...
...
Next Story

Podarillu November 26 Episode: పొదరిల్లు.. మహాపై ఆవేశంతో రగిలిపోయిన చక్రి.. ఘోర అవమానంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి..

Podarillu Serial November 26th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్ లో మహాపై చక్రి ఆవేశంతో రగిలిపోతాడు. అందరి ముందూ మహా అన్న మాటలతో ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అటు లక్కీ కోసం కాస్ట్‌లీ వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు విక్కీ.

Published on: Nov 26, 2026, 08:23:44 IST
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో చక్రికి దగ్గరైనట్లే అయిన మహా మళ్లీ దూరమవుతుంది. చక్రి చెప్పిన ఒక్క అబద్ధం వాళ్ల మధ్య దూరాన్ని పెంచుతుంది. అటు చక్రి కూడా మహాపై ఆవేశంతో రగిలిపోతాడు. వాళ్ల మధ్య మరింత దూరాన్ని పెంచడానికన్నట్లు లక్కీకి విక్కీ ఓ కాస్ట్‌లీ వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు.

విక్కీని నిలదీసిన మహా.. సెలబ్రేషన్ పార్టీ ఇస్తానన్న విక్కీ

పొదరిల్లు సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్

ప్రెజెంటేషన్ సక్సెస్ కావడంతో మహాను విక్కీ మెచ్చుకునే సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 26) ఎపిసోడ్ మొదలైంది. అయితే తాను ల్యాప్‌టాప్ మరచిపోయానని చెప్పినప్పుడు విక్కీ అన్న మాటలను మహా గుర్తు చేసుకుంటుంది. ఆ సమయంలో బాస్ నుంచి సపోర్ట్ రావాల్సింది పోయి నానా మాటలు అన్నావు.. నేను ఈ ప్రాజెక్ట్ కే అర్హురాలిని కానన్నావు.. అదే నిజమైతే అంతకుముందు ప్రాజెక్టులు ఎలా చేశాను.. కోపం రావడం సహజం కానీ నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు.. నీ నుంచి ఇది ఊహించలేదు అని విక్కీని మహా నిలదీస్తుంది. దీంతో సారీ చెప్పిన విక్కీ.. సాయంత్రం సెలబ్రేషన్ పార్టీ ఇస్తానంటాడు. మొదట రానని చెప్పిన మహా.. తర్వాత ఓకే చెబుతుంది.

పార్టీలో ముభావంగా మహా.. చక్రికి మెసేజ్

అటు పార్టీలోనూ మహా ముభావంగా ఉంటుంది. విక్కీ మాత్రం ఆమెను మెచ్చుకుంటూ అందరి ముందూ ఓ స్పీచ్ ఇస్తాడు. ఆమెను లక్కీ అని నేను పిలిచినప్పటి నుంచీ మనకు లక్ కలిసి వస్తూనే ఉంది.. ఇప్పుడీ ప్రాజెక్ట్ దక్కించుకున్న ఆనందంలో పార్టీ చేసుకుందాం అని అంటాడు.

ఆ తర్వాత విక్కీ తనకు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోకుండా లక్కీ ప్లేట్ లో నుంచే తీసుకొని తినడానికి వెళ్తాడు. కానీ ఆమె వద్దంటుంది. తనకు అలా ఫుడ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదని స్పష్టం చేస్తుంది. విక్కీ సరే అంటాడు. అప్పుడే చక్రి వచ్చి మెసేజ్ పెడతాడు. పార్టీ మధ్యలోనే ఇక తాను వెళ్తానని మహా అంటుంది.

తాను డ్రాప్ చేస్తానని విక్కీ అంటే.. వద్దు చక్రి బయటు వెయిట్ చేస్తున్నాడని అంటుంది. అతనికి వేరే పనేమీ ఉండదా.. ఎప్పుడూ ఇంత ఈజీగా అందుబాటులో ఉంటాడేంటి అని చక్రిని అవమానించేలా విక్కీ మాట్లాడతాడు. తర్వాత కారు వరకు డ్రాప్ చేసి వస్తానని వెంట వెళ్తాడు.

విక్కీ మాటలకు చక్రికి ఆవేశం

మహా వెంటే విక్కీ రావడం చూసి చక్రి అసహనం వ్యక్తం చేస్తాడు. తర్వాత కారు ముందు డోరు తెరిచి మహాను రమ్మంటాడు. అటు విక్కీ మాత్రం వెనుక డోరు తెరుస్తాడు. కానీ మహా మాత్రం ముందుకి వెళ్లి కూర్చోవడంతో విక్కీని చూసి చక్రి కాలర్ ఎగరేస్తాడు. నువ్వు మహాకు కజిన్ కదా.. ఆమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లు.. ఆమె నా పిల్ల అని అంటాడు. దీంతో చక్రికి ఆవేశం తన్నుకొస్తుంది. తను నా భార్యరా బద్మాష్ అని మనసులో అనుకుంటాడు. విక్కీని కోపంగా చూస్తూ వెళ్లిపోతాడు.

విక్కీకి సపోర్ట్‌గా మాట్లాడిన మహా.. చక్రి వాచ్ గిఫ్ట్

కారులో వెళ్తూ విక్కీ గురించి చక్రి మాట్లాడతాడు. కారు వరకు ఎందుకు మీ బాస్ రావడం అని అడిగితే.. మొదటి నుంచీ అలాగే చేస్తాడు కదా అని మహా అంటుంది. అలాంటప్పుడు ఉదయం ఎందుకంతలా అరిచాడు అని చక్రి అడుగుతాడు. అందులో అతని తప్పేమీ లేదని, ల్యాప్‌టాప్ మరచిపోవడం తన తప్పే అని, అయినా సమయానికి దానిని తీసుకొచ్చి అందరి ముందూ అవమానపడకుండా కాపాడారని చక్రితో మహా అంటుంది.

ఆ తర్వాత కారు డ్యాష్ బోర్డులో మహా కోసం చక్రి ఓ గిఫ్ట్ దాచి ఉంచుతాడు. దానిని తీసుకొని చూడండి అని చెబుతాడు. అందులో ఓ వాచ్ ఉంటుంది. తన స్థాయికి తగినట్లు ఏదో గిఫ్ట్ ఇచ్చానని చక్రి అంటే.. చాలా బాగుందని మహా అంటుంది.

ఇంట్లో మహాను నిష్టూరంగా మాట్లాడిన చక్రి

ఇంటికి వచ్చిన తర్వాత కూడా విక్కీ మాటలు చక్రికి గుర్తుకుస్తూనే ఉంటాయి. ఆ కోపంలో మహా గురించి నిష్టూరంగా మాట్లాడతాడు. ఏదైనా తినమని మహాను మాధవ అడిగితే.. మేడమ్ పార్టీకి వెళ్లి వచ్చింది.. అక్కడ బిర్యానీలు ఉంటాయి.. మన ఇంట్లో తెల్లన్నం కూర తప్ప ఏముంటాయి అని చక్రి అంటాడు. అక్కడ అవన్నీ ఉన్నాయని నీకెలా తెలుసు అని మాధవ అడిగితే.. ఆమెను క్యాబ్ డ్రైవర్ లాగా అక్కడికి వెళ్లి తీసుకొచ్చింది నేనే కదా అని చక్రి అంటాడు. అప్పుడే కన్నా వచ్చి చక్రిని ఆట పట్టిస్తాడు.

చక్రి అబద్దం చెప్పాడంటూ మహా ఆగ్రహం..

ఉదయం జరిగిన విషయం గురించి చెబుతూ ఇంకేంటి పార్టీ ఇవ్వవా అని అడుగుతాడు. ఏం జరిగింది అని మహా అడిగితే కన్నా చెప్పబోతాడు. చక్రి అడ్డుకుంటాడు. నేను ఆవేశంగా మాట్లాడే సమయంలో వీడు వచ్చి నాపై ఆమె కోప్పడే పరిస్థితి తీసుకొచ్చేలా ఉన్నాడని భయపడతాడు. మహా మరోసారి గట్టిగా అడగడంతో ఉదయం చక్రి చెప్పిన విషయం కన్నా చెబుతాడు. ఆఫీసులో మీకు సాయం చేసిన తర్వాత మీరు అన్నయ్య దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని, ఐలవ్యూ అని కూడా చెప్పారట కదా అని కన్నా అంటాడు.

దీంతో మహా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీ అన్నయ్యకు తనకు అలవాటైన అబద్ధమే మళ్లీ చెప్పాడు.. నా పరువు కాపాడినందుకు హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాను అంతే.. ఐలవ్యూ చెప్పలేదు.. ఇంత చీప్ గా మాట్లాడతాడని తెలిస్తే కనీసం టచ్ కూడా చేసేదానిని కాదు.. కృతజ్ఞత చూపించడాన్ని ఇలా మార్చి చెప్పాడు అని అంటుంది. దీంతో చక్రి అవమానంతో తల దించుకుంటాడు. కన్నా, కేశవ కూడా అబద్ధం చెప్పినందుకు చక్రిని తిడతారు. సిగ్గులేదా అని కేశవ అంటాడు.

చక్రికి ఆవేశం.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి..

దీంతో చక్రి ఆవేశంతో రగిలిపోతాడు. నేనేం తప్పు చేశాను.. అలా జరిగితే బాగుండేదని ఊహించుకున్నాను.. దానినే మీకు చెప్పాను.. కనీసం అలా కనే స్వేచ్ఛ కూడా నాకు లేదా.. నేను ఊహించుకుంటే తప్పేంటి.. నా బతుకే అంత.. నా తలరాతే అంట అంటూ టేబుల్ ను గట్టిగా తన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. బయట నారాయణ అతన్ని ఆపి ఏం జరిగిందని అడుగుతాడు.

నీ మాతనేమీ అనలేదులే అని చక్రి అంటే.. అంటే బతుకుతావా అని నారాయణ వార్నింగ్ ఇస్తాడు. నా కారుకు యాక్సిడెంట్ ఎందుకు కావడం లేదో.. నేనెందుకు పోవడం లేదో అని అంటాడు. అలా అంటావేంటని మాధవ నిలదీస్తాడు. కన్నా కూడా అడ్డు పడితే.. అంతా నీవల్లే.. నన్ను ఇరికించడం, అందులో ఆనందం వెతుక్కోవడం నీకు అలవాటేగా.. నా లైఫే అంత.. ఫుల్ లెంగ్త్ కామెడీ అయిపోయింది.. నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్లిపోతాడు.

ఫీలైన కన్నా.. ఓదార్చిన మహా

తన వల్లే ఇలా జరిగిందని కన్నా బాధ పడతాడు. దీంతో మహా అతన్ని ఓదారుస్తుంది. అబద్ధం చెప్పిన వ్యక్తి బాగానే ఉన్నాడు.. నువ్వెందుకు ఫీలవుతావ్ అని అడుగుతుంది. కేశవ కూడా కన్నాకు సర్ది చెబుతాడు. వాడి తప్పు కప్పి పుచ్చుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడు రాస్కెల్ అని చక్రిని తిడతాడు.

ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లే వెళ్లిపోయిన చక్రి ఇదంతా కిటికీ దగ్గర నుంచి విని మరింత బాధపడతాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఆఫీసులో లక్కీకి విక్కీ కూడా ఓ కాస్ట్‌లీ వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు. దానిని స్టేటస్ లో పెట్టుకుంటాడు. అది చూసి చక్రి మరింత ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks