Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గాయత్రి ఇంటికి వచ్చి శుభవార్త తీసుకొచ్చానని చెబుతుంది. ఫుల్ బాటిల్ తీసుకొచ్చావా. అదే నాకు శుభవార్త అని తాగుబోతు నారాయణ అంటాడు. కాదు నీకు మా అమ్మ తాయారు రాఖీ కట్టేందుకు వస్తుందని గాయత్రి చెబుతుంది.
అమ్మ రాఖీ కట్టేందుకు వస్తుంది

దాంతో అంతా షాక్ అవుతారు. మావయ్య గురించి చెబితే మా అమ్మ ఫీల్ అయింది. ఇవాళ రాఖీ కట్టేందుకు వస్తోందని గాయత్రి అంటుంది. అంతా సంతోషిస్తారు. గిఫ్ట్ ఏమిద్దామని చక్రి అంటే.. నా దగ్గర చీర ఉంది. అది పెడదామని మహాలక్ష్మి అంటుంది. నారాయణ బాగా రెడీ అయి వస్తాడు. మొహం బాగా వెలిగిపోతుందని మహాలక్ష్మి అంటుంది.
అది నా బతుకు కోరదే. నా చావే కోరుకుంటుంది అని నారాయణ అంటాడు. రాదని చక్రి, వస్తుందని కేశవ పందెం వేసుకుంటారు. చక్రిపై కేశవ సెటైర్లు వేస్తాడు. తాయారు రాఖీలతో పాతికేళ్ల తర్వాత నారాయణ ఇంటికి వస్తుంది. గుమ్మం దగ్గర నిల్చుండి చూస్తుంది. ఇంటి ఆడపడుచుని వచ్చాను. కాళ్లకు నీళ్లు ఎవరు ఇస్తారంటా అని తాయారు అంటే మాధవ వెళ్తాడు.
మీ నాన్నకు ఇష్టం లేదా అని తాయారు అంటే నారాయణ వెళ్లి నీళ్లు ఇస్తాడు. తాయారు కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్తుంది తాయారు. మర్యాదలు అడిగి మరి చేయించుకుంటుంది తాయారు. నారాయణకు తాయారు బొట్టుపెట్టి రాఖీ కడుతుంది. కన్నాను మహా ఫొటోలు తీయమంటుంది. స్వీట్స్ తినిపించుకుంటారు. కట్నం ఇవ్వడానికని అంతా డబ్బులు తీసి నారాయణకు ఇస్తారు.
ఇంటి స్థలంలో వాటా ఇవ్వు
నేను డబ్బుకోసం రాలేదురా అని తాయారు అంటుంది. తీసుకో అత్త. మంచి చీర కొనుక్కో అని మాధవ అంటాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంటికి కళ వచ్చింది. ఇది మా సంతోషం కోసం ఇస్తున్నామని చీర పెడుతుంది మహాలక్ష్మి. అందరిని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది తాయారు. ఏరా.. నీ కొడుకులు డబ్బులిచ్చారు. నీ కోడలు చీర పెట్టింది. నీకు రాఖీ కట్టినందుకు నాకేం ఇస్తావురా అని తాయారు అడుగుతుంది.
{{/usCountry}}నేను డబ్బుకోసం రాలేదురా అని తాయారు అంటుంది. తీసుకో అత్త. మంచి చీర కొనుక్కో అని మాధవ అంటాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంటికి కళ వచ్చింది. ఇది మా సంతోషం కోసం ఇస్తున్నామని చీర పెడుతుంది మహాలక్ష్మి. అందరిని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది తాయారు. ఏరా.. నీ కొడుకులు డబ్బులిచ్చారు. నీ కోడలు చీర పెట్టింది. నీకు రాఖీ కట్టినందుకు నాకేం ఇస్తావురా అని తాయారు అడుగుతుంది.
{{/usCountry}}ఏం కావాలో అడగమని మాధవ అంటే.. బాండ్ పేపర్స్ తీసి ఈ స్థలంలో నా వాటా రాసిస్తే చాలు అని తాయారు పెద్ద బాంబ్ పేలుస్తుంది. నా వాటా కింద రేపే ఆ స్థలం రాసిస్తే రేపే కిరాణ కొట్టు పెట్టుకుంటాను అని తాయారు అంటుంది. అంతా షాక్ అవుతారు. ఆడపడుచు కోసం ఆమాత్రం రాసివ్వరా. నేను పెట్టిన శాపం వెనక్కి తీసుకుంటాను. నీ కొడుకుల పెళ్లిళ్లు మీదేసుకుని చేస్తానని తాయారు అంటుంది.
ఆఖరికి అన్నాచెల్లెళ్ల బంధాన్ని ఎంతకు దిగజార్చావే బుజ్జమ్మా.. నీ భర్త అసమర్థుడు అయితే నీకు నీ బిడ్డకు గూడు లేకుంటే.. నువ్వు రాఖీ కట్టేందుకు వచ్చి వాటా కావాలని అంటే ఎంత బండరాయిలాంటి అన్నయిన కరిగిపోడా. అలాంటిది అన్ని ఉండి, అన్నతో చేరి నా చావు కోరుకునే నువ్వు రాఖీ కట్టి నా ఆస్తి కావాలని వచ్చావ్. అలాంటి నువ్వు నా దృష్టిలో మరోసారి నువ్వు చచ్చిపోడానికి వచ్చావని అర్థమైందే అని నారాయణ ఎమోషనల్‌గా అంటాడు.
నీ బొందమీద వేసుకుని కొట్టుకుంటావా
గాయత్రి నువ్వు వస్తున్నావని చెబితే ఎందుకు వస్తున్నావో నాకు అర్థమైన చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకు వచ్చాయే అని చిన్నప్పటి ప్రతి ఒక్క విషయం చెబుతూ ఏడుస్తాడు నారాయణ. ఇవన్నీఎలా మర్చిపోయావే. ఎంత స్వార్థమే నీది. తోడబుట్టిన రుణం కోసం ఏమైనా చేసేవాన్ని కానీ నా కొడుకులకు అన్యాయం చేసి నీలాంటిదానికోసం నా ఇంటిని ఎప్పటికీ ముక్కలు చేయలేను అని నారాయణ అంటాడు.
నీ కన్నుకూడా నా ఇంటి మీద పడనివ్వను. నేను కాటికి వెళ్లిన నా ఆత్మ ఈ బృందావనం చుట్టూ తిరుగుతుంది. రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లిని మెడపట్టి గెంటేస్తారని ఊర్లో వాళ్లు కథలుగా చెప్పుకుంటారని నిన్ను క్షమిస్తున్నాను. వెళ్లిపో అని నారాయణ అంటాడు. ఒక్క మాట మావయ్యను అన్నా ఊరుకోను అని గాయత్రి అంటుంది.
ఈ స్థలం నీ బొందమీద వేసి కొట్టుకుంటావా అని తాయారు అంటుంది. పళ్లు రాలతాయ్ అని తల్లిని అంటుంది గాయత్రి. తాయారు కట్టిన రాఖీని నారాయణ విసిరేస్తాడు. రాఖీ అనేది రంగులు, పూసలతో కలిసింది కాదు అన్నయ్య క్షేమం కోరుకునే రక్షాబంధన్ ఇది. ఇలా కడుపులో విషం నింపుకుని వస్తే రక్షాబంధన్ అనరు. ఆ వట్టి తాడు చేతికి ఎందుకు అని నారాయణ అంటాడు.
విక్కీకి మహాను రాఖీ కట్టమన్న చక్రి
తాయారు వెళ్లిపోతుంది. పడేసిన రాఖీ తీసుకున్న గాయత్రి తల్లి చేసిన మోసం గురించి కన్నీళ్లుపెట్టుకుంటుంది. మా అమ్మ ఎప్పటికీ నీ సంతోషం కోరుకోదు. కానీ నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ఇది నా పుట్టిల్లు అనుకుని నేను నీకు రాఖీ కడతాను మావయ్య అని గాయత్రి అంటుంది. అంతా ఎమోషనల్ అవుతారు.
నారాయణకు మేనకోడలు గాయత్రి రాఖీ కడుతుంది. తర్వాత మహాను తీసుకుని మీ అన్నయ్యకు రాఖీ కట్టమని విక్కీని చూపిస్తాడు చక్రి. కట్టను అని మహా, కట్టించుకోనని విక్కీ అంటారు. ఈ రాఖీ మీరు కట్టించుకోండని చక్రికే ఝలక్ ఇస్తాడు విక్కీ. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.