...
...
Next Story

Peddi: ముంబ‌యిలో ట్రైల‌ర్‌.. భోపాల్‌లో స్పెష‌ల్ సాంగ్.. పెద్ది వైబ్‌కు భారీ ప్లాన్‌

Peddi: పెద్ది వైబ్ ను దేశవ్యాప్తంగా హైలైట్ చేసేందుకు మేకర్స్ భారీ ప్లానే వేశారు. మూవీ ఈవెంట్స్ ను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ దేశం మొత్తం పెద్ది గురించి మాట్లాడుకునేలా చేయబోతున్నారు.

Published on: May 13, 2026, 13:45:15 IST
Advertisement

Peddi: పెద్ది మేనియాకు రంగం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా పెద్ది వైబ్ క్రియేట్ కావడానికి అంతా రెడీ అవుతోంది. పాన్ ఇండియా రిలీజ్ పై ఫోకస్ చేస్తున్న పెద్ది మేకర్స్ సినిమా ప్రమోషన్లను మరో రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ ను ఒక రాష్ట్రంలో, స్పెషల్ సాంగ్ ను మరో రాష్ట్రంలో రిలీజ్ చేయనున్నారు.

పెద్ది ట్రైలర్

పెద్ది సినిమాలో రామ్ చరణ్ (x/peddi)
పెద్ది సినిమాలో రామ్ చరణ్ (x/peddi)

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ ట్రైలర్ కు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 18న ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబయిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. హిందీ జనాలను అట్రాక్ట్ చేసేందుకు ముంబయిలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

స్పెషల్ సాంగ్

పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ లో రామ్ చరణ్ తో శ్రుతి హాసన్ స్టెప్పులేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ స్పెషల్ సాంగ్ ను పెద్ది టీమ్ లాంఛ్ చేయబోతుంది. అందుకు మధ్యప్రదేశ్ లోని భోపాల్ ను ఎంచుకుంది. ఈ స్పెషల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను భోపాల్ లో మే 23న నిర్వహించనున్నారు.

రెహమాన్ లైవ్

భోపాల్ లో జరగబోయే స్పెషల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్, జాన్వీ కపూర్ కూడా అటెండ్ అవుతారని సమాచారం. స్టేజీపై వీళ్లు కూడా డ్యాన్స్ చేసే అవకాశముంది. ఈ ఈవెంట్ తో దేశమంతా పెద్ది వైబ్ ఏర్పడుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

రిలీజ్ డేట్

పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ బాగా కష్టపడ్డాడు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో అతను గ్రామీణ క్రికెటర్ గానే కాకుండా కుస్తీ వీరుడిగానూ కనిపించనున్నాడు. ఇందు కోసం తన బాడీని రామ్ చరణ్ మార్చుకున్న తీరు నిజంగా స్ఫూర్తి కలిగించేదే. సినిమాలో ఈ రెండు స్పోర్ట్స్ కాకుండా రామ్ చరణ్ మరో క్రీడ కూడా ఆడతాడని టాక్. ట్రైలర్ తో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks