Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో బృందావనం నిజంగా బృందావనంలా ఓ ఇల్లులా మారడం చూసి మాధవ ఎమోషనల్ కావడం, చివరికి అందరూ కలిసి ఉత్సాహంగా దీపావళి జరుపుకోవడం చూడొచ్చు. అయితే అప్పుడే అనుకోకుండా కన్నా ప్రమాదంలో పడటం, నారాయణ అతన్ని కాపాడటం చూడొచ్చు.
నారాయణ అండ్ సన్స్ మెకానిక్ షాప్.. శైలు షాక్.. వెళ్లిపోయిన కన్నా

కేశవ షాపు పేరు రివీల్ చేసే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 13) ఎపిసోడ్ మొదలైంది. ఆ పని శైలుకి అప్పగిస్తారు. ఆమె పేరు బోర్డుపై ఉన్న ముసుగు తొలగిస్తుంది. నారాయణ అండ్ సన్స్ మెకానిక్ షాప్ అనే పేరు చూసి శైలు షాక్ తింటుంది. తన పేరు పెట్టకపోయినా సరే.. మహాలక్ష్మి పేరు కాదు కదా అది చాలు అనుకుంటుంది. పేరు చూసి అందరూ చాలా సంతోసిస్తారు. కానీ కన్నా మాత్రం నారాయణ పేరు చూడగానే అప్‌సెట్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఈ క్రెడిట్ అంతా మహాకే దక్కుతుందని కేశవ అంటాడు. అందరూ ఆమెను మెచ్చుకుంటారు. తన పేరు ఎందుకు పెట్టారని నారాయణ అంటాడు. కన్నా కనిపించకపోవడంతో తన పేరు చూసి వెళ్లిపోయి ఉంటాడని నారాయణ అనడంతో తాను చూసుకుంటానని మహా హామీ ఇస్తుంది.
పేరుపై ముంగిసతో బుస్సు ఫైట్
అందరూ వెళ్లిపోయిన తర్వాత ముంగిసతో బుస్సు గొడవకు దిగుతుంది. ఆ పేరు పెట్టినట్లు తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. ఇది మహాలక్ష్మి ఐడియా అని, ఆమె ఆ పేరు పెట్టినట్లు తనకు కూడా తెలియదని అంటాడు. దీంతో శైలు శాంతిస్తుంది. సరేలే అని చెప్పి కేశవకు ముద్దు పెట్టి స్వీటు తీసుకొని వెళ్లిపోతుంది.
తమ్ముళ్లను చూసి మాధవ ఎమోషనల్.. చిన్నతనం గురించి తలచుకుంటూ..
ఆ తర్వాత అందరూ ఇంట్లో రకరకాల పిండి వంటలతో భోజనానికి కూర్చొంటారు. తమ్ముళ్లు, మహా, మనీషా ఎంతో ఆనందంగా ఉండటం చూసి మాధవ ఎమోషనల్ అవుతాడు. ఈ ఇంట్లో ఆడది ఎవరూ అడుగుపెట్టరు అన్న తన అత్త తాయారు మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. తమ్ముళ్లు, తండ్రి జైలుకి వెళ్లిన సీన్ గుర్తుకొస్తుంది. అదంతా తలచుకొని మాధవ కంటతడి పెట్టడం చూసి ఏమైందని అందరూ అడుగుతారు.
{{/usCountry}}ఆ తర్వాత అందరూ ఇంట్లో రకరకాల పిండి వంటలతో భోజనానికి కూర్చొంటారు. తమ్ముళ్లు, మహా, మనీషా ఎంతో ఆనందంగా ఉండటం చూసి మాధవ ఎమోషనల్ అవుతాడు. ఈ ఇంట్లో ఆడది ఎవరూ అడుగుపెట్టరు అన్న తన అత్త తాయారు మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. తమ్ముళ్లు, తండ్రి జైలుకి వెళ్లిన సీన్ గుర్తుకొస్తుంది. అదంతా తలచుకొని మాధవ కంటతడి పెట్టడం చూసి ఏమైందని అందరూ అడుగుతారు.
{{/usCountry}}ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉంది.. బృందావనంలో ఇదే తొలి పండగ.. చిన్నతనంలో అసలు పండగ అంటే తెలియదు.. ఒక్కపూట తినడానికి కూడా తిండి దొరికేది కాదు.. నాన్న జైలుకి వెళ్లాడు.. తమ్ముళ్లను చూసుకోవాలి.. ఎంత కష్టం చేసినా తమ్ముళ్లకు పండగకు కొత్త బట్టలు కొనివ్వలేకపోయాను.. పొరుగువాళ్లు అందరూ పిండి వంటలు చేసుకుంటే నేనేమీ చేయలేకపోయేవాడిని.. అసలు ఈ ఇల్లు ఇల్లులా ఎవరూ చూసేవాళ్లు కాదు.. తమ్ముళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పస్తులు ఉంచకూడదు అనుకొని ఇంకా కష్టపడటం మొదలు పెట్టాను.. తమ్ముళ్లు కూడా పనులు నేర్చుకునే పనిలో పడి ఎప్పుడో వచ్చి తిని వెళ్లే వాళ్లు.. అసలు పండగలంటేనే తెలియదు.. కానీ ఇప్పుడు అసలైన పండగ వచ్చింది.. ఇలా అందరూ సంతోషంగా ఉండటం చూసి చాలా ఆనందంగా ఉంది.. కన్నా వెళ్లిపోతే వెతికి తీసుకొచ్చాం.. నేను వెళ్తానంటే అందరూ వారించారు.. కేశవ షాపు కోసం అందరం సాయం చేశాం.. ఇది కదా కుటుంబం అంటే.. ఇది కదా పండగ అంటే అని మాధవ అంటాడు. మాధవ కంటతడి పెట్టడం చూసి మహా కూడా ఎమోషనల్ అవుతుంది. అతన్ని ఓదారుస్తుంది.
వదినతో బూరెలు వేయించిన కన్నా
ఆ తర్వాత అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తారు. ఈ సందర్భంగా బూరెలు చూసిన మనీషా ఆలోచనలో పడుతుంది. అసలు ఇందులోకి పూర్ణం ఎలా వెళ్లిందని అమాయకంగా అడుగుతుంది. మాధవ హిందీలో చెప్పడానికి ప్రయత్నించి తన వల్ల కాదని అంటాడు. దీంతో కన్నా కూడా చెప్పడానికి ట్రై చేసి.. చెప్పడం కాదు చేసి చూపిస్తానని వదనను తీసుకెళ్తాడు. బూరెలు ఎలా వేస్తారో చేసి చూపిస్తాడు. మనీషా కూడా నేర్చుకుంటుంది.
మహాతో తన ఫొటో చూసి మురిసిపోయిన చక్రి
ఇక భోజనాలు అయిపోయిన తర్వాత ఫోనులో మహా పక్కనే తాను నిలబడిన ఫొటో చూసి చక్రి తెగ మురిసిపోతుంటాడు. అతన్ని చూసి కేశవ, కన్నా ఆశ్చర్యపోతారు. చక్రి వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఆ ఫొటోను తన స్టేటస్ లో పెట్టాలనుకుంటాడు. ఫస్ట్ దీపావళి విత్ మై వైఫ్ అనే క్యాప్షన్ పెట్టి స్టేటస్ లో పెడతాడు. ఇది చూస్తే మహా రియాక్షన్ ఎలా ఉంటుందో అని అనుకుంటాడు. చక్రి పిచ్చోడిలా ప్రవర్తించడం చూసి కేశవ, కన్నా, నారాయణ ఆశ్చర్యపోతారు.
కన్నాను కాపాడిన నారాయణ
చివర్లో బృందావనంలో అందరూ కొత్త బట్టలు వేసుకొని దీపావళి జరుపుకోడానికి సిద్ధమవుతారు. కొడుకులు, కోడళ్లను చూసి నారాయణ మురిసిపోతాడు. ఇప్పుడు అసలైన బృందావనంలా ఉందని మాధవతో అంటాడు. మహా వచ్చిన తర్వాతే ఇది ఇల్లులా మారిందని మాధవ చెబుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆనందంగా టపాసులు పేలుస్తారు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా కన్నా ప్రమాదంలో పడతాడు. అక్కడే ఉన్న నారాయణ కన్నాను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం పణంగా పెడతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.