...
...
Next Story

Peddi: పెద్ది ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే రిలీజ్.. గ్రాండ్ గా ఈవెంట్.. చరణ్, జాన్వీ స్టెప్పులు!

Peddi: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన పెద్ది ట్రైలర్ రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు చేసింది. ఇందుకోసం గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించబోతున్నారని సమాచారం.

Published on: May 10, 2026, 11:30:24 IST
Advertisement

Peddi: పెద్ది మేనియాతో బాక్సాఫీస్ షేక్ కావడానికి.. రామ్ చరణ్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ఎంటర్ టైన్ కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. మోస్ట్ అవైటెడ్ పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పెద్ది ట్రైలర్

జాన్వీ కపూర్, రామ్ చరణ్, ఏఆర్ రెహ్మాన్ (x/peddi)
జాన్వీ కపూర్, రామ్ చరణ్, ఏఆర్ రెహ్మాన్ (x/peddi)

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ మూవీపై హైప్ ను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఆ అంచనాలను ట్రైలర్ తో మరింత పెంచాలని మూవీ టీమ్ చూస్తోంది. అందుకే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఆ రోజే

పెద్ది మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అదిరిపోయే ట్రీట్ అందించేందుకు మే 16ను ముహూర్తంగా ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆ రోజే పెద్ది ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఈ ట్రైలర్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారని తెలిసింది.

పాన్ ఇండియా లెవల్లో

పెద్ది మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పెద్దిని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇండియా వైడ్ సినీ లవర్స్ ను అట్రాక్ట్ చేయడానికి పెద్ది ఈవెంట్స్ ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. భోపాల్ లో ఫస్ట్ ట్రైలర్ ఈవెంట్ జరుగుతుందని టాక్.

స్పెషల్ పర్ఫార్మెన్స్

రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్న పెద్దిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ద్వారా ఈ సినిమాలో క్రికెటర్ గా, కుస్తీ యోధుడిగా చరణ్ కనిపించడం ఖాయమైంది. ఇవి రెండే కాకుండా చరణ్ మరో ఆట కూడా ఆడతాడని అంటున్నారు. మరి ట్రైలర్ తో దీనిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks