...
...
Next Story

పవన్ కల్యాణ్ పవర్.. దేఖ్‌లేంగే సాలా సాంగ్ 24 గంటల్లోనే రికార్డు.. రామ్ చరణ్ చికిరి చికిరి రికార్డు బ్రేక్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేంజ్ ఏంటో తాజాగా మరోసారి తేలిపోయింది. ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ దేఖ్‌లేంగే సాలా ఇప్పుడు యూట్యూబ్ లో తొలి 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది.

Published on: Dec 14, 2025, 20:21:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

పవన్ కల్యాణ్ ఈ ఏడాది ఇప్పటికే ఓజీ రూపంలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో మరో బ్లాక్‌బస్టర్ కోసం రెడీ అవుతున్నాడు. శనివారం (డిసెంబర్ 13) ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దేఖ్‌లేంగే సాలా పాట రాగా.. 24 గంటల్లోనే దీనికి ఏకంగా 29.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ క్రమంలో రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ రికార్డు బ్రేక్ చేసింది.

దేఖ్‌లేంగే సాలా సునామీ

పవన్ కల్యాణ్ పవర్.. దేఖ్‌లేంగే సాలా సాంగ్ 24 గంటల్లోనే రికార్డు.. రామ్ చరణ్ చికిరి చికిరి రికార్డు బ్రేక్..
పవన్ కల్యాణ్ పవర్.. దేఖ్‌లేంగే సాలా సాంగ్ 24 గంటల్లోనే రికార్డు.. రామ్ చరణ్ చికిరి చికిరి రికార్డు బ్రేక్..

పవన్ కల్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మరో సాంగ్ ఈ దేఖ్‌లేంగే సాలా. ఇది శనివారం సాయంత్రం 6.30 గంటలకు రిలీజైంది. తొలి 24 గంటల్లోనే 29.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పెద్ది మూవీలోని చికిరి చికిరి పాట 29.19 మిలియన్ వ్యూస్ తో క్రియేట్ చేసిన రికార్డును ఇప్పుడీ దేఖ్‌లేంగే సాలా బ్రేక్ చేసింది.

తొలి 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన తెలుగు సాంగ్‌గా ఈ దేఖ్‌లేంగే సాలా నిలిచింది. దీంతో ఈ లిస్టులో తొలి రెండు స్థానాల్లోనూ మెగా హీరోల పాటలే నిలవడం విశేషం. ఈ పాటలో పవన్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

దేఖ్‌లేంగే సాలా పాట గురించి..

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇది. ‘రమ్ పమ్ పమ్ రమ్ పమ్ పమ్.. స్టెప్ ఎస్తే భూకంపం’ అంటూ మొదలయ్యే సాంగ్ అదిరిపోయింది. మధ్యలో ‘దేఖ్‌లేంగే సాలా.. చూసినామ్లే చాలా’ అనే హుక్ లైన్ పాటకు మరింత జోష్ తెచ్చింది.

ఏపీ డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కోసం పవన్ కల్యాణ్ ముందే కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ఇటీవల ఆయన నటించిన హరిహరి వీరమల్లు, ఓజీ రిలీజ్ అయ్యాయి. ఓజీ సక్సెస్ తో పవన్ లో మరింత జోష్ పెంచింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని రెడీ చేస్తున్నారు. ఇందులో మరోసారి పవన్ కల్యాణ్ ను పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు హరీష్ శంకర్. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి హిట్ అయిందో తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe