...
...
Next Story

Podarillu October 9 Episode: పొదరిల్లు- తల్లిని చీదరించుకున్న కన్నా- జమున పీక పట్టుకున్న నారాయణ- ఇంట్లోంచి వెళ్లిన మహా

Podarillu Serial October 9th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 9వ ఎపిసోడ్‌‌లో కన్నా తల్లి జమున చక్రి, మహా కలిసి నారాయణ ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకు దూరంగా ఉన్నారని ఎలా అడిగిన జమున సమాధానం చెప్పదు. జమునకు మహా హారతి ఇస్తుంటే విసిరిపడేస్తాడు నారాయణ. కోపంతో రగిలిపోయిన నారాయణ మహాపై అరుస్తాడు.

Published on: Oct 9, 2026, 09:23:33 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జమునకు కన్నా ఫొటో చూపించి, ఏమైనా గుర్తుకు వస్తుందా అని చక్రి, మహా అడుగుతారు. జమున గుర్తుపట్టదు. ఇంతకీ మీరెవెరని అడుగుతుంది జమున. పోనీ మీకు బృందావనం గుర్తుందా. లారీ డ్రైవర్ నారాయణ గుర్తున్నాడా అని మహాలక్ష్మి అడుగుతుంది.

మా నాన్నే తల్లిగా పెంచాడు

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 9 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 9 ఎపిసోడ్

ఆయన మీకు ఎలా తెలుసు అని జమున అడిగితే.. ఆయన మా నాన్న అని చక్రి అంటాడు. దాంతో జమున కంగారుపడుతుంది. ఇతను మీ కన్నకొడుకు కన్నా అని మహాలక్ష్మి అంటుంది. నా కొడుకా.. ఇంత ఉండేవాడు ఇంతయ్యాడా అని జమున అంటుంది. మా నాన్నే తల్లిగా పెంచాడు అని చక్రి అంటాడు.

మీరు మీ కొడుకును ఎందుకు చూడలేదు, ఇదే ఊర్లో ఉంటూ ఎందుకు కలవలేదు, మా నాన్నతో ఎందుకు విడిపోయారు అని మహాలక్ష్మి, చక్రి అడుగుతారు. అదో పెద్ద కథ. ఇదంతా జీర్ణం కాడానికి నాకు టైమ్ పడుతుందని జమున అంటుంది. మా ఇంటికి వెళ్దాం పదండని చక్రి అంటాడు. నాకోసం దేవుడే దేవదూతలను పంపాడు. నాలాంటిదానికి యమదూతలు తప్పా ఇంకెవరు రారు అని జమను అనుకుంటుంది.

ఎప్పుడో బంధాన్ని తెంచుకుని వచ్చాను. మీ నాన్న, ఈ లోకం ఏమనుకుంటుందని జమున అంటుంది. మా నాన్నకు మేము చెప్పుకుంటామని చక్రి అంటే.. మీరు ఒక్కరే ఉంటున్నారా అని మహా అడుగుతుంది. అయినవాళ్లంతో బృందావనంలోనే ఉన్నారు. నేను ఒంటరిగానే బతుకుతున్నా అని జమున అబద్ధం చెబుతుంది. మీతో ఎవరినో చూశానే అని చక్రి అంటాడు.

ఈ మొగుడు గెంటేశాడు

కన్నా వస్తాడు. ఏంటీ సంతోషంగా ఉన్నారని కన్నా అడిగితే.. తెలియదని కేశవ చెబుతాడు. మొహం కడుక్కుని, మంచి షర్ట్ వేసుకోమ్మని మాధవ చెబుతాడు. కన్నా వెళ్తాడు. తన తల్లి కోసం ఎన్నోసార్లు అడిగేవాడు కన్నా. ఇప్పుడు ఆ తల్లికొడుకులు ఒక్కటికాబోతున్నారని మాధవ అంటాడు. చక్రిగాడి పెళ్లి అయ్యాకే మనకంతా మంచి జరుగుతుందని కేశవ అంటాడు.

ఇంతలో కన్నా వస్తాడు. మమ్మల్ని మర్చిపోతావా. యశోద నుంచి దేవకీ దగ్గరికి కృష్ణుడు వెళ్లినప్పుడు ఎలా ఉండేదని మాధవ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య అని కేశవ ఆపుతాడు. మరోవైపు జమునను కారులో తీసుకొస్తారు మహా, చక్రి. కన్నాను చూడాలని ఇన్నేళ్లలో మీకు అనిపించలేదా అని అమ్మతనం గురించి అడుగుతుంది మహాలక్ష్మి.

కన్నీళ్లుపెట్టుకున్న మహా

దానికి కూడా సమాధానం చెప్పదు జమున. ఏ తల్లి చేయకూడని తప్పు చేశారని మహా అంటుంది. నా పరిస్థితి అలాంటిదని జమున అంటుంది. తల్లి గురించి గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటుంది మహాలక్ష్మి. ఇప్పుడు పౌరుషానికి పోతే ఈ కాస్తా నీడ కూడా దొరకదు. మూసుకుని పడాల్సిందే అని జమున మనసులో అనుకుంటుంది.

మరోవైపు సర్‌ప్రైజ్ ఏంటని కన్నా అడుగుతాడు. ఏం లేదని మాధవ అంటాడు. నారాయణను కోపం తగ్గించుకోవాలని కేశవ అంటాడు. ఇంతలో జమునను ఇంటికి తీసుకొస్తారు చక్రి, మహాలక్ష్మి. జమునను చూసి నారాయణ షాక్ అవుతాడు. కేశవ, మాధవ సంతోషిస్తారు. తను తన కన్నతల్లి అని నారాయణ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు కన్నా.

వీడే కన్నా.. నీ కన్నకొడుకు అని చక్రి చెబుతాడు. కొడుకును తల్లికి పరిచయం చేసే సందర్భం చాలా అరుదేమో అని మహాలక్ష్మి అంటుంది. వెళ్లి హారతి తీసుకొస్తానని వెళ్తుంది. కన్నాను జమున ముట్టుకోబోతుంటే కన్నా చీదరించుకుని లోపలికి వెళ్లిపోతాడు. అలిగాడేమో కాసేపట్లో మాములు అయిపోతాడని చక్రి అంటాడు. మహాలక్ష్మి హారతి ఇస్తుంటే హారతి పళ్లాన్ని విసిరిగొడతాడు నారాయణ.

ఇది అమ్మేంట్రా.. ఆడదే కాదు

ఎంత ధైర్యముంటే నా గడపలో కాలు పెడతావ్. పాదం లోపల పడిందంటే ప్రాణం బయటకు పోద్ది అని కోప్పడుతాడు నారాయణ. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు. అసలు ఇది ఇంటినుంచి ఎందుకు బయటకుపోయిందో తెలుసా. ఇది అమ్మేంట్రా. ఆడదే కాదు. రేయ్ దీన్ని పంపించేయండి. ఆ పెళ్లాన్ని చంపానన్న పేరు పోకముందే దీన్ని చంపానన్న మచ్చ ఈ ఇంటి మీద పడకూడదంటే ఇది నా కళ్ల ఎదుట ఉండకూడదని నారాయణ వార్నింగ్ ఇస్తాడు.

ఏమయ్యా అని జమున అంటే.. వీళ్లు రమ్మంటే ఎలా వచ్చావే. సిగ్గు శరం లేవా. ఒక జంతువులాగా బిడ్డను కనేసి పోయావుగా మళ్లీ ఎలా వచ్చావ్ అని జమున పీక పట్టుకుంటాడు నారాయణ. ఏయ్ మాకు ఎలాగు అమ్మ లేకుండా చేశావ్. కన్నాకైనా ఉండనివ్వు అని కేశవ అంటాడు. రేయ్.. నేను చేయడమేంట్రా. ఇది ఎలాంటి ఆడదో తెలుసా. ఇలాంటిది ఇంట్లో ఉండకూడదు అని నారాయణ అంటాడు.

కన్నాగాడు ఇప్పుడు సంతోషపడతాడేమో. కానీ దీని గురించి తెలిస్తే ఇలాంటిదానికి ఎందుకు పుట్టానో బాధపడతాడు. ఇలాంటి ఆడది నా ఇంట్లో ఉండటానికి వీళ్లేదు. దీనిగురించి తెలిస్తే మనగురించి ఇంకా నీచంగా అనుకుంటార్రా. ఇప్పుడు కొత్తగా ఇది రావడం వల్ల మనకు ఒరిగేదేం లేదు అని నారాయణ అంటాడు. ఏయ్ వెళ్లవే.. అసలు నిన్ను ఎవరు తీసుకొచ్చారని నారాయణ అంటాడు.

వెళ్లిపోయిన మహాలక్ష్మి

నేనే అని మహాలక్ష్మి అంటుంది. దాంతో మహాలక్ష్మిపై కోప్పడుతాడు నారాయణ. అసలు నువ్వెందుకు తీసుకొచ్చావ్. ఇది మా ఇంటి విషయం నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావ్ అని కోపంగా అరుస్తాడు నారాయణ. దాంతో అంతా షాక్ అవుతారు.

ఎంతైనా ఈ ఇంటికి నేను పరాయిదాన్నేగా అనిపిస్తుంది. ఇది మీ కుటుంబం మీ సమస్య నేను పరాయిదాన్నేగా అని మహా వెళ్లిపోతుంది. దాంతో మాధవ, కేశవ, చక్రి షాక్ అవుతారు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks