...
...
Next Story

Podarillu October 13 Episode: పొదరిల్లు- చక్రి కాళ్లపై కాఫీ కప్- మహా డబ్బు కొట్టేసిన జమున- జమునకు మాధవ బంగారు గాజులు

Podarillu Serial October 13th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 13వ ఎపిసోడ్‌‌లో తల్లి ఆశీర్వాదం తీసుకుని ఎగ్జామ్‌కి వెళ్తాడు కన్నా. అంతా వెళ్లిపోయాకా నారాయణ, జమున వాదించుకుంటారు. నేను చేయాల్సింది చేసే వెళ్తాను మగడ అని జమున అనుకుంటుంది. జమునకు తన తల్లి బంగారు గాజులు ఇస్తాడు మాధవ.

Published on: Oct 13, 2026, 08:38:22 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మహాలక్ష్మి కూడా ఇంటి ఇల్లాలుగా, తనక భార్యగా అన్ని పనులు చేస్తే ఎలాగుంటుందని చక్రి కలకంటాడు. ఉదయం లేచి ముగ్గు వేయడం నుంచి వంట గదిలో వెనుకనుంచి హగ్ చేసుకుని రొమాన్స్ చేయడం వరకు, బాత్రూమ్‌లోకి లాగడం, రాత్రి తనకోసం మహా ఎదురుచూడటం వరకు అన్ని ఊహించుకుంటాడు చక్రి.

చక్రి కాళ్లపై కాఫీ కప్పు

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్

మహాకు చక్రి మల్లెపూలు ఇస్తే మురిసిపోతుంది. కేశవ కొట్టడంతో చక్రి తేరుకుంటాడు. నా ఇమాజినేషన్‌లో వేరే కనిపిస్తున్నాయేంట్రా అని కేశవ అంటాడు. చక్రి కాళ్లపై కాఫీ కప్పు పెట్టి తీసుకుని తాగమంటుంది మహా. చక్రి ఫోన్ తీసి మిక్సీలో వేస్తుంది. అది కేశవ చెబుతాడు. ఇంతలో మహా వస్తే మీరు కన్నా తల్లిని చూశారుగా అని చక్రి అంటే.. మీకు స్క్రూల్ లూసా. మనమేగా తీసుకొచ్చిందని మహా అంటుంది.

జమున చేసిన పనులు, భర్త మాటలు అన్న పడటం గురించి చెబుతాడు. ఇదంతా నాకెందుకు చెబుతున్నావని మీరెవరో అని అంటుంది మహా. అందరి క్యారెజ్ ఇస్తుంది జమున. రాగానే పనులన్నీ నెత్తినెత్తుకున్నారని మాధవ అంటే.. ఇన్నేళ్లు దూరం ఉన్నా. ఇప్పుడైనా చేయని పెద్దబాబు అని జమున అంటుంది. పెద్దికిపోటీగా పెద్దబాబా అని చక్రి అంటాడు.

ఇకనుంచి అన్నీ పనులు నేను చూసుకుంటాను. ఇల్లు నాకు అప్పజెప్పండని జమున అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అదే ఇంటి పని నాకు అప్పగించండని జమున అంటుంది. ఎగ్జామ్ బాగా రాయాలని దీవించమ్మా అని జమున కాళ్లకు నమస్కరిస్తాడు. ఇదివరకు మాధవ కాళ్లకు దండం పెట్టింది గుర్తు చేసుకుంటాడు పెద్ది. కన్నాకు ముద్దుపెట్టి ఆశీర్వదిస్తుంది జమున.

భయపడని జమున

అంతా వెళ్లిపోతారు. ఏయ్.. బయటకు రావే అని నారాయణ అడిగితే.. కిచెన్‌లో ఉన్న కత్తి దాచి వస్తుంది జమున. ఇద్దరు వాదించుకుంటారు. ఈసారి ఏ ప్లాన్‌తో అడుగుపెట్టావని నారాయణ అడిగితే.. ఒకసారి తప్పు చేస్తే ఎప్పటికీ చేస్తానా. నాకు ఆశ్రయం కావాలి, అన్నం కావాలి. అండ కావాలి, అలాగే నా కొడుక్కి అమ్మ కావాలి జమున అంటుంది.

నీకు అర్హత లేదు. వాడు నా కొడుకు మాత్రమే. నువ్వు ఎవరితో వెళ్లిపోయావ్. ఆ బురద కడిగేసుకుని మళ్లీ ఎందుకు అడుగుపెట్టావ్. నువ్వు ఉంటే భార్యను చంపిన పేరు నాకు పోదు. మర్యాదగా వెళ్లిపో అని నారాయణ అంటే.. ఆ మాట నా కొడుకుతో చెప్పించవయ్యా అని జమున అంటుంది. దాంతో జమున పీక పట్టుకోబోయి ఆగిపోతాడు నారాయణ. జమున ఏమాత్రం భయపడదు, జంకదు.

కన్నాకు ఇద్దరు తల్లులు

నా కొడుకులకు మంచి సంబంధాలు వస్తున్నాయి. ఈ టైమ్‌లో నిన్ను చంపి అది చెడగొట్టుకోలేను అని నారాయణ వెళ్లిపోతాడు. నువ్వు ఎందుకు వెళ్లిపోమ్మంటున్నావో నాకు తెలుసు. నేనెందుకు ఉంటున్నానో నీకు తెలియదు. నీకు తెలిసిలోగా నేను వచ్చిన పని ముగించుకుంటాలేవయ్యా మగడ అని జమున మనసులో అనుకుంటుంది.

మరోవైపు కన్నా తల్లి వచ్చినందుకు పార్టీ ఎప్పుడిస్తారని మనీషా అడుగుతుంది. త్వరలో చాలా పెద్ద పార్టీ ఇస్తానని మాధవ అంటాడు. ఇకనుంచి కన్నాకి ఇద్దరు తల్లులు. వాడి ఆనందానికి అవధులుండవని మాధవ కన్నీళ్లుపెట్టుకుంటాడు. మహా వచ్చినప్పటినుంచి అంతా మంచే జరుగుతుంది. మా అత్త శాపం మా ఇంటి మీద లేదని నిరూపించిందని పొగుడుతాడు మాధవ.

ఇంకో విశేషం కూడా జరగబోతుంది. కేశవ షాప్ ఓనర్ కాబోతున్నాడని చెబుతాడు మాధవ. దానికి మనీషా సంతోషిస్తుంది. మరోవైపు తోమడానికి చాలా గిన్నెలు ఉండటం చూసి ఇక్కడ కూడా అదే బతుకు అని చీదరించుకుంటుంది జమున. ఇంతలో జమునకు రెండో భర్త ముఖేష్ కాల్ చేస్తాడు. ఎవరు లేరని చూసి కాల్ లిఫ్ట్ చేస్తుంది.

జమున దొంగతనం

ఏమైనా గిట్టుబాటు అయ్యేలా ఉందా అని ముఖేష్ అడుగుతాడు. ఇక్కడ బండెడు చాకిరీ. ఇంతకుముందు బాగుండేది. ఇప్పుడు ఎగిరి తంతే కూలిపోయేలా ఉంది. ముగ్గురు నలుగురు సంపాదిస్తున్నారు. అంతా ఫోన్‌లోనే దాచుకుంటున్నారుగా అని జమున అంటుంది. తాగడం, అప్పుల గురించి భర్తకు నీతులు చెబుతుంది. అవి మందులో నంజుకోడానికి కూడా పనికిరావని ముఖేష్ అంటాడు.

నువ్వు రాకపోతే ఏం తేకపోతే కుక్కలా అడుక్కోవాలి అని ముఖేష్ అంటే.. నా కొడుకు వదిలిపెట్టేలా లేడు. మళ్లీ వెతుక్కుంటూ వస్తే అని జమున అంటుంది. మనకు కావాల్సింది దొరికాక ఆ కొంపలో ఎందుకుంటామని ముఖేష్ అంటాడు. సరే అందినకాడికి లేపేస్తాను. నువ్వు మాత్రం మాటిమాటికి ఫోన్ చేయకని జమున కాల్ కట్ చేస్తుంది.

బయటకు వెళ్లి ఈ బండోడు లేడని నిర్ధారించుకుని ఇల్లంతా డబ్బుకోసం వెతుకుతుంది జమున. ఓ సూట్‌కేస్‌లో డబ్బు దొరుకుతుంది. అది దొంగతనం చేస్తుంది జమున. ఇది ఏ మూలకి.. ఇంకా పెద్దమొత్తం కావాలనుకుంటుంది జమున. జమున చేసిన దొంగతనం గిట్టుబాటు కాదు. కానీ ఆ సూట్‌కేస్ మహాది. మహా డబ్బునే జమున దొంగతనం చేస్తుంది. మరోవైపు చక్రికి మహా కాల్ చేస్తుంది. ఏంటీ కాల్ చేశారని చక్రి అడిగితే.. ఏం చేయకూడదా. తిన్నారా అని మహా అంటుంది.

జమునకు బంగారు గాజులు

దాంతో చక్రి షాకైపోతాడు. ఇది కలనా నిజమా. మీరు నన్ను తిన్నారా అని అడిగారా అని తనలో తానే మురిసిపోతాడు. మాలో ప్రేమ విత్తనం నాటావా స్వామి అని సంతోషిస్తాడు చక్రి. సైడ్ మిర్రర్‌లో చూస్తూ చక్రి నీ లైన్ క్లియర్‌రా అనుకుంటాడు. తర్వాత రాత్రి అందరికి జమున భోజనం వడ్డిస్తుంది.

జమున చేతులు బోసిగా ఉన్నాయని తన తల్లి బంగారు గాజులు ఇస్తాడు మాధవ. నారాయణ వచ్చి అడ్డుకుంటాడు. ఇవి మీ అమ్మ గాజులు, దారినపోయేదానికి ఇస్తున్నావేంటీ అని నారాయణ అంటాడు. ఇస్తే ఏమైంది, మా అమ్మేగా. నీ భార్యేగా అని కన్నా అరుస్తాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks