Peddi Trailer: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్.. రికార్డుల వేటకు సై.. 13 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయంటే?

Peddi Trailer: యూట్యూబ్ షేక్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఊగిపోతున్నాయి. ఎక్కడ చూసినా పెద్ది ట్రైలర్ మేనియానే కనిపిస్తోంది. రామ్ చరణ్ క్రేజ్ ను మరోసారి చాటుతూ ఈ ట్రైలర్ రికార్డుల వేటకు సై అంటోంది. 

Published on: May 19, 2026, 05:55:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi Trailer: బాక్సాఫీస్ ను షేక్ చేసే ముందు.. వసూళ్ల రికార్డులు తిరగరాయడానికి ముందు.. పెద్ది మూవీ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. చరణ్ విశ్వరూపాన్ని కళ్లకు కట్టిన ఈ పెద్ది ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పెద్ది పోస్టర్ లో రామ్ చరణ్ (x/PEDDI)
పెద్ది పోస్టర్ లో రామ్ చరణ్ (x/PEDDI)

పెద్ది ట్రైలర్

ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో పెద్ది ఒకటి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కోసం సినీ లవర్స్, మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అసలు ట్రీట్ కంటే ముందు స్టార్టర్స్ వడ్డించినట్లు పెద్ది ట్రైలర్ తో పండుగ షురూ మేశారు మేకర్స్.

అదిరే రెస్పాన్స్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ ట్రైలర్ ను సోమవారం (మే 18) మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి సాయంత్రం 4.05 గంటలకు ట్రైలర్ వదిలారు. వెంటనే ఇది తుపానులా సోషల్ మీడియాను చుట్టేసింది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. జనాలు ఎగబడి చూసేస్తున్నారు.

ఎన్ని వ్యూస్ అంటే?

సోమవారం సాయంత్రం రిలీజ్ చేసిన పెద్ది మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ వార్త రాసే సమయానికి పెద్ది తెలుగు ట్రైలర్ కు యూట్యూబ్ లో 1.67 కోట్ల వ్యూస్ వచ్చాయి. 13 గంటల్లోనే ఈ స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. అలాగే లైక్స్ ఏమో 4 లక్షలు దాటాయి.

హిందీలో ఇలా

పెద్ది మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. హిందీలోనూ ఈ చిత్రం ట్రైలర్ కు అదిరిపోయే క్రేజ్ కనిపిస్తోంది. 12 గంటల్లో ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 1.51 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ పెద్ది ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక వివిధ ఛానెల్స్ లో పెద్ది ట్రైలర్లను రిలీజ్ చేశారు కాబట్టి రియల్ టైమ్, మొత్తం వ్యూస్ ఇంకా ఎక్కువే ఉండే అవకాశముంది.

రిలీజ్ డేట్

పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ గ్రామీణ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్ గా మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రలు పోషించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More