Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మొత్తం తల్లి కోసం కన్నా పరితపించడం, అతన్ని నవ్వించడానికి చక్రి, మహా ప్రయత్నించడం చుట్టూ తిరుగుతుంది. జమున విషయంలో నారాయణను నిందించిన కన్నా, కేశవలకు మహా క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
కన్నా తల్లి వెళ్లిపోయిందన్న కేశవ.. గొడవ పడిన శైలు

తన మెకానిక్ షాపులో కేశవ, శైలు మాట్లాడే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ మొదలైంది. ఇంట్లో నుంచి కన్నా తల్లి వెళ్లిపోయిందటగా అని షాపులో పని చేసే కుర్రాడు కేశవను అడుగుతాడు. అవును అని కేశవ చెప్పడంతో ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని శైలు నిలదీస్తుంది. అతనితో గొడవ పడుతుంది.
ఆ ఇంటికి రాబోయే కోడలిగా నాకు ఆ విషయం తెలుసుకునే హక్కు లేదా.. అయినా చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిన కన్నా తల్లే రెండు రోజులు ఆ ఇంట్లో ఉండలేకపోయింది.. నేను వచ్చినా నాకూ అదే పరిస్థితి ఎదురవుతుందా అని శైలు అంటుంది. దీంతో ఏం మాట్లాడుతున్నావ్ అంటూ కేశవ కోప్పడతాడు. దీంతో శైలు మరోసారి అతనితో గొడవ పడి అలిగి వెళ్లిపోతుంది.
నారాయణ, రమణయ్య గొడవ..
మరోవైపు టీ షాపు దగ్గర నారాయణ, రమణయ్య మరోసారి గొడవ పడతారు. దూల తీరిందా అంటూ నారాయణను చూసి రమణయ్య పాట పాడుతుంటాడు. ఎందుకంత సంతోషం.. మీ చెల్లి చచ్చిపోయిందా అని నారాయణ కౌంటర్ వేస్తాడు. దీంతో రమణయ్యకు కోపం వస్తుంది.
ఇంతలో నారాయణ ఫ్రెండ్ వచ్చి రమణయ్యను ఏం జరిగిందని అడిగితే.. అతని రెండో భార్య మళ్లీ ఇల్లు వదిలి వెళ్లిపోయిందట అని చెబుతాడు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చి అప్పుడే వెళ్లిపోయిందా అని ఆ వ్యక్తి అనడంతో నారాయణ ఫీలైపోయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కన్నా గురించి మాధవ ఆందోళన.. మహా, చక్రిలపై అనుమానం
{{/usCountry}}ఇంతలో నారాయణ ఫ్రెండ్ వచ్చి రమణయ్యను ఏం జరిగిందని అడిగితే.. అతని రెండో భార్య మళ్లీ ఇల్లు వదిలి వెళ్లిపోయిందట అని చెబుతాడు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చి అప్పుడే వెళ్లిపోయిందా అని ఆ వ్యక్తి అనడంతో నారాయణ ఫీలైపోయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కన్నా గురించి మాధవ ఆందోళన.. మహా, చక్రిలపై అనుమానం
{{/usCountry}}ఇటు ఇంట్లో కన్నా గురించి మాధవ ఆందోళన చెందుతుంటాడు. జమున ఎక్కడికెళ్లిందో తెలియదు.. కన్నా వస్తే ఏం చెప్పాలో అని అనుకుంటాడు. ఇంతలో చక్రి, మహా వస్తే వాళ్లకూ అదే విషయం చెబుతాడు. తుఫానుకు పిచ్చి మొక్క కొట్టుకొచ్చినట్లు వచ్చి వెళ్లిపోయింది.. దానికి మనమేం చేస్తాం అని చక్రి అంటాడు. ఆమె ఇక తిరిగి రాదు అన్నట్లు మహా మాట్లాడుతుంది. దీంతో మాధవకు వాళ్లపై అనుమానం కలుగుతుంది. ఆమె మళ్లీ రాదని అంత కచ్చితంగా మీకెలా తెలుసు.. ఆమెకు ఎందుకు వెళ్లిపోయిందో మీకు తెలుసా అని అడుగుతాడు.
తల్లి కోసం ఏడ్చిన కన్నా.. నారాయణ కాలర్ పట్టుకొని.. ఆపిన మహా
ఇంతలో కన్నా వస్తాడు. అమ్మా అమ్మా అంటూ పిలుస్తుంటాడు. అమ్మ రాలేదా అని మాధవను అడుగుతాడు. ఆమె కోసం ఏడుస్తాడు. దీంతో అందరూ కలిసి కన్నాను ఓదారుస్తారు. ఇంతలో నారాయణ రావడంతో ఆయన వల్లే తన తల్లి వెళ్లిపోయిందని, ఆమె వచ్చినప్పటి నుంచీ ఏదో ఒకటి అంటూనే ఉన్నాడని కన్నా అంటాడు. ఆమెను ఏం చేశావ్.. చంపేశావా అని కాలర్ పట్టుకొని అడుగుతాడు కన్నా. అతనికి కేశవ కూడా సపోర్ట్ చేస్తాడు. మా అమ్మను కూడా ఈయనే చంపేశాడు.. ఇప్పుడూ అదే చేసి ఉంటాడు అని అంటాడు.
ఆమె గురించి నీకేం తెలియదు వదిలెయ్ అని నారాయణ చెప్పినా కన్నా వినడు. దీంతో మహా జోక్యం చేసుకుంటుంది. ఈ విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు.. ఆయనను మరొక్క మాట అన్నా ఊరుకోను.. ఒకవేళ ఆమెను తరిమేయాలని అనుకుంటే.. ఆమె వచ్చిన మొదటి రోజే కత్తి పట్టుకొని వెంటపడే వాడు కదా.. ఇక చాలు లోనికి వెళ్లండి అని కన్నా, కేశవలను తిట్టి పంపిస్తుంది. కానీ కన్నా మాత్రం ఆమె కోసం ఏడుస్తూనే ఉంటాడు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చినా కన్న కొడుకును ఎలా వదిలేసి వెళ్లింది.. అయినా నేను ఆమెను రమ్మనలేదు కదా.. మీరే వెళ్లి తీసుకొచ్చారు అని చెప్పి లోని వెళ్లి కన్నా ఏడుస్తూనే ఉంటాడు.
బాధపడిన మహా.. నారాయణ చెప్పింది వినాల్సిందన్న చక్రి
దీంతో మహా బయటకు వెళ్లి బాధపడుతుంది. ఆమెను తీసుకొచ్చి తప్పు చేశానని అనుకుంటుంది. చక్రి వచ్చి మహాను ఓదారుస్తాడు. ఈ విషయంలో నారాయణ చెప్పింది వినాల్సిందని చక్రి అంటాడు. ఆమె ఎలాంటిదో మొదటి నుంచీ ఆయన చెబుతూనే ఉన్నా మనం పట్టించుకోలేదు అని చెబుతాడు.
కన్నాను ఇలా చూడలేకపోతున్నానని, తన వల్లే ఇలా జరిగిందని, జమునను ఇంటికి తీసుకురావాల్సింది కాదని మహా బాధపడుతుంది. ఎలాగైనా వాడి మూడ్ బాగు చేయాలని మహా అంటే.. ఇద్దరం కలిసి ఓ పని చేద్దాం అని చక్రి ఓ ఐడియా ఇస్తాడు.
కన్నాను నవ్వించడానికి మహా, చక్రి ప్లాన్
చక్రి, మహా లోనికి వెళ్లి బాధతో ఉన్న కన్నాను నవ్వించేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో ఉన్న దువ్వెనను పట్టుకొని మైకులా ఓ పాట పాడతాడు చక్రి. చాలా దారుణంగా పాడటంతో మహా, కేశవ, మాధవ వినలేక పక్కకెళ్తారు. అయినా కన్నా మాత్రం బాధలోనే ఉంటాడు.
దీంతో ఓ ఆట ఆడుదాం అని మహా అంటుంది. ఈ దువ్వెనను ఇటు వైపు నుంచి అటు వైపు దాటాలని అంటుంది. ఓడిపోతే అందరికీ ఐస్ క్రీమ్ తినిపించాలని షరతు పెడుతుంది. చక్రి సరే అంటాడు. దువ్వెనను తీసుకెళ్లి గోడ పక్కన పెడుతుంది. అప్పుడుగానీ దాని వెనుక ఉన్న కిటుకేంటో చక్రికి అర్థం కాదు. అతడు ఓడిపోతాడు.
చక్రి పరువు తీసిన మహా
అందరూ ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్తారు. ఇంతలో అక్కడ ఇద్దరు అమ్మాయిలు చక్రికి కనిపిస్తారు. మహాను ఏడిపిద్దాం అనుకున్న చక్రి.. వాళ్లతో ఫ్లర్ట్ చేయడం మొదలు పెడతాడు. మీరు ప్రపంచ సుందరి మూవీలో హీరోయిన్ కదా అని వాళ్లతో చక్రి అంటాడు. చక్రి పని చెబుతా చూడు అని కన్నాతో మహా అంటుంది. ఓ కాయిన్ కింద పడేస్తుంది. దానిని చక్రి పైకి తీయడానికి వెళ్లగా.. అతని ప్యాంట్ చినిగిన శబ్దం వచ్చేలా తన చున్నీ చింపుతుంది. అది తన ప్యాంటే అనుకొని చక్రి షాకవుతాడు. ఆ అమ్మాయిల ముందు అతని పరువు పోతుంది. కన్నా నవ్వుతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.