Ustaad Bhagat Singh: అదే షాకింగ్ పాయింట్.. అలా చేసి ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ మరోలా ఉండేది: పరుచూరి గోపాలకృష్ణ

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాపై తాజాగా పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: Apr 24, 2026, 08:08:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ustaad Bhagat Singh: భారీ అంచనాలతో, ఎంతో హైప్ తో థియేటర్లకు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ థియేటర్లలో నిరాశపరిచింది. ఈ సినిమా బక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది. పెట్టిన బడ్జెట్ రాబట్టేలేకపోయింది. రూ.100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పరుచూరి గోపాలకృష్ణ తనదైన స్టైల్లో విశ్లేషించారు.

పరుచూరి గోపాలకృష్ణ (youtube)
పరుచూరి గోపాలకృష్ణ (youtube)

పరుచూరి పాఠాలు

ప్రముఖ సినీ రచయిత, నటుడు అయిన పరుచూరి గోపాలకృష్ణ ఆయా సినిమాలపై తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తుంటారు. పరుచూరి పాఠాలు పేరుతో యూట్యూబ్ ఛానెల్ లో తన విశ్లేషణను వెల్లడిస్తారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. మూవీ ఫెయిల్యూర్ కు కారణాలు చెప్పారు.

షాకింగ్ పాయింట్

ఉస్తాద్ భగత్ సింగ్ కథ, కథనాలను విమర్శించిన పరుచూరి గోపాలకృష్ణ ఓవరాల్ గా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ‘‘ఆరోగ్యం సహకరించకపోవడంతో థియేటర్లో ఉస్తాద్ భగత్ సింగ్ చూడలేకపోయా. ఇన్ని రోజులకు కుదిరింది. సినిమా పేరు గంభీరంగా ఉంది. అయితే మూవీ చూసిన తర్వాత మాత్రం కథ, కథనాలు పక్కకు వెళ్లిపోయాయా? అనిపించింది. మూవీలో అనన్యను చంపేయడం షాకింగ్ పాయింట్’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.

అదే పొరపాటు

‘‘పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ సినిమాలో మాత్రం హీరో పవన్ కల్యాణ్ చాలా మందిని కాల్చినట్లు చూపించారు. అయితే వీళ్లను ఉగ్రవాదులుగా చూపించడంతో కాల్చినా సరే తప్పు లేదనే ఫీలింగ్ ను ప్రేక్షకుడిలో కలిగించారు. సెకండాఫ్ లో లవ్ స్టోరీ పెట్టడం పొరపాటు. ఎందుకంటే ఫస్టాఫ్ లో ఎక్కువగా యాక్షన్ పార్ట్ ఉంది. దీంతో సెకండాఫ్ లో లవ్ సీన్స్ చూడబుద్ధి కాలేదు’’ అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

20 నిమిషాల తర్వాత

పవన్ కల్యాణ్ లాంటి హీరోను సినిమాలో తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో సుమారు 20 నిమిషాల పాటు పవన్ కనిపించడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హీరో ఎంట్రీ లేట్ అవకూడదని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.

అలా చేసి ఉంటే

ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ పేరు కాకుండా మరో టైటిల్ పెట్టి ఉంటే మూవీ రిజల్ట్ మరోలా ఉండేదని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు టైటిల్ విషయంలో జాగ్రత్త పడాలి. స్వరాజ్యం కోసం భగత్ సింగ్ ప్రాణ త్యాగం చేశాడు. కానీ మూవీలో పవన్ పాత్ర కాస్త రౌడీ ఇన్ స్పెక్టర్ ను పోలి ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి వేరే టైటిల్ ఏదైనా పెట్టి ఉంటే మూవీ మరోలా ఉండేదేమో’’ అని పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More