Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు సినిమా అభిమానులకు ఈ పేరు కొత్త కాదు. కానీ చాలా మంది సినిమా వాళ్లలాగే ఆయన కూడా తన అసలు పేరు మార్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చారన్న విషయం మీకు తెలుసా? అసలు తన పేరు పవన్ కాదని తాజాగా ఏఎన్ఐ పాడ్‌కాస్ట్ లో వెల్లడించడం విశేషం. మరి ఆ పేరు వెనుక స్టోరీ ఏంటో చూస్తారా?
నా అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్

పవన్ కళ్యాణ్ తొలిసారి ఓ పాడ్‌కాస్ట్ లో మాట్లాడారు. ఇందులో భాగంగా ఏఎన్ఐ జర్నలిస్ట్ మొదట్లోనే మిమ్మల్ని పవన్ అని పిలవాలా.. కళ్యాణ్ అని పిలవాలా.. అసలు ఆ రెండు పేర్లు కలిపి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దీనికి పవన్ స్పందిస్తూ..
“నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు. నిజానికి నాకు తిరుమల దేవస్థానం సన్నిధిలో పేరు పెట్టారు. నాకు పెట్టిన పేరు శ్రీ కళ్యాణ్ కుమార్. స్కూల్ సర్టిఫికెట్లలో ఆ పేరు నుంచి శ్రీ వెళ్లిపోయింది. కే కళ్యాణ్ కుమార్ అని మిగిలింది. అయితే మా మార్షల్ ఆర్ట్స్ నేర్పించే గురువు పవన్ అని నా పేరు ముందు చేర్చారు. నేను అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ లో చాలా బరువైన పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని. ఛాతీపై చాలా బరువైన బండలు పెట్టుకొని పగలగొట్టించుకునే వాడిని. అది చూసి నువ్వు పవనసుతుడు హనుమంతుడిలా ఉన్నావంటూ పవన్ అనే పేరును జోడించారు” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తుపాకీ పట్టి నక్సలైట్ అవుదామనుకున్నా!
ఇక ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎన్నో అంశాలపైనా స్పందించారు. అందులో తాను టీనేజ్ లో ఉన్నప్పుడు నక్సలైట్ కావాలనుకున్న విషయాన్ని కూడా వెల్లడించారు.
"నా టీనేజ్ చివరి రోజుల్లో సొసైటీలో ఉన్న అసమానతలను చూసి బాగా విసిగిపోయాను. ఒకానొక దశలో తుపాకీ పట్టుకుని అడవి బాట పట్టి, నక్సలైట్ అయిపోవాలని బలంగా అనుకున్నాను" అని పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యారు.
రాహుల్ గాంధీపై పవన్ ఘాటు విమర్శలు
{{/usCountry}}"నా టీనేజ్ చివరి రోజుల్లో సొసైటీలో ఉన్న అసమానతలను చూసి బాగా విసిగిపోయాను. ఒకానొక దశలో తుపాకీ పట్టుకుని అడవి బాట పట్టి, నక్సలైట్ అయిపోవాలని బలంగా అనుకున్నాను" అని పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యారు.
రాహుల్ గాంధీపై పవన్ ఘాటు విమర్శలు
{{/usCountry}}ప్రస్తుతం దేశంలో రీజనల్ పాలిటిక్స్, నార్త్-సౌత్ ఇండియా మధ్య రచ్చపై చర్చలు నడుస్తున్న టైమ్ లో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకూ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ టాపిక్ తీస్తూ కాంగ్రెస్ వైఖరిని ఆయన గట్టిగా నిలదీశారు.
"హైదరాబాద్‌కు నేను రాకూడదని కాంగ్రెస్ ఒకవేళ నాకు చెబితే, అప్పుడు నేను రాహుల్ గాంధీకి ఒక విషయం క్లియర్ గా చెప్పాల్సి ఉంటుంది. ఆయనకు అసలు సౌత్ ఇండియాతో సంబంధమే లేదని నేను అనాల్సి వస్తుంది" అని పవన్ కళ్యాణ్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
మోదీతో బాండింగ్.. ఆ సినిమాలు భలే నచ్చాయి
కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో కీ రోల్ ప్లే చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సాన్నిహిత్యం చాలా స్పెషల్. ఈ ఇంటర్వ్యూలో మోదీతో తనకున్న వ్యక్తిగత బంధాన్ని పవన్ పంచుకున్నారు.
"ప్రధాని మోదీ నాతో ఎప్పుడూ ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ఆయన దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చే అద్భుతమైన నాయకుడు. మా మధ్య జరిగే ప్రతి డిస్కషన్ కేవలం దేశం, దేశాభివృద్ధి గురించే సాగుతుంది" అని పవన్ తెలిపారు.
ఇదే టైమ్ లో రీసెంట్ గా ఇండస్ట్రీలో వస్తున్న దేశభక్తి, జాతీయవాద సినిమాలపై ఆయన పాజిటివ్ గా స్పందించారు. బాలీవుడ్ యాక్షన్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) తో పాటు కశ్మీర్ లోయలోని రియల్ లైఫ్ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన 'బారముల్లా' (Baramulla) సినిమాలు తనకు భలే నచ్చాయని చెప్పారు.
కశ్మీర్‌లో ఎదురైన ఆ చేదు అనుభవాలు
1980ల చివరలో కశ్మీర్ లోయలో ఉన్న తీవ్రవాద పరిస్థితులను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1987 నుంచి 1989 మధ్య కాలంలో తాను శ్రీనగర్‌లో గడిపిన రోజులను పంచుకున్నారు. ఆ టైమ్ లో అక్కడ వాతావరణం చాలా భయంకరంగా, ఉద్రిక్తంగా ఉండేదని చెప్పారు.
"మేము శ్రీనగర్ రోడ్లపై తిరుగుతున్నప్పుడు లోకల్స్ మమ్మల్ని చూసి ఎగతాళి చేసేవాళ్లు. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటూ మా మీద సీరియస్ అయ్యేవాళ్లు" అని ఆనాటి చేదు అనుభవాలను పవన్ కళ్యాణ్ వివరించారు.