పవన్ కల్యాణ్ కెరీర్లోనే అతిపెద్ద ఓజీ రూపంలో వచ్చిన విషయం తెలుసు కదా. ఈ ఏడాది రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ దుమ్ము రేపింది. దీంతో తనకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన డైరెక్టర్ సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన ఖరీదైన బహుమతికి సంబంధించిన ఫొటోలను సుజీత్ మంగళవారం (డిసెంబర్ 16) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
“జీవితంలో బెస్ట గిఫ్ట్ ఇది. మాటలకు అందని కృతజ్ఞతా భావంతో నిండిపోయాను. మా డియరెస్ట్ ఓజీ పవన్ కల్యాణ్ గారి నుంచి అందిన ప్రేమ, ప్రోత్సాహం వర్ణించలేనిది. చిన్నప్పుడు అభిమానిగా ఉన్నప్పటి నుంచీ ఇప్పుడీ ప్రత్యేక క్షణం వరకు.. ఎప్పటికీ రుణపడి ఉంటాను” అనే క్యాప్షన్ తో సుజీత్ పోస్ట్ చేశాడు.
ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్
డైరెక్టర్ సుజీత్ కు పవన్ కల్యాణ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ కారుతోపాటు పవన్ కల్యాణ్ తో ఉన్న ఫొటోలను సుజీత్ షేర్ చేశాడు. ఇందులో సుజీత్ కోసం పవన్ కారు డోరు తెరవడం, ఆ తర్వాత కారులో కూర్చున్న సుజీత్ డ్రైవ్ చేయడానికి సిద్ధంగా ఉండటం, తర్వాత కారు ముందు ఇద్దరూ కలిసి ఉండటం ఈ ఫొటోల్లో చూడొచ్చు.
ఓజీ మూవీ గురించి..
ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ తోపాటు ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మిలాంటి వాళ్లు నటించారు. ఇదో గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఒక డై హార్డ్ ఫ్యాన్ తన అభిమాన హీరోతో సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహారణే ఓజీ. డైరెక్టర్‌గా సామాన్య ప్రేక్షకుడికి నచ్చేలా కాకుండా పూర్తిగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఎలివేషన్స్‌తో ఓజీ మూవీని డైరెక్ట్ చేశాడు సుజీత్. పవర్ స్టార్ అభిమానులు పవన్ కల్యాణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు.
{{/usCountry}}ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ తోపాటు ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మిలాంటి వాళ్లు నటించారు. ఇదో గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఒక డై హార్డ్ ఫ్యాన్ తన అభిమాన హీరోతో సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహారణే ఓజీ. డైరెక్టర్‌గా సామాన్య ప్రేక్షకుడికి నచ్చేలా కాకుండా పూర్తిగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఎలివేషన్స్‌తో ఓజీ మూవీని డైరెక్ట్ చేశాడు సుజీత్. పవర్ స్టార్ అభిమానులు పవన్ కల్యాణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు.
{{/usCountry}}ఓజీ సినిమాతో వింటేజ్ పవన్ కల్యాణ్‌ను చూస్తారు. పవన్ కల్యాణ్ స్వాగ్, స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ అంతా నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అంతకుమించి అన్నట్లుగా పవర్ స్టార్‌తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో డైలాగ్స్ కంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ. ప్రతి సీన్ పవన్ కల్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.