OTT Telugu: ఓటీటీలోకి వచ్చేసిన కోర్ట్ పెయిర్ రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ లో బ్యాండ్ మేళం సందడి
OTT Telugu: కోర్ట్ మూవీతో సెన్సేషనల్ గా మారిన పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ లో బ్యాండ్ మేళం సందడి షురూ అయింది.
OTT Telugu: లేటెస్ట్ తెలుగు యూత్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘బ్యాండ్ మేళం’ ఓటీటీలోకి వచ్చేసింది. కోర్ట్ మూవీతో పాపులర్ అయిన జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం ఇవాళ (ఏప్రిల్ 24) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మరోసారి తమ కెమిస్ట్రీతో రోషన్, శ్రీదేవి అలరించారు.

బ్యాండ్ మేళం ఓటీటీ
యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన తెలుగు మూవీ బ్యాండ్ మేళం. ఈ సినిమా శుక్రవారం ఓటీటీలో అడుగుపెట్టింది. నేటి నుంచే జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.
‘‘నిరీక్షణ ముగిసింది. బ్లాక్ బస్టర్ జోడీ తిరిగొచ్చింది. జీ5లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న బ్యాండ్ మేళం మూవీని చూసేయండి’’ అని జీ5 తెలుగు తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
థియేటర్లో ఇలా
నాని ప్రొడ్యూసర్ గా తెరకెక్కించిన కోర్ట్ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఈ జోడీ యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాండ్ మేళం సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రానికి థియేటర్లో మిక్స్ డ్ టాక్ వచ్చింది.
రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీ అలరించినా బ్యాండ్ మేళం స్టోరీలో కొత్తదనం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు సతీశ్ జవ్వాజి డైరెక్టర్. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కింద కావ్య, శ్రావ్య ఈ సినిమాను నిర్మించారు.
బ్యాండ్ మేళం స్టోరీ
కోర్ట్ సినిమాతో మెప్పించిన రోషన్, శ్రీదేవి.. బ్యాండ్ మేళం సినిమాలో బావమరదళ్లుగా నటించారు. యాదగిరి అలియాస్ గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి)కి పెళ్లి చేయాలని వాళ్ల చిన్నప్పుడే పెద్దలు నిశ్చయిస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి.
గిరికి మ్యూజిక్ అంటే ఇష్టం. రాజీ ఏమో టాపర్. వీళ్లిద్దరి మధ్య విభేదాలు వస్తాయి. ఊర్లో ఫ్రెండ్స్ తో కలిసి గిరి మ్యూజిక్ బ్యాండ్ పెడతారు. మరోవైపు పై చదువుల కోసం రాజీ సిటీకి వెళ్తుంది.
ఆ ట్విస్ట్
రాజీనే తనకు కాబోయే పెళ్లాం అని గిరి కలలు కంటుంటాడు. కానీ రాజీ తండ్రి సాయన్న (సాయి కుమార్) మాత్రం తన కూతురిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వేరే వాళ్లతో పెళ్లికి రాజీ ఒప్పుకుందా? యాదగిరి ఏం చేశాడు? అన్నది బ్యాండ్ మేళం సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


