Parvathy: మలయాళ స్టార్ హీరోల సైలెన్స్ పై హీరోయిన్ పార్వతి సంచలన వ్యాఖ్యలు-ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఆ ముసుగు కథేంటీ?
Parvathy: మలయాళ చిత్ర పరిశ్రమలోని డార్క్ సీక్రెట్స్‌ను నిర్భయంగా ఎండగట్టే వర్సటైల్ యాక్ట్రెస్ పార్వతి తిరువోతు.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. మాలీవుడ్ టాప్ స్టార్స్ డబుల్ ఫేస్ వైఖరిపై చేసిన కామెంట్లు సౌత్ ఇండస్ట్రీలో తుఫాన్ రేపుతున్నాయి. ఇంతకీ ఆమె ఏం అన్నదో ఇక్కడ చూసేయండి.
Parvathy: సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా సర్కిల్స్‌లో ఎప్పుడు ఏ వివాదం జరిగినా తనదైన శైలిలో గొంతు వినిపించే నటి పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu). రీసెంట్‌గా మలయాళ స్టార్ హీరోల ప్రవర్తన, పరిశ్రమలో మహిళల భద్రతపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

ఐ నోబడీ మూవీతో
పార్వతి తిరువోతు తాజాగా ‘ఐ నోబడీ’ మూవీలో నటించింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పార్వతి ఘాటు కామెంట్లు చేసింది. మాలీవుడ్‌లో ఏళ్ల తరబడి సాగుతున్న పవర్ పాలిటిక్స్, అసోసియేషన్ల ముసుగును డీకోడ్ చేస్తూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెద్ద హీరోల మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి?
మలయాళ పరిశ్రమను కుదిపేసిన కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు (సూపర్ స్టార్స్) మౌనంగా ఉండటాన్ని పార్వతి తీవ్రంగా తప్పుపట్టారు.
"ఇండస్ట్రీలో అంత పెద్ద పొజిషన్‌లో ఉన్న హీరోలు, సమస్యలు వచ్చినప్పుడు స్పందించకుండా సైలెంట్‌గా ఉండటం అంటే.. పరోక్షంగా ఆ తప్పులను సమర్థించడమే. బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత సూపర్ స్టార్స్‌పై ఉంది. కానీ ఇక్కడ వ్యవస్థను కంట్రోల్ చేసే కొద్దిమంది చేతుల్లోనే అంతా నడుస్తోంది" అని పార్వతి పేర్కొన్నారు.
హీరోలకు పూజలు
‘‘గత తొమ్మిదేళ్లలో మలయాళం చిత్ర పరిశ్రమలో మార్పులు వచ్చాయి. అది నిజమే. కానీ అవన్నీ మనస్ఫూర్తిగా వచ్చినవి కాదు. విమర్శలు, మీడియా కారణంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ మలయాళంలో స్టార్ హీరోలను దేవుళ్లలా పూజిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ల తప్పులను ఎలా ప్రశ్నిస్తారు. అది చాలా కష్టంగా మారుతుంది. అందుకే బాగా పేరున్న వాళ్లు.. కొత్తగా వచ్చేవాళ్లపై పెత్తనం చెలాయిస్తున్నారు’’ అని పార్వతి చెప్పారు.
ఈ వ్యాఖ్యల ద్వారా పార్వతి పరోక్షంగా ‘అమ్మ’ (AMMA - Association of Malayalam Movie Artists) అసోసియేషన్ గత వైఖరిని, అలాగే ఇండస్ట్రీని శాసించే పెద్దల ‘సెలెక్టివ్ సైలెన్స్’ను ఎండగట్టారు.
టాలీవుడ్‌కు కూడా తాకనున్న సెగ?
మలయాళ పరిశ్రమలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) చేసిన సుదీర్ఘ పోరాటం వల్లే హేమ కమిటీ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు పార్వతి చేసిన వ్యాఖ్యలు కేవలం మాలీవుడ్‌కే పరిమితం కాకుండా, టాలీవుడ్ లోనూ చర్చకు దారితీస్తున్నాయి. తెలుగు పరిశ్రమలో కూడా మహిళా కళాకారుల భద్రతపై ఇలాంటి పారదర్శకమైన నివేదికలు రావాలనే డిమాండ్ సోషల్ మీడియాలో మళ్లీ ఊపందుకుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


