PEDDI: పెద్ది రిలీజ్‌పై ఈ కన్ఫ్యూజన్ ఏంటీ? వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు షాక్ తప్పదా?
PEDDI: ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కామెంట్లు పెద్ద రచ్చకే తెరదీశాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ సినిమా ఏప్రిల్ లోనే వస్తుందా? రాదా? అన్నది ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది.
ఉన్నట్లుండి ఒక్కసారిగా పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు తెగ డిస్కషన్ పాయింట్ గా మారింది. ఇదే విషయం వైరల్ అవుతుంది. అసలు పెద్ది రిలీజ్ షెడ్యూల్ ప్రకారమే ఉంటుందా? మళ్లీ వాయిదా పడుతుందా? అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీనంతటికి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన కామెంట్లే కారణం.

పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా సినిమాను డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోనూ రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 30 అనే పేర్కొన్నారు.
ఎస్కేఎన్ కామెంట్లు
పెద్ది సినిమా ఏప్రిల్ 30నే వస్తుందని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) బాంబు పేల్చాడు. ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో ఎస్కేఎన్ చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి.
‘‘జూన్ 26న చెన్నై లవ్ స్టోరీ మూవీని రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ అదే తేదీన పెద్ది విడుదల ఉందని సాయి రాజేశ్ చెప్పారు. అందుకే మా మూవీ రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తాం’’ అని ఎస్కేఎన్ అన్నాడు.
మళ్లీ వాయిదానా?
ఎస్కేఎన్ మాటలను బట్టి చూస్తే పెద్ది సినిమా మరోసారి వాయిదా పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 30 నుంచి జూన్ 26కు సినిమాను పోస్ట్ పోన్ చేస్తారనేలా ఎస్కేఎన్ కామెంట్లున్నాయి.
అయితే దీనిపై మళ్లీ క్లారిటీ ఇస్తూ ఎస్కేఎన్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఏదో పొరపాటున పెద్ది రిలీజ్ డేట్ గురించి మాట్లాడానని, ఆ మూవీ విడుదల వాయిదా అనేందుకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నాడు. తన కామెంట్లకు గాను సారీ కూడా చెప్పాడు.
మేకర్స్ రియాక్షన్
ఎస్కేఎన్ కామెంట్లు వైరల్ గా మారిన నేపథ్యంలో అందరూ పెద్ది రిలీజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే దీనిపై పెద్ది మేకర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఇంకా రాలేదు. ఏప్రిల్ 30నే సినిమా రిలీజ్ అవుతుందని కానీ లేదా వాయిదా పడుతుందని కానీ ప్రస్తుతం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఫ్యాన్స్ కు షాక్!
గేమ్ ఛేంజర్ లాంటి ప్లాఫ్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. ఇందులోని ఫస్ట్ లుక్, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. పెద్ది మూవీపై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఓ సారి ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పెద్ది మూవీ రిలీజ్ ను మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి మార్చారు. ఇప్పుడు మళ్లీ వాయిదా వేస్తే అది ఫ్యాన్స్ కు షాక్ లాంటిదే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


