Pawan Kalyan Wife: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సాధారణంగా తన సినిమాలకు లేదా రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే పంచుకుంటారు. ఆయన పర్సనల్ విషయాలను, ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను బయటపెట్టడం చాలా అరుదు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా (ఇప్పుడు అన్నా కొణిదెల) కు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమె అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయడంతో, పవన్ స్వయంగా ఒక పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

"ప్రియమైన అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోకి నీకు హృదయపూర్వక స్వాగతం. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్న నీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ రాకతో ఇక్కడ ఎన్నో స్పూర్తిదాయకమైన, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. తన భార్యకు ఆయన ఇచ్చిన ఈ అరుదైన వెల్‌కమ్ మెసేజ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
వైరల్ అవుతున్న కొణిదెల కోడలి తొలి పోస్ట్..
పవన్ స్వాగతం పలికిన కాసేపటికే, కొణిదెల కోడలు అన్నా తన ఖాతాలో తొలి పోస్ట్ పెట్టారు. అది కూడా ఒక స్పెషల్ పోస్ట్ కావడం విశేషం. ఇంతవరకు ఎవరూ చూడని తన భర్త పవన్ కళ్యాణ్ ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. దాదాపు బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉన్న ఆ ఫోటోలో పవన్, అన్నా ఇద్దరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోకు నిమిషాల్లోనే లక్షల్లో లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తూ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ.. "ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావడం చాలా ఆలస్యమైంది. కానీ ఇదే సరైన సమయం అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ మద్దతుతో నా ఈ ప్రయాణం మొదలుపెడుతున్నాను" అని అన్నా కొణిదెల రాసుకొచ్చారు.
రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్..
వీటన్నింటి కంటే ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయో. అందులో ఆమె "రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్" అని రాసుకున్నారు. తాను పుట్టి పెరిగిన రష్యా మూలాలను గుర్తుంచుకుంటూనే, భారతీయ సంప్రదాయాలకు, ఇక్కడి జీవితానికి ఆమె ఎంతలా కనెక్ట్ అయ్యారో ఈ ఒక్క వాక్యం చెబుతోంది.
{{/usCountry}}వీటన్నింటి కంటే ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయో. అందులో ఆమె "రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్" అని రాసుకున్నారు. తాను పుట్టి పెరిగిన రష్యా మూలాలను గుర్తుంచుకుంటూనే, భారతీయ సంప్రదాయాలకు, ఇక్కడి జీవితానికి ఆమె ఎంతలా కనెక్ట్ అయ్యారో ఈ ఒక్క వాక్యం చెబుతోంది.
{{/usCountry}}ఇక అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వదినమ్మ సోషల్ మీడియాలోకి వచ్చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమె పోస్ట్‌లో చిరంజీవి ఆశీస్సులు అని ప్రస్తావించడంతో, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు మిగతా మెగా ఫ్యామిలీ సభ్యులు ఆమెకు సోషల్ మీడియాలో ఎలా స్వాగతం పలుకుతారో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.