Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బన్సి ఇంటి దగ్గర మాధవ ఉంటాడు. జయంతితో ఎంగేజ్‌మెంట్ గురించి, కేశవ పెళ్లి గురించి, వాడు నావల్ల వాయిదా వేసుకుంటాడు అని మాధవ మాట్లాడుతాడు. మీరంతా ఒకరికొకరు ఆలోచించుకున్నారు. గొప్ప విషయమేగా భాయ్ అని బన్సీ అంటాడు.
మనీషాను పెళ్లి చేసుకుంటారా భాయ్

మనీషా టీ తీసుకొస్తుంది. తననే ఇవ్వమంటే మనీషా సిగ్గుపడుతుంది. బన్సీ ఇస్తాడు. మీరు రెండో పెళ్లి సంబంధం చేసుకోవడం మాకెవరికి ఇష్టంలేదని బన్సీ అంటాడు. ఇది కూడా తప్పిపోయింది. నాకు సంబంధాలు వస్తాయా అని మాధవ అంటాడు. మనీషాను చూసిన బన్సీ.. తడబడుతూనే మా మనీషాను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు.
దాంతో మనీషా తెగ సంతోషిస్తుంది. మాధవ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని మాధవ అంటాడు. ఇన్ని సంబంధాలు చూశారు. కానీ మా మనీషా కళ్లలో మీపై ఉన్న ప్రేమను చూడలేదు. మనీషా జీవితం బాగుండాలని మా బావకు దూరంగా తీసుకొచ్చాను. మీలాంటి మంచి మనిషికి ఇచ్చి చేస్తే జీవితాంతం నా చెల్లి గురించి బాధపడాల్సిన అవసరమే రాదని బన్సీ అంటాడు.
నా మీద జాలితో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అని మాధవ అంటాడు. మేమందరం మిమ్మల్ని గొప్పగా చూస్తున్నామే కానీ జాలిగా కాదని, తను మీ కుటుంబంలో పడితే అందరితో మంచిగా ఉంటుందని బన్సీ అంటాడు. ఆ మాట మనీషా చెప్పాలి. నువ్వు కాదని మాధవ అంటాడు. మీరే మనీషాను అడగండి. తనకు తెలుగు పూర్తిగా అర్థం అవుతుందని వెళ్లిపోతాడు బన్సీ.
కేశవ, శైలు గొడవ
మాధవను చూసి మనీషా నవ్వుతుంది. మాధవ కూడా సంతోషంగా నవ్వుతాడు. పెళ్లి ఇష్టమేనా అన్నట్లుగా తల ఊపుతాడు మాధవ. అవును అన్నట్లుగా మనీషా తల ఊపుతుంది. ఇద్దరు మౌనంగానే ప్రేమలో పడతారు. సిగ్గు పడుతూ మాధవ వెళ్లిపోతాడు. మరోవైపు శైలు చేసినదానిగురించి కేశవ ఆలోచిస్తాడు. ఇంతలో శైలు కాల్ చేస్తుంది.
{{/usCountry}}మాధవను చూసి మనీషా నవ్వుతుంది. మాధవ కూడా సంతోషంగా నవ్వుతాడు. పెళ్లి ఇష్టమేనా అన్నట్లుగా తల ఊపుతాడు మాధవ. అవును అన్నట్లుగా మనీషా తల ఊపుతుంది. ఇద్దరు మౌనంగానే ప్రేమలో పడతారు. సిగ్గు పడుతూ మాధవ వెళ్లిపోతాడు. మరోవైపు శైలు చేసినదానిగురించి కేశవ ఆలోచిస్తాడు. ఇంతలో శైలు కాల్ చేస్తుంది.
{{/usCountry}}కేశవ కాల్ కట్ చేస్తాడు. పదే పదే శైలు కాల్ చేస్తుంది. దాంతో కేశవ లిఫ్ట్ చేస్తుంది. ఇద్దరు గొడవ పడతారు. నాకు సారీ చెప్పాలని తెలియదా. నేను చేసిన తప్పు ఏంటీ అని శైలు అంటుంది. నీ స్వార్థం కోసం మా అన్నయ్య పెళ్లి జరగాలనుకోవడం తప్పే అని కేశవ అంటుంది. ఇష్టం లేని పెళ్లి మీ అన్నయ్య చేసుకుంటే బాధపడతాడని తెలిసిన నీకు నేను ఏమైపోతానే తెలియట్లేదా అంటుంది శైలు.
ఇంట్లోవాళ్లు అడిగిన ప్రశ్నలకు నిలదీస్తుంది శైలు. ఇప్పుడు కూడా సారీ చెప్పడానికి కాకుండా ఇంట్లోవాళ్లు అడిగిన దానికి చేశావా. పెట్టవే ఫోన్ సెల్ఫీష్ దానా అని కాల్ కట్ చేస్తాడు కేశవ. మరోవైపు సైకిల్‌పై మాధవ వెళ్తూ మనీషా ఊహల్లో తేలిపోతుంటాడు. బైక్‌తో ఒకడు ఎదురు వచ్చి ఢీకొడతాడు. కానీ, మాధవకు ఏం కాదు. ప్రేమలో మునిగిపోయిన మాధవ అతన్ని ఏమనకుండా వెళ్లిపోతాడు.
మనీషా ప్రేమలో మునిగిపోయిన మాధవ
మరోవైపు మాధవ ఇంకా ఇంటికి రాకపోవడంపై చక్రి, మహావాళ్లంతా మాట్లాడుకుంటారు. ఇంతలో మాధవ వస్తాడు. సైకిల్ స్టాండ్ వేయకుండానే పడేసి వస్తాడు. చక్రివాళ్లు ఏం మాట్లాడిన వినిపించుకోకుండా మాధవ వెళ్తాడు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావని అడిగితే.. మాధవ నవ్వేసి వెళ్లిపోతాడు. ఈ లోకంలోనే లేడేంటని కేశవ అంటాడు.
గదిలో మాధవ ఏం చేస్తున్నాడని వెళ్లి చూస్తారు. మాధవ సిగ్గుపడుతూ నవ్వడం చూసి షాక్ అవుతారు. అంతా పిలిచిన పలకడు పెద్ది. గాలిసోకి ఉంటుందా అని చక్రి అంటాడు. మాధవని గట్టిగా పిలిచి ఏమైందని అడిగితే.. ఏం కాలేదంటాడు. కలిసి తిందామని అడగ్గానే వెళ్లి కూర్చుంటాడు. మనమే అన్ని తీసుకొచ్చి పెడదామని పెడతారు.
మహాలక్ష్మి అన్నం వడ్డిస్తుంది. కూర వేయకుండానే మాధవ తింటాడు. ఎంగేజ్‌మెంట్ జరగనందుకు బాధగా ఉందా అని చక్రి అడుగుతాడు. ఇంకోవైపు నారాయణ తాగుతుంటాడు. మాధవ సైలెంట్‌గా వెళ్తాడు. మాధవను పిలిచి నీకు రాసిపెట్టాలని గుండె రాయి చేసుకోమ్మని చెబుతాడు నారాయణ. ఏం జరిగిన అంతా మనమంచికే నాన్న అని మాధవ అంటాడు.
కొడుకును మందు తాగమన్న నారాయణ
కాస్తా నాలుగు పెగ్గులు వేస్తావా ఏంటీ అని నారాయణ అడుగుతాడు. మందు తాగితే మత్తుగా నిద్రపడుతుందని మాధవ అంటాడు. అందుకేగా తాగమంది. మతిగాని చెడిపోయిందా ఏంటీ అని నారాయణ అనుకుంటాడు. చక్రిని లోపలికి రమ్మని పిలుస్తుంది మహాలక్ష్మి. దాంతో మహా రొమాంటిక్‌గా పిలిచిందనుకుని చక్రి సంతోషంతో షాక్ అవుతాడు. నన్ను తన గదిలోకి రమ్మంది. ఇంత తొందరగా నా పంటపండుతుందనుకోలేదే అని చక్రి ఎగిరి గంతేస్తాడు.
సెంట్ కొట్టుకుని మరి మహా గదిలోకి వెళ్తాడు. ఇప్పుడు ఎవరు లేరుగా. ఏం మాట్లాడుకున్నా ఎవరికి వినపడదు కదా అని మహాలక్ష్మి అంటుంది. అవును చెప్పేయండి అని చక్రి అంటాడు. తలుపు వేయమని మహాలక్ష్మి అంటుంది. దాంతో చక్రి తలుపు మూస్తాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.