Pawan Kalyan Son: నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబానికి నేడు (ఏప్రిల్ 8) అత్యంత భావోద్వేగపూరితమైన రోజు. పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ నేడు తన 22వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే అదే సమయంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ భార్య అన్నాలెజినోవా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
అకిరాకు శుభాకాంక్షలు.. మార్క్ కు 'రెండో పుట్టినరోజు'

తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో అన్నా తన ఇద్దరు కుమారుల గురించి ప్రస్తావించింది. "నేడు మా కుటుంబానికి చాలా ఎమోషనల్ డే. అకిరా పుట్టినరోజు.. తను ఎదుగుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. అదే సమయంలో సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అగ్నిప్రమాదంలో మార్క్ ప్రాణాలు కోల్పోయేవాడే. ఈ రోజు మార్క్ కు ఇది రెండో పుట్టినరోజు లాంటిది" అని ఆమె రాసుకొచ్చింది.
సింగపూర్ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి
గతేడాది ఏప్రిల్ 8న సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్‌లో ఒక షాప్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సమ్మర్ క్యాంప్‌లో ఉన్న మార్క్ సహా పలువురు చిన్నారులు ఇందులో తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ అన్నా భయంకరమైన నిజాలను బయటపెట్టారు. "ప్రమాదం జరిగి ఏడాది గడిచినా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. 10 ఏళ్ల చిన్నారి ఫ్రేయా ప్రాణాలు కోల్పోవడానికి, 18 మంది చిన్నారులు ఆసుపత్రి పాలవడానికి కారణమెవరో మాకు ఇంకా తెలియలేదు. కొందరికి ఇప్పటికీ సర్జరీలు అవసరమవుతున్నాయి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
"మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే.."
ప్రమాదం జరిగిన సమయంలో మార్క్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని అన్నా వెల్లడించింది. "దేవుడి దయ వల్ల మార్క్ బతికాడు. ఆసుపత్రిలో మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే పక్కనే కూర్చుని నేను పడ్డ వేదన ఏ తల్లికీ రాకూడదు. నేడు మార్క్ ఆరోగ్యంగా మా మధ్య ఉండటమే మాకు అన్నింటికంటే ముఖ్యం" అని ఆమె పేర్కొంది.
{{/usCountry}}ప్రమాదం జరిగిన సమయంలో మార్క్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని అన్నా వెల్లడించింది. "దేవుడి దయ వల్ల మార్క్ బతికాడు. ఆసుపత్రిలో మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే పక్కనే కూర్చుని నేను పడ్డ వేదన ఏ తల్లికీ రాకూడదు. నేడు మార్క్ ఆరోగ్యంగా మా మధ్య ఉండటమే మాకు అన్నింటికంటే ముఖ్యం" అని ఆమె పేర్కొంది.
{{/usCountry}}ఆ సమయంలో ఫైర్ ఫైటర్లు రాకముందే 15 మంది చిన్నారులను రక్షించిన నిర్మాణ కార్మికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇంటి వద్ద అగ్నిమాపక పరికరాలు ఉంచుకోవాలని అందరికీ సూచించింది.
గతేడాది మార్క్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయ్ ద్వారా అకిరా నందన్, ఆద్య.. అన్నా లెజినోవా ద్వారా పోలెనా అంజనా, మార్క్ శంకర్ అనే నలుగురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: మార్క్ శంకర్ పవనోవిచ్‌కు అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగింది?
జవాబు: ఏప్రిల్ 8, 2025న సింగపూర్‌లోని ఒక సమ్మర్ క్యాంప్‌లో మార్క్ ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
ప్రశ్న: మార్క్ శంకర్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
జవాబు: ప్రమాదం జరిగిన సమయంలో అతని ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పటికీ, ఏడాది చికిత్స అనంతరం ప్రస్తుతం మార్క్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.
ప్రశ్న: అకిరా నందన్ వయస్సు ఎంత?
జవాబు: అకిరా నందన్ నేడు (ఏప్రిల్ 8, 2026) తన 22వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.