OTT Telugu: ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు ట్రయాంగిల్ యూత్ లవ్ స్టోరీ.. మూడు ప్లాట్ ఫామ్స్ లో రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలో ఓ తెలుగు యూత్ లవ్ స్టోరీ అదరగొడుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ కు తెగ నచ్చేస్తున్న సినిమా ఇది.
ఓటీటీలో తెలుగు సినిమా పతంగ్ అదరగొడుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ కంటెంట్, ఫ్రెష్ కాన్సెప్ట్ తో డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు ముఖ్యంగా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

పతంగ్ ఓటీటీ
హైదరాబాదీ నేటివ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ పతంగ్. ఇదో ట్రయాంగిల్ రొమాంటిక్ యూత్ లవ్ స్టోరీ. ఈ చిత్రం ఇప్పుడు మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 30న సన్ నెక్ట్స్ లో ఈ తెలుగు సినిమా డిజిటల్ రిలీజ్ అయింది. ఇప్పుడు సన్ నెక్ట్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లోనూ పతంగ్ అందుబాటులో ఉంది.
థియేటర్లో ఇలా
ట్రయాంగిల్ లవ్ స్టోరీ పతంగ్ మూవీ 2025 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఈ సినిమాలో వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి డైరెక్టర్. సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి ఈ మూవీని నిర్మించారు. డి.సురేశ్ బాబు సమర్పించారు. సినిమాకు జోస్ జిమ్మీ మ్యూజిక్ డైరెక్టర్.
పతంగ్ స్టోరీ
ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయి కోసం గొడవ పడితే ఎలా ఉంటుందనే కథకు గాలిపటాల పోటీని యాడ్ చేసి తీసిన సినిమా పతంగ్. ఇందులో విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ (వంశీ పూజిత్), అరుణ్ (ప్రణవ్ కౌశిక్) బెస్ట్ ఫ్రెండ్స్. హైదరాబాద్ లోని బస్తీలో ఉండే యువకుడు విస్కీ. డబ్బున్న అబ్బాయి అరుణ్. కానీ వీళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఐశ్వర్య ఎంట్రీతో
చిన్నప్పటి నుంచి విస్కీ, అరుణ్ మంచి స్నేహితులు. అయితే వీళ్ల లైఫ్ లోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. దీంతో విస్కీ, అరుణ్ జీవితాలు మలుపు తీసుకుంటాయి. ఐశ్వర్య ముందు విస్కీని ప్రేమిస్తుంది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని అర్జున్ తో లవ్ లో పడుతుంది. దీంతో ఐశ్వర్య కోసం బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త శత్రువులుగా మారుతారు.
ఐశ్వర్య కోసం పతంగ్ ల పోటీలో పాల్గొంటారు. మరి ఎవరు గెలిచారు? ఐశ్వర్య ప్రేమ ఎవరికి దక్కింది? అసలు ఐశ్వర్య ఇద్దరిని ఎందుకు లవ్ చేసింది? అన్నది పతంగ్ మూవీలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


