగా తమిళనాట కొంతమంది తెలుగువారిని కించపరచడానికి లేదా ఎగతాళి చేయడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. ‘తెలుగు’ ఇంగ్లిష్ పదాన్ని తిరగేస్తే (gulute) ఈ పదం వచ్చిందని కొందరు, ఇది వెనుకబాటుతనాన్ని సూచించే బూతు పదం అని మరికొందరు చెబుతుంటారు. ఏదేమైనా ఇది స్నేహపూర్వక పిలుపు మాత్రం కాదన్నది చాలామంది వాదన.
‘సుధా కొంగర గారూ.. ఇదేం న్యాయం?’
ఈ విషయం బయటకు రాగానే ‘ఎక్స్’, రెడిట్ వేదికగా తెలుగు నెటిజన్లు భగ్గుమన్నారు. ముఖ్యంగా దర్శకురాలు సుధా కొంగర స్వతహాగా తెలుగు ఆడబిడ్డ అయ్యి ఉండి.. సొంత జాతిని కించపరిచే పదాన్ని తన సినిమాలో ఎలా పెట్టారంటూ నిలదీస్తున్నారు.
“తమిళ వెర్షన్‌లో తెలుగువాళ్లను ‘గొల్టీ’ అని పిలుస్తారు.. అదే తెలుగు వెర్షన్‌కు వచ్చేసరికి ‘జై తెలుగు’ అని నినదిస్తారా? ఇదేం ద్వంద్వ వైఖరి? ఇది కళ కాదు.. పక్కా రాజకీయ హిపోక్రసీ” అంటూ ఒక నెటిజన్ ఘాటుగా స్పందించారు.
శివకార్తికేయన్‌పైనా ఆగ్రహం..
శివకార్తికేయన్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. “తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న హీరో అయ్యి ఉండి.. ఇలాంటి భాషను ఎలా ఒప్పుకున్నారు? చిత్ర బృందం దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే” అని మరొకరు డిమాండ్ చేశారు. ‘బాయ్‌కాట్ పరాశక్తి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా కొందరు ట్రెండ్ చేస్తున్నారు.
అది సరదాగా వాడిన పదం కావొచ్చా?
మరోవైపు చిత్ర బృందానికి మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల తెలుగు అమ్మాయిగా నటించింది. కాబట్టి ఆ పాత్రతో హీరో సరదాగా మాట్లాడే సందర్భంలో ఈ పదం వాడి ఉండొచ్చని, సినిమా చూడకుండానే బాయ్‌కాట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. నాని నటించిన ‘హిట్ 3’ తమిళ వెర్షన్‌లో కూడా ఈ పదం ఉందన్న విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
సినిమా నేపథ్యం ఇదీ..
{{/usCountry}}మరోవైపు చిత్ర బృందానికి మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల తెలుగు అమ్మాయిగా నటించింది. కాబట్టి ఆ పాత్రతో హీరో సరదాగా మాట్లాడే సందర్భంలో ఈ పదం వాడి ఉండొచ్చని, సినిమా చూడకుండానే బాయ్‌కాట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. నాని నటించిన ‘హిట్ 3’ తమిళ వెర్షన్‌లో కూడా ఈ పదం ఉందన్న విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
సినిమా నేపథ్యం ఇదీ..
{{/usCountry}}‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) వంటి హిట్ తర్వాత సుధా కొంగర నుంచి వచ్చిన సినిమా ఇది. 1960ల నాటి మద్రాస్ నేపథ్యంలో, హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సాగే కథ ఇది. నిజానికి ఈ సినిమా విజయ్ నటించిన ‘జననాయగన్’తో పోటీ పడాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల విజయ్ సినిమా వాయిదా పడటంతో ‘పరాశక్తి’ సోలోగా బరిలోకి దిగింది.