తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త సంచలనాన్ని సృష్టించాయి. ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఓటర్ల చైతన్యాన్ని కొనియాడారు. ఇదే సమయంలో దళపతి విజయ్ సాధించిన అద్భుత విజయంపై సినీ లోకం కూడా ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. 'పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని.. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ.' అని పవన్ పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని ఆయన విశ్లేషించారు.
పశ్చిమ బెంగాల్‌లో భాజపా విజయం వెనుక ప్రధాని మోదీ, అమిత్ షా ల అకుంఠిత దీక్ష ఉందని పవన్ కొనియాడారు. ఇక తమిళనాడులో టీవీకే (TVK) విజయ్ సాధించిన విజయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ప్రజల మద్దతు కూడగట్టిన విజయ్‌ని పవన్ అభినందించారు.
విజయ్ రాజకీయ విజయంతో కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'మొదట అనుమానించారు.. ఇప్పుడు కిరీటం దక్కింది. మన ఇంటి దగ్గర (ఏపీ) జరిగింది, ఇప్పుడు పక్క ఇంట్లోనూ (తమిళనాడు) రిపీట్ అయ్యింది. అది అబ్సల్యూట్ సినిమా!' అని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేస్తూ అభినందించారు.
'తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రభావం చూపిన విజయ్ సార్‌కి అభినందనలు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేయడం గర్వంగా ఉంది.' అని శివ కార్తికేయన్ పేర్కొన్నారు.
{{/usCountry}}'తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రభావం చూపిన విజయ్ సార్‌కి అభినందనలు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేయడం గర్వంగా ఉంది.' అని శివ కార్తికేయన్ పేర్కొన్నారు.
{{/usCountry}}'ఈ అద్భుతమైన, ఘనమైన విజయం సాధించిన విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ క్షణం మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మరియు మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనం. తమిళనాడు ప్రజలు తమ తీర్పును బిగ్గరగా, స్పష్టంగా, అపారమైన గర్వంతో వెల్లడించారు. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, లక్షలాది మందితో ఉన్న మీ లోతైన, శక్తివంతమైన అనుబంధానికి జరుపుకొనే వేడుక. మీరు ఈ స్ఫూర్తిదాయకమైన కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నప్పుడు మీకు గొప్ప శక్తి, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాం. ఎంతో మంది ఆశిస్తున్న మార్పును మీరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఈ అద్భుతమైన విజయానికి మరోసారి అభినందనలు!' అని కాజల్ అగర్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ దళపతికి శుభాకాంక్షలు తెలిపారు చియాన్ విక్రమ్, సూర్య, ధనుష్. విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, నిఖిల్ వంటి యువ నటులు కూడా "జననాయగన్ (ప్రజా నాయకుడు)" అంటూ విజయ్‌ని ట్యాగ్ చేస్తూ తమిళ రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని కొనియాడారు. మొత్తంమీద విజయ్ విజయం అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది.