...
...
Next Story

Pawan Kalyan Health Update : ఆసుపత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ - ముంబై నుంచి హైదరాబాద్‌కు రాక, ఆరోగ్యం ఎలా ఉందంటే..

Pawan Kalyan Health Update : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ నివాసానికి బయలుదేరారు.

Published on: Jul 15, 2026 05:04 PM IST
Advertisement

Pawan Kalyan Health Update : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో… ఇవాళ వైద్యులు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

హైదరాబాద్ నివాసానికి పవన్…

ఆసుపత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్చార్జ్
ఆసుపత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్చార్జ్

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పవన్ కళ్యాణ్ ముంబయి నుంచి నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినప్పటికీ…. ఆయన మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేనాని ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…. ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు.

శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య బృందం పవన్ కళ్యాణ్‌కు పలు కీలక సూచనలు చేసింది. ఆపరేషన్ జరిగిన కుడి భుజం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. అంతవరకు భుజంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలని కోరారు.

వైద్యుల సూచనల మేరకు మరో మూడు వారాల తర్వాత నుంచి ఆయనకు రెగ్యులర్ ఫిజియోథెరపీ ప్రారంభం కానుంది. ఈ ఫిజియోథెరపీ సెషన్ల ద్వారా భుజం కదలికలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వైద్య నిపుణులు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన మరికొన్ని రోజుల పాటు క్రియాశీలక రాజకీయ పర్యటనలకు దూరంగా ఉండి… పూర్తిగా విశ్రాంతికే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe