Podarillu September 17 Episode: పొదరిల్లు.. జయంతి కాళ్లు పట్టుకున్న శేఖర్.. శైలుకి నూరి పోసిన వరాలు.. మాధవ కొత్త జీవితం
Podarillu Serial September 17 Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 17 ఎపిసోడ్ లో మాధవ కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమవుతాడు. అటు కేశవ, శైలుని విడదీసే ప్లాన్ చేస్తారు సురేష్, వరాలు. మరోవైపు జయంతి కాళ్లు పట్టుకొని ఆమెను సొంతం చేసుకుంటాడు శేఖర్.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మాధవ నిశ్చితార్థం రద్దవడంతో చక్రి అండ్ ఫ్యామిలీ ఆనందంతో గంతులేస్తారు. కానీ తమ్ముళ్లే ఈ పని చేశారని బాధపడిన మాధవ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అయితే అక్కడే అతనికి కొత్త జీవితం దొరుకుతుంది. మరోవైపు కేశవపై శైలుకి వరాలు లేనిపోనివి నూరిపోస్తుంది.

శశిపాల్‌ను కొట్టిన చక్రి.. తిట్టిన తాయారు
నిశ్చితార్థం రద్దయినందుకు తాయారు రచ్చ చేసే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ మొదలైంది. అయితే అది మా అక్క ఇష్టం అని శశి పాల్ అనడంతో చక్రి ఎంట్రీ ఇస్తాడు. అతన్ని దగ్గరికి పిలిచి చెంప చెల్లుమనిపిస్తాడు. నిన్న కొట్టడానికి చాలా సేపటి నుంచి చూస్తున్నాను.. సరిగ్గా దొరికావని అంటాడు. ఆ తర్వాత నారాయణ, కన్నా కూడా శశిపాల్ ను కొడతామని ఉత్సాహం చూపిస్తే తాయారు తిడుతుంది.
వాళ్లు చివరి నిమిషంలో నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.. ఇదే మరో చోటు అయితే మగాళ్ల తలలు పగిలేవి.. ఆడాళ్లు జుట్టు పట్టుకొని కొట్టుకునేవారు.. మీరేంటి ఇలా చేస్తున్నారని తిడుతుంది. కానీ మాధవ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇక వెళ్దాం పదండి అని అందరినీ తీసుకెళ్తాడు.
ఆనందంతో గెంతులేసిన ఫ్యామిలీ.. చక్రికి థ్యాంక్స్ చెప్పిన శేఖర్
లోనికి వెళ్లగానే ఆ కుర్చీని మడత పెట్టి అంటూ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. కన్నా అయితే చక్రిపై ఎక్కి మరీ నానా హంగామా చేస్తాడు. అన్నయ్య పెళ్లి రద్దయినందుకు చాలా సంతోషంగా ఉందని వాళ్లు అంటారు. దేవుడి దయతో ఇది చెడిపోయిందని కేశవ అంటే.. తన వల్ల జరిగితే దేవుడికి క్రెడిట్ ఇస్తారేంటి అని చక్రి అంటాడు.
అప్పుడే శేఖర్ అక్కడికి వస్తాడు. చక్రికి థ్యాంక్స్ చెబుతాడు. తన జీవితంలోకి దేవుడిలా వచ్చావని, నువ్వు లేకపోతే తన భార్య మళ్లీ కలిసేదే కాదని అంటాడు. నీకేం కావాలో చెప్పు అది చేస్తాను అని అనడంతో ఏం చేశాడని చక్రిని అంతలా పొగుడుతున్నారని మహాలక్ష్మి అడుగుతుంది. తానేం చేయలేదని అంతా శేఖరే చేశారని చక్రి అంటే.. ఆ గదిలో ఏం జరిగిందో శేఖర్ వివరిస్తాడు.
జయంతి కాళ్లు పట్టుకున్న శేఖర్
నిశ్చితార్థం కోసం రెడీ అవుతున్న జయంతి గదిలోకి శేఖర్ వెళ్లి గడియ వేస్తాడు. ఆమె కోప్పడంతో శేఖర్ ఆమెను బతిమాలుకుంటాడు. ఈ నిశ్చితార్థం రద్దు చేసుకోమంటాడు. ఇది నీ ఈగో వల్ల వచ్చిందే అని జయంతి అంటుంది. దీంతో శేఖర్ తాను తన తప్పు తెలుసుకున్నానని, మళ్లీ కలిసి ఉందామని అడుగుతాడు. నీ కాళ్లు పట్టుకుంటానంటూ జయంతి కాళ్లపై పడతాడు.
ఈ నిశ్చితార్థం రద్దు చేసుకునే వరకు నీ కాళ్లు వదలనని అంటాడు. దీంతో కరిగిపోయిన జయంతి.. సరే అంటుంది. ఆ విషయం విని చక్రి సహా అందరూ ఆశ్చర్యపోతారు. అయితే ఇది జరగడానికి కారణం చక్రియే అని, అందుకే నీలాంటి వ్యక్తికి మహాలాంటి మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని అంటాడు. శేఖర్ వెళ్లిపోయిన తర్వాత అందరూ చక్రిని మెచ్చుకుంటూ ఉండగా మాధవ వస్తాడు. ఆ సీన్ చూసి బాధ పడతాడు.
చక్రికి క్లాస్ పీకిన మాధవ.. తానే చేశానన్న చక్రి
ఇంట్లో మాధవ పంచాయతీ పెడతాడు. తన పెళ్లి రద్దవ్వాలని కోరుకుంటారా.. మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు కదా.. అత్త శాపం పెట్టినట్లు, పెదనాన్న కోరుకున్నట్లు నాకు అసలు ఇక పెళ్లే జరగదు.. నాకే కాదు మీ అందరికీ జరగదు.. ఈ బృందావనం బ్రహ్మచారుల మఠంగా మారుద్దాం.. సంతోషమేనా అని చక్రికి క్లాస్ పీకుతాడు. మీరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనలేదు.. జయంతితో పెళ్లి మాత్రమే వద్దన్నాం అని మహా వివరణ ఇస్తుంది.
అయినా మాధవ వినకపోవడంతో చక్రి రంగంలోకి దిగుతాడు. అవును.. నేనే నీ పెళ్లి రద్దు చేశాను.. అప్పుడు చెప్పడానికి సంకోచించాను కానీ ఇప్పుడు చెబుతున్నాను.. నేనే దానికి కారణం.. అలా చేసినందుకు బాధపడటం లేదు అని చక్రి అంటాడు. అంటే నువ్వేం కావాలంటే అది చేస్తావా అని పెద్ది అంటాడు.
చక్రికి సపోర్ట్ చేసిన కేశవ, నారాయణ
దీంతో కేశవ కూడా చక్రికి సపోర్ట్ గా వస్తాడు. మరి నువ్వేం కావాలంటే అది చేస్తావా.. శైలు ఏదో అన్నదని చెప్పి నీ జీవితం నాశనం అవుతున్నా సరే ఈ పెళ్లికి సిద్ధమయ్యావా.. అందరం పెళ్లి వద్దంటున్నా మేము దూరమవుతామని తెలిసినా ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నావు అని నిందిస్తాడు. అటు నారాయణ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇందులో తాము చేసిందేమీ లేదని, తన భర్తను తన దారికి తెచ్చుకోవడానికే ఆమె నిన్ను పావుగా వాడుకుందని అంటాడు.
తమ్ముళ్ల కోసమే ఇలా చేసానంటూ ఫీలై వెళ్లిపోయిన మాధవ
దీంతో మాధవ మరింత ఫీలవుతాడు. తాను ఏం చేసినా తన తమ్ముళ్ల కోసమే చేశానని, తన చేతులతో పెంచిన తమ్ముళ్లకు తన వల్ల పెళ్లిళ్లు కాకుండా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని, అయినా అర్థం చేసుకోకుండా పెళ్లి చెడగొడతారా అంటూ ఫీలైపోయి మాధవ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
కేశవ, శైలుని విడదీసేందుకు సురేష్, వరాలు ప్లాన్
అటు కేశవ తనను తిట్టి పంపించడాన్ని గుర్తు చేసుకుంటూ శైలు బాధపడుతుంది. గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఏం జరిగిందని సురేష్ ను అడుగుతుంది తల్లి వరాలు. ఆ మెకానిక్ గాడి అన్న నిశ్చితార్థం అని గాల్లో వెళ్లింది.. ఇప్పుడు రెక్కలు తెగిన పక్షిలా వచ్చింది.. ఏదో గట్టిగానే జరిగింది అని అంటాడు. దీనిని మనకు అనుకూలంగా మలచుకుందాం అని వరాలు అంటుంది.
ఇద్దరూ కలిసి లోనికి వెళ్తారు. అప్పుడే శైలు కేశవకు ఫోన్ చూసినా అతడు తీయడు. దీంతో సురేష్, వరాలు కలిసి శైలుకి నూరి పోస్తారు. వాడు నీకు సరిపోడని మొదటి నుంచీ చెబుతున్నా నువ్వే వినలేదు.. ఇప్పుడు చూడు పెళ్లికి ముందే ఇలా చేస్తున్నాడంటే పెళ్లి తర్వాత నీ పరిస్థితేంటి అని వరాలు అంటుంది. ఏముంది.. దీనిని వంటిల్లు కుందేలుని చేసి ఆడుకుంటాడని సురేష్ మరింత రెచ్చిగొడతాడు. కానీ శైలు మాత్రం వాళ్లను తిట్టి పంపించేస్తుంది. తర్వాత ఆలోచనలో పడుతుంది.
మాధవ కొత్త జీవితం
అటు మాధవ బాధతో బన్సీ ఇంటికి వెళ్తాడు. అక్కడ మనీషా మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. బన్సీతో మాధవ తన బాధ చెప్పుకుంటాడు. దీంతో మనీషాను పెళ్లి చేసుకోమని బన్సీ అడుగుతాడు. అందుకు మనీషా ఒప్పుకోవాలి కదా అని మాధవ అంటే.. ఆమె కూడా సిద్ధంగా ఉందని బన్సీ చెబుతాడు. ఒకరినొకరు చూసుకొని సిగ్గు పడతారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


