ఓజీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో సచిన్ టెండూల్కర్- టెక్నో పెయింట్స్ న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా గాడ్ ఆఫ్ క్రికెట్
మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ప్రముఖ కంపెనీ టెక్నో పెయింట్స్‌కు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం అయ్యారు. దీనికి సంబంధించి రెండు యాడ్ ఫిల్మ్స్‌ను సచిన్‌తో చిత్రీకరించనున్నారు. అయితే, ఈ రెండు యాడ్ ఫిల్మ్స్‌ను పవన్ కల్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందించనున్నారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలోని అతిపెద్ద దిగ్గజాల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డ్స్, నెలకొల్పిన ఘనతలు అన్ని ఇన్నీ కావు.

ఓజీ మూవీతో ఫుల్ ట్రీట్
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చిన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఓజీ మూవీతో ఫుల్ ట్రీట్ ఇచ్చిన డైరెక్టర్ సుజీత్. రన్ రాజా రాన్, సాహో సినిమాలతో అలరించిన సుజీత్ వింటేజ్ పవన్ కల్యాణ్‌ను చూపించి హిట్ అందుకున్నాడు.
ఒక్కటి కానున్న సచిన్, సుజీత్
ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యంగ్ డైరెక్టర్ సుజీత్ ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టింది టెక్నో పెయింట్స్. రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన ప్రముఖ పెయింట్స్ కంపెనీలో టెక్నో పెయింట్స్ ఒకటి.
వ్యాపార విస్తరణలో
ఇప్పుడు టెక్నో పెయింట్స్ తన వ్యాపార విస్తరణలో భాగంగా పాన్ ఇండియా సేల్స్ అండ్ ఆపరేషన్స్‌తో పాటు రిటైల్ రంగంలో నూతన భాగస్వాములతో కలసి ఫ్రాంచైజీలను అన్ని రాష్ట్రాలలో నెలకొల్పుతున్నారు. దానిలో భాగంగా బ్రాండ్ టెక్నా పెయింట్స్ దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు అన్ని ప్రాంతాల ప్రజలకి, కస్టమర్లకి మరింత చేరువ కానుంది.
రెండు యాడ్ ఫిల్మ్స్
అందుకు తన నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌ని నియమించుకుంది. ఈ సందర్భంగా గురువారం (నవంబర్ 6) నాడు ముంబయిలో రెండు ప్రచార చిత్రాలను నిర్మించారు. ఈ రెండు యాడ్ ఫిల్మ్స్ కూడా ఓజీ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించాడు.
అటు క్రికెట్, ఇటు సినీ రంగంలో
ఈ రెండు ప్రచార చిత్రాలు అతి త్వరలోనే దేశంలోని అన్ని ప్రముఖ మధ్యమాల ద్వారా విడుదల చేయటానికి ప్రయత్నిస్తామని కంపెనీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇలా టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ నియామకం కావడం, ఆయనతో సుజీత్ యాడ్ ఫిల్మ్స్ తెరకెక్కించటం అటు క్రికెట్, ఇటు సినీ రంగంలో ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












