...
...
Next Story

PEDDI OTT: వామ్మో.. పెద్ది మూవీ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా? అదిరే డీల్‌.. సూప‌ర్ హిట్ అయితే బోన‌స్ కూడా!

PEDDI OTT: రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ పెద్ది క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కు అదిరే రేట్ దక్కిందని తెలిసింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: Apr 5, 2026, 18:13:21 IST
Advertisement

మోస్ట్ అవైైటెడ్ సినిమాల్లో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ ఒకటి. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ కు కళ్లు చెదిరే రేటు పలికిందని సమాచారం. ఇప్పుడు ఈ బజ్ తెగ ట్రెండ్ అవుతోంది. పెద్ది ఓటీటీ రేటు హాట్ టాపిక్ గా మారింది.

పెద్ది ఓటీటీ

పెద్ది హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు
పెద్ది హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు

రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పెద్ది మూవీ ఓటీటీ డీల్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఓటీటీ డీల్ రేట్ విషయంపై తాజా బజ్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ ను స్పష్టం చేస్తోంది.

డీల్ అదుర్స్

పెద్ది సినిమా ఓటీటీ తాజా డీల్ రేటు సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది.

బోనస్ కూడా

పెద్ది మూవీ ఓటీటీ డీల్ లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ మరో బోనస్ ఆఫర్ కూడా ప్రకటించినట్లు తెలిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అదనంగా రూ.20 కోట్లను నెట్‌ఫ్లిక్స్ చెల్లించనున్నట్లు టాక్. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత పెద్ది మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

వేరే లెవల్ హైప్

ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ రీసెంట్ గా రామ్ చరణ్ ఈ ప్రచారాన్ని ఖండించాడు. ఏప్రిల్ 30నే పెద్ది రిలీజ్ అవుతుందని మరోసారి క్లారిటీనిచ్చాడు. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks