...
...
Next Story

Pawan Kalyan Fan: ‘చోటా గబ్బర్ సింగ్’ పోరాటం ముగిసింది.. పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టిన హన్మకొండ అభిమాని నిరంజన్ కన్నుమూత!

Pawan Kalyan Fan Niranjan: అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతూ, తన ఆరాధ్య నటుడు పవన్ కళ్యాణ్‌ను కలవాలనే ఆఖరి కోరికను తీర్చుకున్న వరంగల్ యువకుడు పొనుగంటి నిరంజన్ తుదిశ్వాస విడిచారు. కొద్దివారాల క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ బాలుడి నివాసానికి వచ్చి పరామర్శించిన సంగతి తెలిసిందే.

Published on: Jul 8, 2026, 09:15:36 IST
Advertisement

Pawan Kalyan Fan Niranjan: జనసేన క్యాడర్‌లో, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల్లో తీవ్ర విషాదం నిండింది. గత కొంతకాలంగా మంచానికే పరిమితమై, మరణంతో పోరాడిన హన్మకొండకు చెందిన ‘చోటా గబ్బర్ సింగ్’ పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు. నిరంజన్ మరణవార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా Pawan Kalyan fan Niranjan passes away అనే హాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్

‘చోటా గబ్బర్ సింగ్’ పోరాటం ముగిసింది.. పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టిన హన్మకొండ అభిమాని నిరంజన్ కన్నుమూత! (x/JanaSenaParty)
‘చోటా గబ్బర్ సింగ్’ పోరాటం ముగిసింది.. పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టిన హన్మకొండ అభిమాని నిరంజన్ కన్నుమూత! (x/JanaSenaParty)

తెలంగాణలోని హన్మకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడ్డారు. అతను పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి కూడా వెళ్లారు. ఇప్పుడు నిరంజన్ మరణ వార్త తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతని ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.

అభిమాని కోరిక కోసం

కొద్దివారాల క్రితమే నిరంజన్ జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది. తాను చనిపోయేలోపు ఒక్కసారైనా పవన్ కళ్యాణ్‌ను చూడాలనే నిరంజన్ ఆవేదన సోషల్ మీడియా ద్వారా పవన్‌కు చేరింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అత్యంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ అన్ని ప్రోటోకాల్స్ పక్కనబెట్టి తెలంగాణలోని హన్మకొండ హనుమాన్ నగర్‌లోని నిరంజన్ నివాసానికి స్వయంగా విచ్చేశారు.

పవన్ ఇచ్చిన భరోసా

కేవలం పరామర్శించడమే కాకుండా, నిరంజన్ వైద్య ఖర్చుల కోసం పవన్ కళ్యాణ్ రూ.1 లక్ష తక్షణ ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆ కుటుంబ జీవనోపాధి కోసం తెలంగాణ జనసేన నేతల ఆధ్వర్యంలో ఒక శాశ్వత క్యాంటీన్ (ఫుడ్ కోర్ట్) ఏర్పాటు చేసేలా బాధ్యతలు అప్పగించారు. నిరంజన్ కు కుక్కపిల్ల అంటే ఇష్టం అని అప్పుడు చెప్పారు. పవన్ ఆ రోజే కుక్కపిల్లను బహుమతిగా అందించారు.

నిరంజన్ గతంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు పవన్ సినిమాల సాంగ్స్ కు వేసిన డాన్స్ వీడియోలను చూసి పవన్ అప్పట్లో మురిసిపోయారు. తన ఆఖరి శ్వాస విడిచే ముందే తన ఆరాధ్య నటుడిని ప్రత్యక్షంగా కలుసుకుని, తన అతిపెద్ద కలను నిరంజన్ నెరవేర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఓదార్పు ఒక్కటే అతని కుటుంబానికి మిగిలింది.

అసలేంటి ఈ ‘డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ వ్యాధి?

నిరంజన్ చిన్నతనం నుంచి 'డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ' (Duchenne Muscular Dystrophy - DMD) అనే అత్యంత అరుదైన జన్యుపరమైన రుగ్మతతో బాధపడ్డారు. ఈ వ్యాధి వల్ల శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడి, ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది.

ఒక దశలో ఊపిరితిత్తులు, గుండె కండరాలు కూడా పనిచేయడం మానేస్తాయి. వైద్యశాస్త్రంలో దీనికి సరైన చికిత్స లేకపోవడంతో, నిరంజన్ సుదీర్ఘ కాలం పాటు నరకయాతన అనుభవించారు. చివరకు మరణంతో చేసిన పోరాటంలో ఈ చోటా గబ్బర్ సింగ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe