...
...
Next Story

Horror Thriller OTT: గుండె ధైర్యం ఉన్న‌వాళ్ల‌కే.. ఇవాళ ఓటీటీలోకి తెలుగులో హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. ప్రాణాలు తీసే చెక్క బొమ్మ

Horror Thriller OTT: ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇందులో హారర్ థ్రిల్లర్స్ సంఖ్య కూడా ఎక్కువే. ఓటీటీలో ఎక్కువ క్రేజ్ ఉండే హారర్ థ్రిల్లర్ జోనర్లో మరో అదిరిపోయే మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా గుండె ధైర్యం ఉన్నవాళ్లు చూస్తేనే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది.

Published on: Oct 20, 2026, 13:46:43 IST
Advertisement

Horror Thriller OTT: అమాయకపు బొమ్మే ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్‌గా మారితే ఎలా ఉంటుంది? అదే కాన్సెప్ట్‌తో 'ది ట్విస్టెడ్ చైల్డ్‌హుడ్ యూనివర్స్' (TCU) నుంచి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్ సినిమానే పినోచియో అన్‌స్ట్రంగ్ (Pinocchio Unstrung). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ రోజు (అక్టోబర్ 20) నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

అసలు కథేంటంటే?

గుండె ధైర్యం ఉన్న‌వాళ్ల‌కే.. ఇవాళ ఓటీటీలోకి తెలుగులో హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. ప్రాణాలు తీసే చెక్క బొమ్మ
గుండె ధైర్యం ఉన్న‌వాళ్ల‌కే.. ఇవాళ ఓటీటీలోకి తెలుగులో హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. ప్రాణాలు తీసే చెక్క బొమ్మ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పినోచియో అన్‌స్ట్రంగ్ సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉంది. ఒక ఘోరమైన కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన జేమ్స్ (కామెరాన్ బెల్) అనే పిల్లాడు, లండన్‌లోని తన తాతయ్య గెప్పెట్టో (రిచర్డ్ బ్రేక్) వద్దకు వస్తాడు. గెప్పెట్టో ఒక వింత సైంటిస్ట్, ఇన్వెంటర్.

ఒంటరితనంతో బాధపడుతున్న తన మనవడికి తోడుగా ఉండటానికి గెప్పెట్టో ఒక అద్భుతమైన, ప్రాణం ఉన్న చెక్క బొమ్మ 'పినోచియో'ను తయారు చేసి బహుమతిగా ఇస్తాడు. మొదట్లో జేమ్స్, పినోచియో మంచి స్నేహితులుగా మారతారు. కానీ, ఆ బొమ్మకు ఉండే ఒక ప్రమాదకరమైన కోరిక వల్ల కథ దారుణమైన మలుపు తిరుగుతుంది.

మనుషుల రక్తంతో

పినోచియోకు ఎలాగైనా ఒక నిజమైన మనిషిలా మారాలనే బలమైన కోరిక ఉంటుంది. అయితే ఒక వింతైన చెడు మిడత రూపంలో ఉన్న దెయ్యం పినోచియోను తప్పుదోవ పట్టిస్తుంది. లోకంలో ఉన్న 'చెడు' మొత్తాన్ని అంతం చేస్తేనే నువ్వు నిజమైన మనిషివి అవుతావని నమ్మిస్తుంది.

జేమ్స్‌ను స్కూల్లో తోటి పిల్లలు వేధించడం చూసిన పినోచియో తట్టుకోలేకపోతాడు. జేమ్స్‌ను రక్షించే నెపంతో మనుషుల చర్మాన్ని, రక్తాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తన చెక్క శరీరానికి అమర్చుకుంటూ ఒక క్రూరమైన నరమేధానికి తెరలేపుతాడు.

ఊహించని ట్విస్ట్‌లు

అలాగే పినోచియో తనను నియంత్రిస్తున్న శక్తులనే ఎదురించి, తన ఉనికి కోసం చేసే వినాశనం ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఒక పెద్ద వింతైన చెక్క రాక్షసి ఫైట్ ఊహించని విధంగా ఉంటుంది.

వెన్నులో వణుకు పుట్టించే హారర్ ఎలిమెంట్స్

దర్శకుడు రైస్ ఫ్రాక్-వాటర్‌ఫీల్డ్ ఈ సినిమాను గ్రాఫిక్స్ (CGI)తో కాకుండా, ఓల్డ్-స్కూల్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, చేత్తో తయారు చేసిన పప్పెట్రీ (బొమ్మలాట), యానిమేట్రానిక్స్ ఉపయోగించి తెరకెక్కించారు. అందువల్ల ఆ చెక్క బొమ్మ కదలికలు, దాని వింతైన చూపులు చూస్తుంటేనే చాలా సహజంగా, భయంకరంగా అనిపిస్తాయి.

పినోచియో అబద్ధం చెప్పినప్పుడు లేదా ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు వాడి ముక్కు పొడవుగా పెరిగి అవతలి వాళ్లని పొడిచి చంపే సీన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. బరువైన డంబెల్స్ తలపై పడేయడం, రక్తం ఏరులై పారడం వంటి భీభత్సమైన గోర్ సీన్లు హారర్ ప్రియులకు పండగే!

క్యాంపీ హారర్, డార్క్ కామెడీ, బ్లడీ థ్రిల్లర్స్ ఇష్టపడే గుండె ధైర్యం ఉన్న వారికి ఈ వీకెండ్ లో 'పినోచియో అన్‌స్ట్రంగ్' ప్రైమ్ వీడియోలో ఒక బెస్ట్ వాచ్ అని చెప్పవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks