పెద్ది టీమ్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో క్రికెటర్ గానే రామ్ చరణ్ నటిస్తున్నాడని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ కుస్తీలో తలపడే మల్లయోధుడిలా కూడా రామ్ చరణ్ పోరాటానికి సై అంటున్నాడు. ఈ రోజు (మార్చి 27) రామ్ చరణ్ సందర్భంగా రిలీజ్ చేసిన పహిల్వాన్ గ్లింప్స్ అదిరిపోయింది.
పహిల్వాన్ గ్లింప్స్

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది మూవీ టీమ్ శుక్రవారం గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ‘పెద్ది పహిల్వాన్ గ్లింప్స్’ పేరుతో ఈ వీడియోతో టీమ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో మల్లయోధుడిలా రామ్ చరణ్ గెటప్, అతను కుస్తీ కోసం తీసుకుంటున్న శిక్షణ, పోటీలో తలపడే తీరు అదుర్స్ అనిపిస్తోంది.
ఆటే నా పొగరు
‘‘కుస్తీ అంటే బంతితో బ్యాట్ కు ఎదురెళ్లే ఆట కాదురా. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట’’ అని డైలాగ్ వినిపిస్తుండగా గ్లింప్స్ లో రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. కండలు తిరిగిన దేహంతో చెర్రీ లుక్ వేరే లెవల్ లో ఉంది. గదతో చరణ్ చేసిన విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
‘‘చూడమ్మి ఆటే నా పొగరు’’ అని ఆఖర్లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ఈ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పెద్ది సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
ఊహించని గిఫ్ట్
పెద్ది సినిమాలో రూరల్ క్రికెట్ ప్లేయర్ గానే రామ్ చరణ్ నటిస్తున్నాడని ఇన్ని రోజులు అందరూ అనుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన గ్లింప్స్, వీడియోలు, ఫొటోల్లో రామ్ చరణ్ బ్యాట్ తోనే కనిపించాడు. కానీ ఇప్పుడు కుస్తీ యోధుడిగానూ చరణ్ కనిపించనున్నాడని పహిల్వాన్ గ్లిప్స్ తో పెద్ది మూవీ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.
రామ్ చరణ్ ఎఫర్ట్
{{/usCountry}}పెద్ది సినిమాలో రూరల్ క్రికెట్ ప్లేయర్ గానే రామ్ చరణ్ నటిస్తున్నాడని ఇన్ని రోజులు అందరూ అనుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన గ్లింప్స్, వీడియోలు, ఫొటోల్లో రామ్ చరణ్ బ్యాట్ తోనే కనిపించాడు. కానీ ఇప్పుడు కుస్తీ యోధుడిగానూ చరణ్ కనిపించనున్నాడని పహిల్వాన్ గ్లిప్స్ తో పెద్ది మూవీ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.
రామ్ చరణ్ ఎఫర్ట్
{{/usCountry}}శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ లో మల్ల యోధుడిలా రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. ఈ క్యారెక్టర్ కోసం అతను ఎంతగా కష్టపడ్డాడో ఈ వీడియో చూస్తేనే తెలుస్తోంది. కండలు తిరిగిన దేహంతో రామ్ చరణ్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా కనిపించాడు.
పెద్ది రిలీజ్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30, 2026న రిలీజ్ కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ పెద్ది సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఆస్కార్ అవార్డీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.