...
...
Next Story

పెద్ది రామ్ చరణ్ చికిరి హుక్ స్టెప్పును చిరంజీవి ముఠామేస్త్రీ స్టెప్పులతో పోలుస్తున్న ఫ్యాన్స్.. ప్రోమోతోనే రచ్చ

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ నుంచి చికిరి చికిరి అంటూ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చిన విషయం తెలుసు కదా. ఇందులో రామ్ చరణ్ హుక్ స్టెప్పులను కొందరు అభిమానులు చిరంజీవి ముఠామేస్త్రీలోని స్టెప్పులతో పోల్చడం విశేషం.

Published on: Nov 5, 2025, 15:13:14 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న తాజా మూవీ 'పెద్ది'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని 'చికిరి చికిరి' అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో రామ్ చరణ్ మాస్ హుక్ స్టెప్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ స్టెప్‌ను చూసిన వెంటనే అభిమానులు, ఇది మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ సినిమా ‘ముఠా మేస్త్రి’లోని ఐకానిక్ స్టెప్‌ను పోలి ఉందని కామెంట్స్ చేశారు.

చికిరి చికిరి పాట విశేషాలు

పెద్ది రామ్ చరణ్ చికిరి హుక్ స్టెప్పును చిరంజీవి ముఠామేస్త్రీ స్టెప్పులతో పోలుస్తున్న ఫ్యాన్స్.. ప్రోమోతోనే రచ్చ
పెద్ది రామ్ చరణ్ చికిరి హుక్ స్టెప్పును చిరంజీవి ముఠామేస్త్రీ స్టెప్పులతో పోలుస్తున్న ఫ్యాన్స్.. ప్రోమోతోనే రచ్చ

రామ్ చరణ్ లీడ్ రోల్లో నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ శుక్రవారం (నవంబర్ 7) రిలీజ్ కానుంది. అయితే అంతకుముందు బుధవారం ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. కేవలం 23 సెకన్లు ఉన్న ఈ 'చికిరి చికిరి' ప్రోమోలో రామ్ చరణ్ ఒక బీడీ తాగుతూ, ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్ వేస్తూ కనిపించాడు.

చరణ్ లుక్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను మెప్పించాయి. ఈ పాటను సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచాడు. మోహిత్ చౌహాన్ ఈ పాట పాడగా, బాలాజీ సాహిత్యం అందించాడు. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.

రామ్ చరణ్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ సలాం

ఈ ప్రోమో విడుదలైన వెంటనే రామ్ చరణ్ ఫ్యాన్స్ వెంటనే దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. వాళ్లు ఈ క్లిప్‌ను ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఒక అభిమాని స్పందిస్తూ.. “పెద్ది సినిమాలో చికిరి బీట్‌కి ఆ డ్యాన్స్ ఏంటన్నా! కొండంచున బీడీ తాగి ఆ స్టెప్ ఏంట్రా చరణ్ అన్నా?!” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

"ఈ ట్రాక్‌తో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్ మొదలయ్యాయి. ఆ స్టెప్ అంటారా? అగ్గి రాజేసింది!" అని మరొక అభిమాని వ్యాఖ్యానించారు. కొందరు ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను "గ్రేస్ గాడ్" అని కూడా కీర్తించారు.

'పెద్ది' సినిమా గురించి..

'ఉప్పెన' వంటి హిట్‌తో టాలీవుడ్‌కు పరిచయమైన బుచ్చిబాబు సానా ఈ 'పెద్ది' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఫిల్మ్ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఈ కథ పల్లెటూరి క్రికెట్ నేపథ్యంతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. 'చికిరి చికిరి' పూర్తి లిరికల్ వీడియో నవంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 27, 2026న థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks