Pawan Kalyan Divorce: షాకింగ్.. మూడోసారి పవన్ కళ్యాణ్ విడాకులు.. పరస్పర అంగీకారంతో అన్నా కొణిదెలతో బంధానికి ముగింపు!
Pawan Kalyan Divorce: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 13 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఇద్దరూ ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు షాక్ తగిలింది.
Pawan Kalyan Divorce: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గత 13 ఏళ్లుగా కలిసి జీవించిన ఈ జంట ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ వార్త పవన్ అభిమానులకు, రాజకీయ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ విడాకులు
పవన్ కళ్యాణ్, అన్నా దంపతులు తమ విడాకుల గురించి సోమవారం (నవంబర్ 9) రాత్రి ఒక జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశారు. "మా శ్రేయోభిలాషులు, బంధుమిత్రులకు... మా జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయాన్ని కలిసి పంచుకున్న తర్వాత పరస్పర గౌరవం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా వివాహ బంధం ముగిసినప్పటికీ, మేమిద్దరం మంచి స్నేహితులుగా కొనసాగుతాం. మా పిల్లలకు ఎప్పటికీ అంకితభావం గల తల్లిదండ్రులుగా ఉంటాం. వారి సంతోషం, శ్రేయస్సే మా ఇద్దరి మొదటి ప్రాధాన్యత" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి
ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను, అభిమానులను పవన్, అన్నా కొణిదెల కోరారు. విడాకుల ప్రక్రియ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని, దయచేసి అందరూ ఈ కష్ట సమయంలో తమను అర్థం చేసుకుని దయతో వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
2013లో మొదలైన బంధం
పవన్ కళ్యాణ్, రష్యన్ జాతీయురాలైన అన్నా లెజినోవా (అన్నా కొణిదెల) 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు. పవన్ హీరోగా నటించిన 'తీన్ మార్' సినిమాలో అన్నా కొణిదెల ఒక చిన్న పాత్రలో కనిపించారు. అప్పటి నుంచి మొదలైన వీరి పరిచయం పెళ్లికి దారితీసింది.
పవన్ కు ఇది మూడో వివాహం అన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన నందిని (1997-2008), రేణూ దేశాయ్ (2009-2012) లను వివాహం చేసుకుని విడాకులు ఇచ్చారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఈ విడాకుల వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించి, డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు గౌరవిస్తుంటే, మరికొందరు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పవన్ కళ్యాణ్ మూడోసారి విడాకులు ఇవ్వడంపై ట్రోల్స్ చేస్తున్నారు.

ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


