Pawan Kalyan Health: ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు వరుస ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇటీవల కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం బారిన పడ్డారు. దీంతో భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా షెడ్యూల్ చేసిన ఈవెంట్లను క్యాన్సిల్ చేసుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఇవాళ (ఆగస్టు 15) పవన్ కళ్యాణ్ కాకినాడలోని పరేడ్ మైదానంలో భార స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాసేపు అక్కడే గడిపారు.
పవన్ కళ్యాణ్ కు జ్వరం
కాకినాడలో కార్యక్రమం ముగించుకుని పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రత పెరగడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారు.
వైద్య పరీక్షలు
రాజమహేంద్రవరంలో వైద్య నిపుణులు పవన్ కళ్యాణ్ ను పరీక్షించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో తన కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆనవాయితీగా నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి కూడా ఆయన దూరం కానున్నారు. జ్వరం కొంత తగ్గగానే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరనున్నారు.
భుజం శస్త్రచికిత్స
పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. వరుస రాజకీయ పర్యటనలు, అధికారిక సమీక్షలు, స్వాతంత్య్ర దినోత్సవ బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు తగినంత విశ్రాంతి లభించలేదు.
{{/usCountry}}పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. వరుస రాజకీయ పర్యటనలు, అధికారిక సమీక్షలు, స్వాతంత్య్ర దినోత్సవ బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు తగినంత విశ్రాంతి లభించలేదు.
{{/usCountry}}ఈ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న వెంటనే భుజం శస్త్రచికిత్స అనంతర ఫిజియోథెరపీ ప్రోటోకాల్‌పై నిపుణులైన వైద్యుల సలహాలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్.
తీవ్ర జ్వరం, శస్త్రచికిత్స తర్వాతి అలసట వల్ల రాబోయే 2-3 రోజుల పాటు ఆయన తన అధికారిక సమీక్షలు, పాలనా పరమైన భేటీలను వాయిదా వేసుకునే అవకాశం ఉంది.
సినిమాలు ఎప్పుడు?
కంటిన్యూయస్ పొలిటికల్ షెడ్యూల్స్, ప్రభుత్వ బాధ్యతలతో పాటు సర్జరీ తర్వాతి రికవరీ కాలంలో సరైన విశ్రాంతి లేకపోవడమే పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రభావం చూపింది. స్వల్ప విరామం అనంతరం ఆయన తిరిగి కోలుకుని పాలనా వ్యవహారాల్లో క్రియాశీలకం కానున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ నుంచి నెక్ట్స్ సినిమా ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఓజీ 2 పట్టాలెక్కాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కు అరోగ్యం పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి.