Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో ఇటు మహా, అటు చక్రిని విడాకులు విషయంలో మరోసారి ఆలోచించేలా చేయడానికి మాధవ ప్రయత్నిస్తాడు. ఇద్దరూ అందుకు అంగీకరించరు. కానీ చక్రి మాత్రం తాను అనుకున్న మరో ఊహకందని ప్లాన్ గురించి చెబుతాడు. అయితే చివర్లో మహాకు యాక్సిడెంట్ కావడం మరో ట్విస్ట్ ఇచ్చింది.
మహాకు పెద్ది రిక్వెస్ట్.. విడిపోవడమే మార్గమా అంటూ..

చక్రి, మహా విడాకుల గురించి ఆలోచిస్తూ మాధవ బాధపడే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 20) ఎపిసోడ్ మొదలైంది. తినకుండా వెళ్లిపోతున్న మహాను ఆపి టిఫిన్ పెడతాడు. తర్వాత ఆమెను విడాకుల గురించి నిలదీస్తాడు.
విడిపోవడమే మార్గమా.. విడాకులే పరిష్కారమా.. నువ్వు వచ్చిన తర్వాతే ఈ ఇల్లు ఇల్లులా ఉంది.. నారాయణ నాన్నయ్యాడు.. కన్నా పసివాడయ్యాడు.. చక్రి, కేశవ పోట్లాడుకోవడం ఆపేశారు.. నువ్వుంటేనే ఈ ఇంటికి వెలుగు.. నువ్వుంటేనే ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు.. ఈ ఇంటికి మా అత్త పెట్టిన శాపం నిజమవుతుందన్న భయంతో నిన్ను ఉండమనడం లేదు.. కానీ నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి.. అయినా మీ పెళ్లి పరిస్థితుల్లో జరిగినా అది పెళ్లే.. ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి ఈ పెళ్లి చేసుకొని ఇప్పుడు విడాకులతో విడిపోయినా ఈ సమాజం నిన్ను అలాగే చూస్తుంది.. నా సొంత కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తే చూడలేను.. నీ విషయంలోనూ అంతే.. దయచేసి విడాకుల గురించి మరోసారి ఆలోచించు అని రిక్వెస్ట్ చేస్తాడు.
ఒప్పుకోని మహా.. మీ తమ్ముడితో కలిసి ఉండలేనంటూ..
పెద్ది ఎన్ని చెప్పినా మహా మనసు మాత్రం కరగదు. అలాంటి పెళ్లికి ఇలా విడాకులే కరెక్ట్ అని చెబుతుంది. అయినా మీ తమ్ముడితో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పి వెళ్లిపోవడంతో పెద్ది మనసు ముక్కలవుతుంది. బయట అప్పటికే చక్రి బాధగా కనిపిస్తాడు. అతన్ని చూసి మహా కూడా బాధపడుతుంది. కానీ అతనితో ఏమీ మాట్లాడకుండానే మహా వెళ్లిపోతుంది. అయితే బండిపై వెళ్తూ కూడా పెద్ది మాటల గురించి మహా ఆలోచిస్తూ ఉంటుంది.
విక్కీ రిక్వెస్ట్‌కు లక్కీ నో
{{/usCountry}}పెద్ది ఎన్ని చెప్పినా మహా మనసు మాత్రం కరగదు. అలాంటి పెళ్లికి ఇలా విడాకులే కరెక్ట్ అని చెబుతుంది. అయినా మీ తమ్ముడితో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పి వెళ్లిపోవడంతో పెద్ది మనసు ముక్కలవుతుంది. బయట అప్పటికే చక్రి బాధగా కనిపిస్తాడు. అతన్ని చూసి మహా కూడా బాధపడుతుంది. కానీ అతనితో ఏమీ మాట్లాడకుండానే మహా వెళ్లిపోతుంది. అయితే బండిపై వెళ్తూ కూడా పెద్ది మాటల గురించి మహా ఆలోచిస్తూ ఉంటుంది.
విక్కీ రిక్వెస్ట్‌కు లక్కీ నో
{{/usCountry}}అటు ఆఫీసుకు వెళ్లిన తర్వాత తన ప్రాజెక్టు పనుల్లో బిజీ అవుతుంది. అప్పుడే ఆమె బాస్ విక్కీ వస్తాడు. కాఫీకి వెళ్దామా అని అడుగుతాడు. కానీ మహా నో చెబుతుంది. ఎలాగూ ప్రాజెక్టు గురించి చెబుతానని అన్నావు కదా.. అదేదో కాఫీ తాగుతూ చెప్పొచ్చు కదా అని విక్కీ మరోసారి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ తనకు ఇష్టం లేదని మహా తేల్చి చెబుతుంది. దీంతో సరే అని చెప్పి విక్కీ వెళ్లిపోతాడు. ఆమె కొలీగ్ దివ్య మరోసారి విక్కీ పేరు చెప్పి లక్కీని ఆట పట్టించడానికి ట్రై చేస్తుంటే ఆమె సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది.
చక్రికి మాధవ ఫోన్.. విడాకులపై మాట్లాడుతూ గాయత్రి గురించి చెప్పి..
ఆ తర్వాత చక్రికి కూడా మాధవ ఫోన్ చేస్తాడు. విడాకులు గురించి అడుగుతాడు. అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావని నిలదీస్తాడు. తనకు ఇష్టం లేనిది బలవంతంగా ఎలా కలిసి ఉంటాం.. అందుకే ఇస్తానని చెప్పినట్లు చక్రి అంటాడు. దీంతో మాధవ తన ప్రేమ గురించి చెబుతాడు. గాయత్రి దూరమైనప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తాడు. మహా దూరమైతే నువ్వు ఉండగలవా.. ఆమె అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు.. ఈ విడాకులు నీకు ఇష్టం ఉండి ఇవ్వడం లేదని కూడా తెలుసు.. మహా వచ్చిన తర్వాతే మన ఇంటికి వెలుగొచ్చింది.. మీ ఇద్దరూ కలిసి ఉంటేనే బాగుంటుంది.. దయచేసి ఈ విషయంపై మరోసారి ఆలోచించు అని మాధవ రిక్వెస్ట్ చేస్తాడు.
విడాకులు ఇచ్చి మళ్లీ ప్రేమ బంధంతో ఒక్కటవుతామన్న చక్రి
కానీ చక్రి మాత్రం వినడు. మహాను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో తెలుసు కదా.. అప్పుడు ఆమె పరిస్థితిని ఆసరగా చేసుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు విడాకులు ఇవ్వకపోతే ఆమె ఊరుకుంటుందా.. నన్ను అవకాశవాదినని తిడుతుంది.. ఇన్నాళ్లూ నీ ముఖం చూసైనా నన్ను తిట్టడానికి కాస్త ఆలోచించింది.. ఇప్పుడు అది కూడా చేయదు.. వీలైతే నాలుగు కొట్టి మరీ వెళ్తుంది.. అందుకే ఆమెకు విడాకులు ఇస్తాను.. కానీ ఆమెను మళ్లీ ప్రేమతో గెలుచుకుంటాను.. భర్తగా ఇష్టం లేని నన్ను మళ్లీ తనకు ఇష్టమైన ప్రేమికుడిగా మార్చుకునేలా చేస్తాను.. అప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటాను అని చక్రి చెబుతాడు. దీంతో చేసేది లేక మీకు ఆ దేవుడు అంతా మంచే చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి మాధవ ఫోన్ పెట్టేస్తాడు.
పెళ్లి గురించి మళ్లీ కేశవను నిలదీసిన శైలు
ఇటు మహా, చక్రి విడాకుల విషయం తెలియని కేశవ.. శైలుతో కలిసి షాపులో హాయిగా ముచ్చట్లు పెడతాడు. అప్పుడే మరోసారి పెళ్లి విషయం తీస్తుంది శైలు. మీ అన్నయ్య లవ్ స్టోరీ ఎంత వరకూ వచ్చిందని అడుగుతుంది. వాళ్ల పెళ్లి అయిపోతే అర్జెంటుగా నిన్ను పెళ్లి చేసుకొని.. ఓ పాతిక మంది పిల్లలను కని నీతో వాళ్లు ముడ్డి, ముక్కు కడిగించాలని ఉందని అంటుంది. దీంతో కేశవ ఆమెను తిడతాడు.
మహాకు యాక్సిడెంట్
ఆ తర్వాత స్టోరీ మాధవ, మనీషా వైపు వెళ్తుంది. మనీషా ఇంటికి మాధవ వెళ్తాడు. అతన్ని చక్రి, కన్నా ఫాలో అవుతారు. ఇద్దరూ లోనికి వెళ్లి డోరు వేసుకోవడంతో వీళ్లు షాకవుతారు. తర్వాత మాధవ స్టైల్ గా తయారై బయటకు వస్తాడు. తర్వాత మనీషాను సైకిల్ పై ఎక్కించుకొని వెళ్తాడు. వాళ్లను చక్రి, కన్నా కారులో ఫాలో అవుతుంటారు. మరోవైపు విడాకులు విషయం గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్న మహాను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో యాక్సిడెంట్ అవుతుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.