పవన్ కల్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజీత్‌కు ఆ కారే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చాడో తెలుసా.. ఓ బలమైన కారణమే ఉంది

పవన్ కల్యాణ్ తన బిగ్గెస్ట్ హిట్ ఓజీ మూవీ డైరెక్టర్ సుజీత్ కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారే ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ సినిమా కోసం సుజీత్ తన దగ్గర ఉన్న ఇదే కారును అమ్మి జపాన్ లో షూటింగ్ చేశాడు. ఈ విషయం తెలిసి పవన్ అదే కారు ఇవ్వడం విశేషం.

Published on: Dec 19, 2025, 16:31:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల 'ఓజీ' (OG) దర్శకుడు సుజీత్‌కు రూ. 3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చాడు. అందరూ ఇది సినిమా హిట్ అయినందుకు ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. సినిమా షూటింగ్ కోసం సుజీత్ తన సొంత కారును అమ్మేస్తే, అది తెలుసుకున్న పవన్ తిరిగి అదే కారును కొనిచ్చాడు.

పవన్ కల్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజీత్‌కు ఆ కారే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చాడో తెలుసా.. ఓ బలమైన కారణమే ఉంది
పవన్ కల్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజీత్‌కు ఆ కారే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చాడో తెలుసా.. ఓ బలమైన కారణమే ఉంది

ల్యాండ్ రోవర్ డిఫెండరే ఎందుకంటే?

ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. యువ దర్శకుడు సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమా ఘనవిజయం సాధించిన ఆనందంలో పవన్ ఈ బహుమతి ఇచ్చారని అందరూ భావించారు. కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన, ఎమోషనల్ కారణం ఉంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఓజీ' షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు సుజీత్ ఒక కీలకమైన సీక్వెన్స్‌ను జపాన్ లో తీయాలనుకున్నాడు. బడ్జెట్ పరిమితుల వల్ల నిర్మాతలు ఆలోచిస్తున్న సమయంలో.. ఆ సీన్స్ సినిమాకు చాలా అవసరమని సుజీత్ భావించాడు.

ఎలాగైనా ఆ షూటింగ్ జరగాలని గట్టిగా నిర్ణయించుకున్న సుజీత్.. దానికోసం డబ్బు సమకూర్చడానికి తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేశాడు. ఆ డబ్బుతో జపాన్ వెళ్లి అనుకున్న షాట్స్ పూర్తి చేశాడు.

డబ్బింగ్ సమయంలో తెలుసుకున్న పవన్..

పవన్ కల్యాణ్ కు మొదట్లో ఈ విషయం తెలియదు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక, డబ్బింగ్ చెబుతున్న సమయంలో సుజీత్ తన కారు అమ్ముకున్న విషయం పవన్‌కు తెలిసింది.

సినిమా కోసం సుజీత్ చూపించిన అంకితభావానికి పవన్ ఫిదా అయ్యాడు. తన సినిమా కోసం దర్శకుడు సొంత కారును త్యాగం చేయడం పవన్‌ను కదిలించింది. అందుకే సుజీత్ ఏ మోడల్ కారునైతే అమ్ముకున్నాడో.. సరిగ్గా అదే మోడల్ కొత్త కారును పవన్ బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు ఆ కారుకు సంబంధించిన ఈఎంఐలను కూడా పవన్ స్వయంగా కడుతున్నాడని సమాచారం.

సుజీత్ ఎమోషనల్ పోస్ట్

పవన్ ఇచ్చిన గిఫ్ట్ చూసి సుజీత్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మూడు రోజుల కిందట సోషల్ మీడియాలో కారు ఫోటోలు షేర్ చేస్తూ..

"నా లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ ఇదే. మాటలు రావడం లేదు. నా డియరెస్ట్ OG కల్యాణ్ గారి ప్రేమ, ప్రోత్సాహం నాకు సర్వస్వం. చిన్నప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్‌ని.. ఇప్పుడు ఈ స్పెషల్ మూమెంట్.. ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన 'ఓజీ' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 293.65 కోట్లు వసూలు చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More