Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మహా, కన్నా నడుచుకుంటూ వెళ్తుంటే చక్రి పరుగెత్తుకుని వస్తాడు. బస్టాప్‌లో గోపిక కోసం అలా వచ్చానని, నేను లేకుండా తను ఉండలేకపోతుందట అని చక్రి చెబుతాడు. మహా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోయేసరికి డోస్ పెంచాలని చక్రి అనుకుంటాడు.
నార్త్ ఇండియా పద్ధతిలో

మాధవ పెళ్లి నార్త్ ఇండియా పద్ధతిలో పెళ్లి చేసి సౌతిండియా స్టైల్‌లో తాళి కట్టిద్దామని చక్రి అంటాడు. ఇప్పుడే పెద్ది పెళ్లి చేయొద్దు. వాళ్లిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకా చేద్దామని మహాలక్ష్మి అంటుంది. బస్టాప్‌లో గోపిక కనిపిస్తుంది. దాంతో గోపికకు దగ్గరవుతానని చక్రి వెళ్లిపోతాడు. మీకోసం జీవితాంతం వెయిట్ చేస్తానని గోపిక అంటుంది.
బాగా కనెక్ట్ అవుతుంది. డిస్‌కనెక్ట్ చేయాలని మనసులో అనుకుంటాడు చక్రి. కానీ, మహా చూస్తుందని డ్రెస్, చెవికమ్మలు బాగున్నాయంటూ పులిహార కలుపుతాడు చక్రి. మరోవైపు మనీషా క్యారేజ్ తెచ్చింది. తిందామని మాధవతో బన్సీ అంటాడు. మాధవకు అన్నం వడ్డిస్తుంది మనీషా. నీకు తెలుగు కూడా వచ్చా అని మాధవ అంటాడు.
మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేర్చుకోవాలిగా అని హిందీలో అంటుంది మనీషా. మాధవకు అర్థం కాదు. తనకు అన్నం వద్దని, ఫోన్ మర్చిపోయాను అని బన్సీ వెళ్లిపోతాడు. వంట చాలా బాగుందని, అలా అని నాకోసం ప్రతిరోజు తీసుకురావద్దు. అప్పుడప్పుడు తీసుకురా అని మాధవ అంటాడు. మనీషాను తిన్నావా అని అడిగితే తర్వాత తింటానంటుంది.
మనీషాకు మాధవ గోరు ముద్దలు
లేదు. నాతోపాటే తినాలని మనీషా చేతిలో గోరు ముద్దలుపెడతాడు మాధవ. మనీషా తింటుంది. అలా మాధవ, మనీషా తింటారు. నాకోసం గాజులు (చుడియా) తీసుకొస్తారా అని హిందీలో అడుగుతుంది మనీషా. నీ చేతికి మట్టిగాజులు చాలా బాగుంటాయని చేయి ముట్టి మాట్లాడుతాడు మాధవ. దాంతో తన్మయత్మంతో మురిసిపోతుంది మనీషా. తనను ఇదివరకు మాధవ పట్టుకుంది గుర్తు చేసుకుని రొమాంటిక్‌గా ఫీల్ అవుతుంది మనీషా.
{{/usCountry}}లేదు. నాతోపాటే తినాలని మనీషా చేతిలో గోరు ముద్దలుపెడతాడు మాధవ. మనీషా తింటుంది. అలా మాధవ, మనీషా తింటారు. నాకోసం గాజులు (చుడియా) తీసుకొస్తారా అని హిందీలో అడుగుతుంది మనీషా. నీ చేతికి మట్టిగాజులు చాలా బాగుంటాయని చేయి ముట్టి మాట్లాడుతాడు మాధవ. దాంతో తన్మయత్మంతో మురిసిపోతుంది మనీషా. తనను ఇదివరకు మాధవ పట్టుకుంది గుర్తు చేసుకుని రొమాంటిక్‌గా ఫీల్ అవుతుంది మనీషా.
{{/usCountry}}మరోవైపు చక్రికి లాయర్ కాల్ చేస్తాడు. కౌన్సిలింగ్ కోసం రేపు రావాలని చెబుతాడు. రేపు వాయిదా ఉందని మర్చిపోయి నేను విజయవాడ వచ్చాను. ఈసారికి వాయిదా ఇవ్వమని జడ్డ్ గారిని అడగండని చక్రి అంటాడు. మీ ఆవిడేమో విడాకులు కావాలని అడుగుతుంది. సరే వాయిదా అడుగి డేట్ మెసేజ్ చేస్తానని లాయర్ కాల్ కట్ చేస్తాడు.
మరోవైపు మహా తన ఫ్రెండ్‌లో లేఅవుట్ వేస్తుంది. అది చాలా బాగుందని విక్కీ మెచ్చుకుంటాడు. రేపు క్లైంట్స్‌కు ప్రజంటేషన్ ఇవ్వాలని, అది మహాకే అప్పగిస్తున్నానని విక్కీ అంటాడు. ముందు ఒప్పుకోని లక్కీ తర్వాత ఒప్పుకుంటుంది. ప్రాజెక్ట్ డిజైన్ గురించి అడిగి కాల్ రావడంతో వెళ్లిపోతాడు విక్కీ. ఫస్ట్ టైమ్ క్లైంట్స్ దగ్గర ప్రజంటేషన్ ఇవ్వబోతున్నాగా. కొంచెం నెర్వస్‌గా ఉందంటుంది మహాలక్ష్మి.
కౌన్సిలింగ్‌కి రాలేను
ఇంతలో మహాకు లాయర్ కాల్ చేసి కౌన్సిలింగ్ గురించి చెబుతాడు. రేపు ఉదయమే ఉంది. మీ ఆయన ఎక్కడో ఉన్నాడట. నువ్వు ఇక్కడే ఉన్నావా అని లాయర్ అడుగుతాడు. ఇక్కడే ఉన్నా. కానీ హియరింగ్ రాలేను సర్. ఆఫీస్ క్లైంట్స్ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ డేట్‌ను ఇంకోరోజుకు మార్చమని మహా అడుగుతుంది. సరేనని లాయర్ కాల్ కట్ చేస్తాడు.
మరోవైపు కాఫీ తీసుకోండి బ్రో అని మాధవ చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఇంతలో చక్రి వస్తాడు. వర్షం వల్ల అందరి పనులు ఆగిపోయాయని కన్నా చెబుతాడు. చక్రిని కూడా మాధవ బ్రో అనడంతో ఆశ్చర్యపోతాడు. ఇంతలో మహాలక్ష్మి వస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ ఉంది త్వరగా వచ్చానని మహా చెబుతుంది. ఫ్రెష్ అయి రా. మన మాధవ బ్రో కాఫీ పెట్టిస్తాడు. మాధవ అన్నయ్య అంతా యూత్‌లో యో యో గా మారిపోయాడని కన్నా చెబుతాడు.
ఇదంతా మనీషా పెళ్లి చేసుకోవడం వల్లే అని చక్రి అంటాడు. కౌన్సిలింగ్ గురించి ఏం అడగట్లదేంటీ అని చక్రి ఆలోచిస్తుంటాడు. రేపు కౌన్సిలింగ్ ఉందని పాయింట్ లాయర్ చెప్పాడు. వెళ్లడం నాకు కుదరదని చెప్పాను అని మహాలక్ష్మి అంటుంది. ఏంటీ అని చక్రి గట్టిగా అరిచి షాక్ అవుతాడు. కేశవ భయపడతాడు.
చితకబాదిన మహా
తర్వాత అందరు ఫోన్‌లో బిజీగా ఉన్నారని మహాకు కన్నా చెబుతాడు. మనీషాకు మాధవ లవ్ మెసేజ్‌లు చేయడం, శైలుతో కేశవ, గోపికతో చక్రి ఫోన్‌లో మాట్లాడుతుండటం మహాకు చూపిస్తాడు కన్నా. మహాను చూసి ఏంటీ లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామా, సరే గోపి అని చక్రి అంటాడు.
అలా అన్నదమ్ములు తమ లవర్స్‌తో రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. అందరికి లవర్ ఉంది నాకే లేదు అని కన్నా ఫీల్ అవుతాడు. ఏంట్రా నీకు లవర్ కావాల అని కన్నాను కర్రతో కొడుతుంది మహాలక్ష్మి. అదే గ్యాపులో చక్రిని కూడా కొడుతుంది. లాంగ్ డ్రైవ్‌లు ఎత్తిపోతల జలాలు అంటూ చితకబాదుతుంది. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.