Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఇంట్లో వాళ్లపై అలిగి బయటకు వెళ్లిపోయిన చక్రిని మహా తన అదిరిపోయే ప్లాన్ తో దారికి తీసుకొస్తుంది. అటు లక్కీని కూల్ చేయడానికి విక్కీ ప్లాన్ మీద ప్లాన్ వేస్తూనే ఉంటాడు. అది చూసి చక్రికి మరింత మండుతుంది. అదే విషయం నారాయణకు చెబితే.. అతడు కూడా ఆవేశంతో రగిలిపోతాడు.
ఇంట్లో వాళ్లపై అలిగిన చక్రి

చక్రి గురించి మాధవ బాధపడే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 27) ఎపిసోడ్ మొదలైంది. తినకుండా వెళ్లిపోయాడని మాధవ అంటే.. ఒక్కపూట తినకపోతే ఏమీ కాదని మహా.. వీధి చివరన పునుగులు తినే ఉంటాడని కేశవ అంటారు. అది విన్న చక్రి ఇంట్లోకి వచ్చి మరోసారి అందరినీ తిడతాడు. నా బతుకే అంత.. అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు అని బాధపడి, అలిగి పెరట్లోకి వెళ్లిపోతాడు. నిజమే ఎవరికి ఏం జరిగినా అందరూ వాడినే తిడతాం అని మాధవ అంటాడు.
చక్రికి క్లాస్ పీకిన మహా
దీంతో మహా మెల్లగా అతని దగ్గరికి వెళ్తుంది. ఏం జరిగిందని అడుగుతుంది. తన జీవితంలో మరచిపోలేని ఎంతో మధురమైన రోజును అవమానంతో ముగిసేలా చేశారు అని చక్రి అంటాడు. ఎలా అవమానం.. మీరు చెప్పిన అబద్ధాన్ని బయటపెట్టడం అవమానమా.. నేను మిమ్మల్నిహగ్ చేసుకొని ఐలవ్యూ చెప్పానా అని మహా నిలదీస్తుంది. సగం నిజమే కదా అని చక్రి అంటే.. సగం అబద్ధం కాదా అని అంటుంది. అసలు హగ్ చేసుకున్న విషయం చెప్పడమే నాకు చాలా ఇబ్బందిగా ఉంది.. పైగా ఐలవ్యూ చెప్పానని అనడం నాకు ఎలా ఉంటుంది అని మహా అంటుంది. అలా కల కనడం నా తప్పా అని చక్రి అంటాడు.
అయినా ఆ విక్కీ గాడు మాట్లాడిన మాటలు నన్ను మరింత బాధ పెట్టాయి. మధ్యలో అతడెందుకు అని మహా అంటుంది. నేను వెళ్తున్నాను.. లాంగ్ ట్రిప్ వచ్చింది అని చక్రి అంటాడు. నిజంగానే వచ్చిందా లేక అలిగి వెళ్లిపోతున్నారా అని అడిగితే.. నిజంగానే వచ్చిందని అంటాడు. రాత్రంతా నడపకుండా మధ్యలో నిద్ర వస్తే ఆగండి అని మహా జాగ్రత్తలు చెబుతుంది. భర్తకు చెప్పినట్లు అలా చెప్పకండి.. మళ్లీ నేను ఏదైనా ఊహించుకుంటే ఫీలవుతారు అని చక్రి వెళ్లిపోవడంతో మహా ఫీలవుతుంది.
మహాను కూల్ చేసేందుకు విక్కీ ప్లాన్
{{/usCountry}}అయినా ఆ విక్కీ గాడు మాట్లాడిన మాటలు నన్ను మరింత బాధ పెట్టాయి. మధ్యలో అతడెందుకు అని మహా అంటుంది. నేను వెళ్తున్నాను.. లాంగ్ ట్రిప్ వచ్చింది అని చక్రి అంటాడు. నిజంగానే వచ్చిందా లేక అలిగి వెళ్లిపోతున్నారా అని అడిగితే.. నిజంగానే వచ్చిందని అంటాడు. రాత్రంతా నడపకుండా మధ్యలో నిద్ర వస్తే ఆగండి అని మహా జాగ్రత్తలు చెబుతుంది. భర్తకు చెప్పినట్లు అలా చెప్పకండి.. మళ్లీ నేను ఏదైనా ఊహించుకుంటే ఫీలవుతారు అని చక్రి వెళ్లిపోవడంతో మహా ఫీలవుతుంది.
మహాను కూల్ చేసేందుకు విక్కీ ప్లాన్
{{/usCountry}}ఆ తర్వాత మహా పడుకోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడే అటు ఆమె గురించే ఆలోచిస్తుంటాడు విక్కీ. ఆమె విషయంలో ఎందుకంత దురుసుగా ప్రవర్తించాను.. చాలా ఫీలైనట్లుంది.. సారీ కూడా అంగీకరించడం లేదు.. ఆమెను ఎలా కూల్ చేయాలని ఆలోచిస్తుంటాడు. మెసేజ్ చేద్దాం అనుకొని.. ఏం చేస్తున్నావ్.. పడుకున్నావా అని పంపిస్తాడు.
ఆ మెసేజ్ చూసినా మహా రిప్లై ఇవ్వదు. ఈ రోజు నువ్వు చాలా గొప్ప పని చేశావని మరో మెసేజ్ పంపిస్తే థ్యాంక్యూ అని రిప్లై ఇస్తుంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది అని మరో మెసేజ్ పంపగా.. అది చూసి విక్కీ ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకొని రిప్లై ఇవ్వకుండా ఫోన్ సైలెంట్ పెట్టేస్తుంది. తర్వాత విక్కీ ఫోన్ చేసిన చూడదు.
చక్రి కోసం వెతికిన మహా.. మెసేజ్ చేసి..
మరుసటి రోజు ఉదయమే చక్రి కోసం మహా వెతుకుతుంది. అతడు ఇంట్లో కనిపించడు. సారు కనిపించడం లేదేంటి అని మాధవ, కేశవను అడిగితే.. రాత్రి నుంచే రాలేదు కదా.. అయినా గొడవ పడితే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వాడికి అలవాటే కదా అని మాధవ అంటాడు. అతడు ఎలా రాడో నేనూ చూస్తాను అనుకొని.. మహా ఓ మెసేజ్ పంపిస్తుంది. అది చూసి తనలో తానే నవ్వుకుంటుంది.
మహా మెసేజ్ చూసి చక్రి షాక్.. కనుబడుట లేదంటూ..
మహా మెసేజ్ చూసిన చక్రి షాకవుతాడు. అందులో తన ఫొటో పెట్టి కనుబడుట లేదు అని రాసి ఉంటుంది. పేరు చక్రి, ఎత్తు తాటిచెట్టంత, రంగు సోసో పెద్ద రంగేమీ కాదు.. గర్ల్స్ హాస్టల్ బయట కనిపించే అవకాశం ఉంది.. హాబీలు అమ్మాయిలతో చాటింగ్, మీటింగ్.. అతడు కనిపించడం లేదని వాళ్ల నాన్న మంచం దిగి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.. అతని జాడ చెప్పిన వారికి 10 వేల ఫైన్ అని రాసి ఉంటుంది.
అది చూసి చక్రి షాకవుతాడు. ఇది కనుక ఊళ్లో వాళ్లందరూ చూస్తే తన పరిస్థితి ఏంటి అని అనుకుంటాడు. అప్పుడే తన ఓనర్ ఫోన్ చేసి యాదగిరి గుట్ట ట్రిప్ కు వెళ్తావా అని అడిగితే.. వెళ్లనని చిరగ్గా చెబుతాడు. తాను కనిపించడం లేదంటూ ఫోన్ పెట్టేస్తాడు.
ప్రసాదం తెచ్చిన శైలు.. మళ్లీ కేశవతో గొడవ
చక్రి ఆ మెసేజ్ చూడటంతో మహా నవ్వుకుంటుంది. తాను చక్రికి పంపిన మెసేజ్ ను కేశవ, మాధవలకు చూపిస్తుంది. అది చూసి వాళ్లూ నవ్వుకుంటారు. దీనిని సోషల్ మీడియాలో పెట్టారా అని అడిగితే.. లేదు కేవలం అతనికే పంపించాను.. ఇప్పుడు ఇంటికి ఎలా రాడో నేనూ చూస్తాను అని మహా అంటుంది. వాళ్లు బయటకు వెళ్తుండగా శైలు వస్తుంది. కార్తీకమాసం కదా గుడికి వెళ్లి ప్రసాదం తెచ్చానంటూ వాళ్లకు ఇస్తుంది.
మహా వెళ్లిపోతుండగా తాను డ్రాప్ చేస్తానని కేశవ అంటాడు. వద్దులే నేనే వెళ్తానని మహా వెళ్లిపోతుంది. అది చూసి మరోసారి కేశవతో గొడవ పడుతుంది శైలు. చక్రి లేడని, అందుకే తాను అడిగానని చెబుతూనే.. పెళ్లి తర్వాత కూడా ఇలాంటి ఫిట్టింగులు పెడితే నిన్ను పార్టులుగా విడదీసేస్తానని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత మాధవ కూడా వెళ్లిపోతుండగా.. తాను విజయవాడ వెళ్లి వస్తానని అతనికి చెబుతాడు. ఆ విషయం తనకు ఎందుకు చెప్పలేదని కూడా శైలు గొడవకు దిగుతుంది.
లక్కీకి సరదాగా మళ్లీ క్లాస్ పీకిన విక్కీ.. కాస్ట్లీ వాచ్ గిఫ్ట్
ఇటు ఆఫీసులో దివ్యతో కలిసి మహా సరదాగా నవ్వుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన విక్కీ వాళ్లను సీరియస్ గా చూస్తాడు. దీంతో వాళ్లు కంగారు పడతారు. ఆఫీసు టైమ్ లో ఈ నవ్వులేంటి.. టైమ్ వేస్ట్ చేస్తే నేను ఊరుకోను అని క్లాస్ పీకుతాడు. మహా సారీ చెప్పగానే విక్కీ నవ్వుతాడు. తానేదో సరదాగా అలా అన్నానని, నువ్వు నా లక్కీ అని అంటాడు. తర్వాత ఆమెకు ఓ ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు. అది తీసుకోవడానికి మహా నిరాకరించినా.. వినకుండా అందరి చేత ఒత్తిడి తీసుకొచ్చి తీసుకునేలా చేస్తాడు.
విక్కీ స్టేటస్ చూసి చక్రి షాక్
ఆమెకు వాచ్ ఇస్తూ ఫొటో దిగుతాడు విక్కీ. అదే ఫొటోను తన స్టేటస్ లో పెడుతూ రెడ్ హార్ట్ ఎమోజీ కూడా యాడ్ చేస్తాడు అది చూసి చక్రికి మండుతుంది. దానిని నారాయణకు చూపించి ఈ విక్కీ గాడు అతి చేస్తున్నాడు.. నా భార్యపై కన్నేశాడు.. ఆమెపై వాడికి ఏదో దురుద్దేశం ఉందని చెబుతాడు. అది విన్న నారాయణ వాడి పళ్లు రాలగొట్టాలి అంటూ ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHOR
హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.