Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కూడా మాధవ నిశ్చితార్థం చుట్టూ తిరిగింది. గత కొన్ని ఎపిసోడ్లుగా సాగదీస్తూనే ఉన్న ఈ నిశ్చితార్థం తాజా ఎపిసోడ్ లోనూ ఇంకా పూర్తి కాలేదు. జయంతి మాజీ భర్త ఎంట్రీ, తాయారా శాపనార్థాలు, మనీషా సెంటిమెంట్ సీన్లతో సాగిపోయింది.
మర్యాద కోసం పట్టుబట్టి సాధించిన నారాయణ

నిశ్చితార్థం కోసం అమ్మాయి ఇంటికి వచ్చి బయటే కాళ్లు కడుక్కోవడానికి నీళ్ల కోసం నారాయణ పట్టుబట్టే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ మొదలైంది. జయంతి తమ్ముడు శశిపాల్ కు క్లాస్ పీకి మరీ అతనితో నీళ్లు తెప్పించుకొని కాళ్లు కడుక్కుంటాడు నారాయణ.
మర్యాద తెలియదంటూ తిడతాడు. జయంతి నాన్ని కలగజేసుకొని నారాయణకు సర్ది చెబుతాడు. ఏదో రకంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని బలంగా డిసైడైనట్లున్నాడు అని మహాతో అంటాడు చక్రి. ఇంతదాకా వచ్చాక ఇవన్నీ అవసరమా అని మహా అంటే.. ఆయన ప్రయత్నం ఆయన చేయనీ అని చక్రి అంటాడు.
నిశ్చితార్థానికి మాజీ భర్త శేఖర్‌ను రప్పించిన జయంతి..
అటు నిశ్చితార్థానికి జయంతి మాజీ భర్త శేఖర్ వస్తాడు. అతనికి అసలు విషయం చెప్పకుండా రమ్మనడంతో ఇంట్లో ఏర్పాట్లు చూసి షాకవుతాడు. బావను అక్క దగ్గరికి తీసుకెళ్తాడు తమ్ముడు శశిపాల్. తనకు నిశ్చితార్థం అని జయంతి చెప్పడంతో శేఖర్ కంగు తింటాడు. ఈ విషయం తెలిసి నీ మేల్ ఇగో ఎలా రియాక్ట్ అవుతుందో చూడటానికే నిన్ను రమ్మన్నానని జయంతి అంటుంది.
అంత కుతూహలం తనకు లేదని శేఖర్ అంటే.. తనకు ఉందని చెబుతుంది. నువ్వు ఇక్కడే ఉండాలి.. నీ కంటే ముందే నా పెళ్లి జరగడం చూసి కుళ్లుకోవాలి.. రెస్టారెంట్ లో చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నాను.. నాకు అసలు మరో సంబంధమే రాదని అన్నావు కదా.. ఇప్పుడు చూడు అని జయంతి అంటుంది.
{{/usCountry}}అంత కుతూహలం తనకు లేదని శేఖర్ అంటే.. తనకు ఉందని చెబుతుంది. నువ్వు ఇక్కడే ఉండాలి.. నీ కంటే ముందే నా పెళ్లి జరగడం చూసి కుళ్లుకోవాలి.. రెస్టారెంట్ లో చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నాను.. నాకు అసలు మరో సంబంధమే రాదని అన్నావు కదా.. ఇప్పుడు చూడు అని జయంతి అంటుంది.
{{/usCountry}}శేఖర్ వెళ్లిపోబోతుంటే ఆపి మరీ రెచ్చగొడుతుంది. నిశ్చితార్థం చూసి తట్టుకోలేవా అని అడుగుతుంది. దీంతో శేఖర్ కూడా సై అంటాడు. తానే దగ్గరుండి మరీ నిశ్చితార్థం జరిపిస్తానని, మీ ఇద్దరికీ ఆల్ ద బెస్ట్ చెబుతానని, నీ కొత్త మొగుడికి సానుభూతి ప్రకటిస్తానని అంటాడు.
మాధవ ఫ్యామిలీకి గట్టి షాకే ఇచ్చిన శేఖర్.. పెద్దికి క్లాస్ పీకిన నారాయణ
మరోవైపు మర్యాదల విషయంలో నారాయణ విసుక్కుంటాడు. శేఖర్ ను తీసుకొని వెళ్తున్న శశిపాల్ ను పిలిచి తమకు గది ఏదని అడుగుతాడు. ఇంతలో మాధవ వచ్చి శేఖర్ ను పలకరిస్తాడు. మీరు కూడా వచ్చారా అని అంటాడు. ఎవరతను అని నారాయణ అడిగితే.. ఈయన మా పాత బావ అంటూ శశిపాల్ పరిచయం చేస్తాడు. పాత బావేంటి అని అడిగితే.. మా అక్క మాజీ భర్త అంటాడు. అది విని అందరూ షాకవుతారు.
ఇప్పుడే ఒకరినొకరు బాగా చూసుకోండి.. ఆ తర్వాత వరదకు కొట్టుకుపోయిన వాళ్లలా ఒక్కో దిక్కుకుపోతారు.. జాగ్రత్త అని శేఖర్ వార్నింగ్ ఇస్తాడు. మీ అందరికీ నా సానుభూతి అని చెప్పి వెళ్లిపోతాడు. అది విని పెద్దికి నారాయణ క్లాస్ పీకుతాడు. ఇదేం దరిద్రంరా.. పెళ్లికి మాజీ భర్తను పిలవడం ఏంటి.. ఎక్కడా చూడలేదు అని అంటాడు.
పెద్దికి తాయారు కూడా క్లాస్.. మీ దరిద్రం మీ నెత్తి మీదే ఉందంటూ..
అప్పుడే తాయారు, గాయత్రి కూడా వస్తారు. జయంతికి రెండో పెళ్లని తెలిసి షాక్ తింటారు. తాయారు కూడా పెద్దికి క్లాస్ పీకుతుంది. నీకు ఇదేం కర్మరా.. విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోవడం ఏంటి.. మీరందరూ కలిసి ఎందుకు వాడి గొంతు కోస్తున్నారు అని తిడుతుంది. అయినా నా శాపనార్థాలు ఊరికే పోలేదు.. మీ దరిద్రం ఇంకా మీ నెత్తి మీదే ఉంది.. అందుకే ఇలాంటి సంబంధం వచ్చింది.. మీ ఇంట్లో కాస్త పద్ధతిగా ఉండేవి వీడొక్కడే.. అలాంటి వాడికి ఇలాంటి సంబంధం ఏంటని తాయారు రచ్చ చేస్తుంది. గాయత్రి కూడా ఇదేంటని పెద్దిని నిలదీస్తుంది. ఎవరైనా వింటే బాగోదు.. ఆ గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని మహా వాళ్లను తీసుకెళ్తుంది.
మాధవ దగ్గరికి మనీషా.. ఈ పెళ్లి ఎందుకని నిలదీసి..
ఆ తర్వాత మాధవ బాధపడుతుంటే మనీషా అతనికి దగ్గరికి వెళ్తుంది. అసలు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారని అడుగుతుంది. తన తమ్ముళ్ల కోసమే ఇలా చేస్తున్నానని అంటాడు. మీ మంచి మనసుకు మంచి అమ్మాయి దొరుకుతుంది.. మీరు ఇష్టపడకపోయినా మిమ్మల్ని ఇష్టపడే వాళ్లు ఉంటారు.. ఈ పెళ్లి చేసుకోకండి అని చెప్పినా మాధవ వినడు. దీంతో మనీషా నిరాశగా వెనుదిరుగుతూ.. దేవుడా ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి అని కోరుకుంటుంది.
అటు తాయారు, గాయత్రి కూడా అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు అని మహాను అడుగుతారు. తాము ఎంత చెప్పినా వినలేదని ఆమె అంటుంది. నువ్వయినా మాట్లాడు అని గాయత్రితో అంటాడు చక్రి. కానీ తాయారు అడ్డు పడుతుంది. మరోసారి తాయారు, నారాయణ మధ్య గొడవ జరుగుతుంది.
నిశ్చితార్థానికి వచ్చిన శైలు
ఆ తర్వాత నిశ్చితార్థానికి బాగా ముస్తాబై వస్తుంది శైలు. కేశవకు ఫోన్ చేస్తుంది. శైలును చూసి అతడు షాకవుతాడు. నిశ్చితార్థం మా అన్నయ్యకైతే నువ్వేంటి ఇంతలా రెడీ అయి వచ్చావని అడుగుతాడు. అది సరేగానీ బావగారు ఎక్కడ అని శైలు అడుగుతుంది. కలిసి థ్యాంక్స్ చెబుతానని అంటుంది.
ఆ తర్వాత లోనికి వెళ్లిన శైలు మాధవను కలిసి థ్యాంక్స్ చెబుతుంది. కేశవ ఇలాంటి కండిషన్ పెడతాడని తాను అనుకోలేదని శైలుతో పెద్ది అంటాడు. అది విన్న కేశవ షాకవుతాడు. అన్నయ్య ఈ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం వెనుక ఉన్న బలమైన కారణం ఇదా అని అనుకొని అందరి ముందూ శైలుని నిలదీస్తాడు. ఈ నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపాలంటాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.